Just In
- 2 hrs ago
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- 3 hrs ago
దక్షిణ భారత్‌లో కొత్త డీలర్షిప్ ఓపెన్ చేసిన బెనెల్లీ; వివరాలు
- 4 hrs ago
భారత్‌లో మరే ఇతర కార్ కంపెనీ సాధించని ఘతను సాధించిన కియా మోటార్స్!
- 5 hrs ago
రిపబ్లిక్ డే పరేడ్‌లో టాటా నెక్సాన్ ఈవీ; ఏం మెసేజ్ ఇచ్చిందంటే..
Don't Miss
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- News
ఏకగ్రీవాలపై వివరణ కోరాం, ఆటంకం కలిగిస్తే కోర్టుకే, మంత్రి వ్యాఖ్యలు బాధించాయి: నిమ్మగడ్డ రమేష్ కుమార్
- Movies
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హీరో లెక్ట్రో ఎఫ్6ఐ స్మార్ట్ ఎలక్ట్రిక్ సైకిల్ విడుదల; ధరెంతో తెలుసా?
భారతదేశపు ప్రముఖ సైకిల్ బ్రాండ్ హీరో సైకిల్స్, భారత మార్కెట్లో తమ లెక్ట్రో ఎఫ్6ఐ స్మార్ట్ ఎలక్ట్రిక్ సైకిల్‌ను విడుదల చేసింది. ఈ సరికొత్త సైకిల్‌లో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో సహా అనేక ఇతర ఫీచర్లు ఉన్నాయని కంపెనీ పేర్కొంది.

హీరో సైకిల్స్ కొత్తగా విడుదల చేసిన ఈ స్మార్ట్ ఎలక్ట్రిక్ సైకిల్‌ను కస్టమర్లు ఆన్‌లైన్‌లో కానీ లేదా బ్రాండ్ యొక్క ఆఫ్‌లైన్ డీలర్‌షిప్‌లలో కానీ రూ.5,000 టోకెన్ అమౌంట్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఈ సైకిల్ పసుపు / నలుపు మరియు ఎరుపు / నలుపు అనే రెండు డ్యూయల్-టోన్ రంగులలో లభిస్తుంది.

ఈ సైకిల్‌ను తేలికపాటి బరువు గల అల్లాయ్ ఫ్రేమ్‌తో తయారు చేశారు. ఇందులోని సీటును రైడర్ ఎత్తుకు తగినట్లుగా సర్దుబాటు చేసుకోవచ్చు. ఇందులోని ఇతర ఫీచర్లలో కెండా నుండి గ్రహించిన టైర్లు, తేలికపాటి అల్లాయ్ వీల్స్, స్మార్ట్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్రంట్ మరియు రియర్ ల్యాంప్స్ వంటి ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.
MOST READ:కేవలం 10 నిముషాల్లో పుల్ ఛార్జ్ చేసుకోగల సాలీడ్ స్టేట్ బ్యాటరీ ; పూర్తి వివరాలు

హీరో లెక్ట్రో ఎఫ్6ఐ సైకిల్‌లోని మరో ప్రధానమైన ఫీచర్ ఏంటంటే, ఇందులోని బ్యాటరీ. ఈ సైకిల్‌లోని బ్యాటరీని వేరు చేయగలిగే సౌలభ్యం ఉంటుంది. ఈ బ్యాటరీ ప్యాక్‌ను ఫ్రేమ్‌పై భాగంలో అమర్చారు. సైకిల్‌ను నేరుగా చార్జింగ్ చేయటం కుదరని వారు, బ్యాటరీ ప్యాక్‌ని తీసివేసి విడిగా ఛార్జ్ చేసుకోవచ్చు.

ఈ సైకిల్‌లోని బ్యాటరీ ప్యాక్ ఐపి67 వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఇది 250 వాట్ ఎలక్ట్రిక్ మోటారుకు శక్తినిస్తుంది. పూర్తి బ్యాటరీ చార్జ్‌పై గరిష్టంగా 50 కిలోమీటర్ల దూరం వరకూ ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది.
MOST READ:భారత్‌లో బెస్ట్ సేఫ్టీ రేటింగ్ దక్కించుకున్న టాప్-5 సేఫెస్ట్ కార్స్ ఇవే..

హీరో లెక్ట్రో ఎఫ్6ఐ సైకిల్ రెండు చివర్లలో థ్రోటల్ ఉంటుంది. ఎలక్ట్రో-పెడల్ టెక్నిక్ కలయికను ఉపయోగించినట్లయితే, ఈ సైకిల్ రేంజ్ మరో 10 కిలోమీటర్లు పెరుగుతుంది. అంటే, బ్యాటరీ మరియు పెడల్ పవర్‌ని ఒకేసారి వినియోగించాలన్నమాట. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ గరిష్టంగా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.

ఈ సైకిల్‌లో ఎలక్ట్రిక్ మోటార్‌ను వెనుక వీల్ హబ్‌లో అమర్చబడి ఉంటుంది. ఇందులోని బ్యాటరీ పవర్ 7-స్పీడ్ షిమనో ఆల్టస్ గేర్‌బాక్స్ సహాయంతో వెనుక చక్రానికు పంపిణీ అవుతుంది.
హీరో లెక్ట్రో ఎఫ్6ఐ ఎలక్ట్రిక్ సైకిల్ ఇదివరకు చెప్పుకున్నట్లుగానే స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ సిస్టమ్ ఉంటుంది. ఇది సైకిల్‌కు సంబంధించిన సమాచారాన్ని రైడర్‌కు యాప్ సాయంతో తెలియజేస్తుంది.

సైక్లింగ్ సమయంలో స్మార్ట్ ఫోన్‌ను చార్జ్ చేసుకునేందుకు ఇందులో ఓ ప్రత్యమైన యూఎస్‌బి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంటుంది. ఈ సైకిల్‌పై సున్నితమైన రైడ్ కోసం టెలిస్కోపిక్ సస్పెన్షన్‌ను ఉపయోగించారు.
ఇంకా ఇందులో రైడర్ భద్రత కోసం, కంపెనీ రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లను అమర్చింది. అలాగే, ఈ సైకిల్ సురక్షితంగా భద్రపరచడంలో సహాయపడేందుకు ఇందులో ఆర్ఎఫ్ఐడి టెక్నాలజీతో కూడిన సెక్యూరిటీ ట్యాగ్ ఎనేబుల్డ్ లాక్‌ను కూడా కంపెనీ అందిస్తోంది.

ఇన్ని అధునాతన ఫీచర్లతో కూడిన ఈ హీరో లెక్ట్రో ఎఫ్6ఐ స్మార్ట్ ఎలక్ట్రిక్ సైకిల్ ధర మార్కెట్లో రూ.రూ.49,000 లుగా ఉంది. రద్దీగా ఉండే నగరాల్లో సులువుగా గమ్యం చేరుకునేదంకుదు గానూ ఇది రోజువారీ ప్రయాణాలకు అనువుగా ఉంటుంది. పైగా దీని వలన పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు.
హీరో సైకిల్స్ బ్రాండ్‌కి సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, హీరో గ్రూపుకి చెందిన ప్రీమియం సైకిళ్ల తయారీ సంస్థ ఫైర్‌ఫాక్స్, పిల్లలు మరియు ప్రీ-టీనేజర్ల కోసం ప్రత్యేకంగా దేశంలోనే తమ మొట్టమొదటి ఎక్స్‌పీరియెన్షల్ షోరూమ్ న్యూఢిల్లీలో ప్రారంభించినట్లు ప్రకటించింది.
MOST READ:ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి సూపర్ ప్లాన్.. అదేంటో తెలుసా ?

ఉత్తర భారతదేశంలోనే ఈ తరహా స్టోర్ మొట్టమొదిటదని కంపెనీ పేర్కొంది. ఉత్తర భారతదేశపు అతిపెద్ద బొమ్మలు మరియు సైకిల్ మార్కెట్ అయిన జండేవాలాన్, న్యూ ఢిల్లీలో ఈ స్టోర్‌ను ప్రారంభించారు. ఈ షోరూమ్‌లో 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల కోసం ప్రత్యేకమైన సైకిల్ కలెక్షన్ ఉంటుంది. - మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.