హోండా యునికార్న్‌పై రూ.5,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్ - డీటేల్స్

హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా (హెచ్‌ఎమ్ఎస్‌ఐ) లిమిటెడ్ అందిస్తున్న పాపులర్ 160సీసీ మోటార్‌సైకిల్ యునికార్న్‌పై కంపెనీ ప్రత్యేకమైన క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. బిఎస్6 వెర్షన్ హోండా యునికార్న్ మోటార్‌సైకిల్‌ను కొనుగోలు చేసే కస్టమర్లకు కంపెనీ రూ.5,000 క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది.

హోండా యునికార్న్‌పై రూ.5,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్ - డీటేల్స్

ఈ మోటార్‌సైకిల్‌ను క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ఈఎమ్ఐ ఫైనాన్స్ ఆఫర్ ఉపయోగించి కొనుగోలు చేసే వారికి మాత్రేమ ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఐసిఐసిఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యెస్ బ్యాంక్, స్టాండర్డ్ చార్టెడ్, ఫెడరల్ బ్యాంక్ కంపెనీలు అందించే డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల నుండి ఈఎమ్ఐ ద్వారా కొనుగోలు చేసే వారికి మాత్రమే ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ లభిస్తుంది.

హోండా యునికార్న్‌పై రూ.5,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్ - డీటేల్స్

క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ఈఎమ్ఐ విధానం ద్వారా, ఈ మోటార్‌సైకిల్‌ను కొనుగోలు చేయటం వలన ఎలాంటి ముందస్తు చెల్లింపు (డౌన్‌పేమెంట్) చేయాల్సిన అవసరం ఉండదని, అంతేకాకుండా ఇందుకోసం ఎటువంటి డాక్యుమెంటేషన్ మరియు హైపోథెకేషన్ కూడా ఉండదని కంపెనీ తమ ప్రకటనలో పేర్కొంది.

MOST READ:వెహికల్‌పై పేర్లు ఉంటే ఇప్పుడే తీసెయ్యండి.. లేకుంటే ఏమవుతుందో తెలుసా..!

హోండా యునికార్న్‌పై రూ.5,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్ - డీటేల్స్

కార్డ్-ఆధారిత ఈఎమ్ఐ కోసం దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులందరికీ పైన్ ల్యాబ్స్ మద్దతు ఇస్తుంది. ఈ ఆఫర్‌లు దేశవ్యాప్తంగా వర్తిస్తాయి మరియు ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ కొనుగోళ్ల ద్వారా కూడా దీనిని పొందవచ్చు.

హోండా యునికార్న్‌పై రూ.5,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్ - డీటేల్స్

హోండా యునికార్న్ విషయానికి వస్తే, దీనిని డైమండ్ టైప్ ఫ్రేమ్‌పై తయారు చేశారు. ఇది చాలా సింపుల్ డిజైన్‌ని కలిగి ఉండి సాటిలేని పెర్ఫార్మెన్స్‌ను మరియు మెరుగైన మైలేజీని ఆఫర్ చేస్తుంది.

MOST READ:ఇంద్రభవనం లాంటి విమానం.. ఇది చూస్తే ఒక్కసారైనా వెళ్లాలనిపిస్తుంది.. ఓ లుక్కేసెయ్యండి

హోండా యునికార్న్‌పై రూ.5,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్ - డీటేల్స్

ఈ మోటార్‌సైకిల్‌లో అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, హాలోజన్ హెడ్‌ల్యాంప్, బల్బ్ టెయిల్ లైట్ మరియు ట్యూబ్ లెస్ టైర్లతో కూడిన 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంటుంది. ఇది మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, ఇంపీరియల్ రెడ్ మెటాలిక్ మరియు పెరల్ ఇగ్నియస్ బ్లాక్ రంగులలో లభిస్తుంది.

హోండా యునికార్న్‌పై రూ.5,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్ - డీటేల్స్

ఇంజన్ విషయానికి వస్తే, హోండా యునికార్న్ బిఎస్6 మోడల్‌లో 162.7 సిసి, సింగిల్ సిలిండర్, ఫ్యూయెల్-ఇంజెక్ట్ ఇంజన్‌ను ఉపయోగించారు. హోండా ఎకో టెక్నాలజీ (హెచ్‌ఇటి)తో రూపొందిన ఈ ఇంజన్ గరిష్టంగా 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 12.73 హెచ్‌పి పవర్‌ను మరియు 5,000 ఆర్‌పిఎమ్ వద్ద 14 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ:రూ. 41,500 జరిమానాతో సీజ్ చేయబడిన డ్యాన్స్ స్కార్పియో ; కారణం ఏంటో తెలుసుకోండి

హోండా యునికార్న్‌పై రూ.5,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్ - డీటేల్స్

ఈ మోటార్‌సైకిల్‌లో రైడర్ సేఫ్టీ కోసం ముందు చక్రంలో డిస్క్ బ్రేక్, వెనుక చక్రంలో డ్రమ్ బ్రేక్ ఉంటుంది. మెరుగైన బ్రేకింగ్ కోసం ఇది సింగిల్-ఛానల్ ఏబిఎస్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి.

హోండా యునికార్న్‌పై రూ.5,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్ - డీటేల్స్

ప్రస్తుతం మార్కెట్లో బిఎస్ 6-కంప్లైంట్ హోండా యునికార్న్ మోటార్‌సైకిల్‌ను ఒకే వేరియంట్‌లో అందిస్తున్నారు. మార్కెట్లో దీని ధర రూ.95,152 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

MOST READ:భయంకర ప్రమాదం నుంచి చిటికెలో తపించుకున్న యువకులు [వీడియో]

హోండా యునికార్న్‌పై రూ.5,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్ - డీటేల్స్

యాక్టివా 6జి, హార్నెట్ 2.0 మోడళ్లపై క్యాష్‌బ్యాక్ ఆఫర్

హోండా అందిస్తున్న పాపులర్ యాక్టివా 6జి మరియు హార్నెట్ 2.0 మోడళ్లపై కంపెనీ క్యాష్‌బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది. ఈ రెండు మోడళ్లను క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా ఇఎమ్ఐ ఆప్షన్‌పై కొనుగోలు చేసినట్లయితే, సదరు కస్టమర్లు 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Now Honda Unicorn Buyers Can Get Rs.5,000 Cashback, Here Is How. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X