Just In
- 1 hr ago
ఇదుగిదిగో.. కొత్త 2021 ఫోర్స్ గుర్ఖా; త్వరలో విడుదల, కొత్త వివరాలు వెల్లడి
- 2 hrs ago
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?
- 3 hrs ago
ఘన విజయం సాధించిన ఇండియన్ క్రికెట్ టీమ్‌కి ఆనంద్ మహీంద్రా స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..!
- 1 day ago
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
Don't Miss
- Movies
టాలీవుడ్లో మరో భారీ మల్టీస్టారర్: బన్నీ, విజయ్ కాంబోలో మూవీ.. చిన్న డైరెక్టర్.. పెద్ద నిర్మాత ప్లాన్!
- News
అప్పుడెందుకు వాయిదా వేశారు ? జగన్ కు మద్దతుగా పంచాయితీ పోరుపై నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు
- Finance
సెన్సెక్స్ దిద్దుబాటు! నిర్మల ప్రకటన అంచనాలు అందుకోకుంటే.. మార్కెట్ పతనం?
- Lifestyle
Zodiac signs: మీ రాశిని బట్టి మీకు ఎలాంటి మిత్రులు ఉంటారో తెలుసా...!
- Sports
ఇంగ్లండ్ అలా చేయకుంటే భారత్‌ను అవమానపరిచినట్టే.. జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ల ఫైర్!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హోండా హైనెస్ సిబి 350 మోటార్‌సైకిల్‌పై డిసెంబర్ ఆఫర్లు
హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా (హెచ్‌ఎమ్ఎస్‌ఐ) లిమిటెడ్ ఇటీవల భారత మార్కెట్లో విడుదల చేసిన సరికొత్త క్రూయిజర్ మోటార్‌సైకిల్ హోండా హైనెస్ సిబి 350 మోడల్‌పై కంపెనీ ఇయర్-ఎండ్ ఆఫర్లను ప్రకటించింది. డిసెంబర్ 2020 ఆఫర్లలో భాగంగా, కంపెనీ ఈ మోడల్‌పై నగదు ప్రయోజనాలను మరియు ప్రత్యేక ఫైనాన్స్ పథకాలను అందిస్తోంది.

ఇప్పుడు హోండా హైనెస్ సిబి 350 రోడ్‌స్టర్ మోటార్‌సైకిల్‌ను క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ఈఎమ్ఐ ఫైనాన్స్ ఆఫర్ ఉపయోగించి కొనుగోలు చేయవచ్చు. ఇలా కొనుగోలు చేసిన కస్టమర్లు రూ.5,000 క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.

ఇదొక సులువైన ఈఎమ్ఐ విధానం, ఈ ఫైనాన్స్ పథకానికి ఎలాంటి అదనపు డాక్యుమెంటేషన్ అవసరం లేదు మరియు దీని ద్వారా కొనుగోలు చేసిన వాహనాన్ని బ్యాంకుకు హైపోథెకేట్ చేయవలసిన అవసరం కూడా లేదు. అంతేకాకుండా, ఈ పథకం ద్వారా కొనుగోలు చేయటానికి ఎలాంటి ముందస్తు డౌన్‌పేమెంట్ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.
MOST READ:మోడిఫైడ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బైక్.. ఇప్పుడు మరింత సూపర్ స్టైల్ గురూ!

కార్డ్-ఆధారిత ఈఎమ్ఐ కోసం దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులందరికీ పైన్ ల్యాబ్స్ మద్దతు ఇస్తుంది. ఈ ఆఫర్‌లు దేశవ్యాప్తంగా వర్తిస్తాయి మరియు ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ కొనుగోళ్ల ద్వారా కూడా దీనిని పొందవచ్చు. డిసెంబర్ 2020 నెలలో చేసిన కొనుగోళ్లకు మాత్రమే ఈ ఇయర్-ఎండ్ ప్రయోజనాలు మరియు ఫైనాన్స్ పథకాలు వర్తిస్తాయి.

ఇక హోండా హైనెస్ సిబి 350 మోటార్‌సైకిల్ విషయానికి వస్తే, ఇది డీలక్స్ మరియు డీలక్స్ ప్రో అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. ప్రతి వేరియంట్ కూడా మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. మార్కెట్లో హోండా హైనెస్ సిబి 350 ప్రారంభ ధర రూ.1.85 లక్షలుగా ఉంది. ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.1.90 లక్షలుగా ఉంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).
MOST READ:ట్రాక్టర్ ధరలను పెంచనున్న మహీంద్రా.. ఎప్పటినుంచో తెలుసా !

ఈ సరికొత్త రెట్రో లుకింగ్ మోటార్‌సైకిల్‌లో గుండ్రటి ఆకారంలో ఉండే ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్ లాంప్స్ మరియు టర్న్-సిగ్నల్ ఇండికేటర్స్ ఉంటాయి. దీని రెట్రో రూపాన్ని మరింత పెంచేందుకు గుండ్రటి సైడ్ మిర్రర్స్, పెద్ద ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటాయి. ఈ మోటారుసైకిల్ సైలెన్సర్‌తో సహా కొన్ని ఇతర భాగాలు క్రోమ్‌తో ఫినిష్ చేయబడి ఉంటాయి.

హోండా హైనెస్ సిబి 350 సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది, ఇది రైడర్‌కు కావల్సిన డేటాను అందిస్తుంది. మోటార్‌సైకిల్‌ను స్మార్ట్‌ఫోన్‌తో అనుసంధానం చేయటం కోసం ఇందులో బ్లూటూత్ కనెక్టింగ్ టెక్నాలజీతో కూడిన బ్రాండ్ యొక్క మొట్టమొదటి ‘హోండా స్మార్ట్‌ఫోన్ వాయిస్ కంట్రోల్ సిస్టమ్' కూడా ఇందులో ఉంటుంది. ఇంకా ఇందులో హోండా టార్క్ కంట్రోల్ ఫంక్షన్‌ను కూడా ఉంది.
MOST READ:భారత్‌లో కొత్త ఆడి ఏ4 బుకింగ్స్ ప్రారంభం; అఫీషియల్ లాంచ్ ఎప్పుడంటే..

ఈ మోటార్‌సైకిల్‌పై సస్పెన్షన్‌ను గమనిస్తే, ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో ట్విన్-షాక్ సస్పెన్షన్ యూనిట్స్ ఉంటాయి. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లు అమర్చబడి ఉంటాయి, ఇవి డ్యూయల్-ఛానల్ ఏబిఎస్‌ను సపోర్ట్ చేస్తాయి. ఇందులో ట్యూబ్ లెస్ టైర్లతో కూడిన అల్లాయ్ వీల్స్ ఉంటాయి.

భారత మార్కెట్లో లభిస్తున్న అత్యంత సరసమైన ప్రీమియం మోటార్‌సైకిళ్లలో హోండా హైనెస్ సిబి 350 కూడా ఒకటి. ఈ రోడ్‌స్టర్ మోటార్‌సైకిల్‌కు మార్కెట్లో మంచి ఆదరణ లభించింది, దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అమ్ముడవుతోంది. హోండా హైనెస్ సిబి 350 ఈ విభాగంలో ప్రధానంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350కి పోటీగా నిలుస్తుంది.
MOST READ:మీకు తెలుసా.. దేశప్రజలకు అందుబాటులోకి రానున్న కొత్త ఇంటెర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇదే