మీటియోర్ 350 కన్నా హోండా సిబి 350 వెయిటింగ్ పీరియడే చాలా తక్కువ!

హోండా ద్విచక్ర వాహన విభాగం ఈ ఏడాది భారత మార్కెట్లో విడుదల చేసిన సక్సెస్‌ఫుల్ మోటార్‌సైకిళ్లలో హోండా హైనెస్ సిబి350 ఒకటి. ఈ విభాగంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 మోడల్‌కి ప్రధాన పోటీదారుగా వచ్చిన ఈ కొత్త హోండా రెట్రో లుకింగ్ మోటార్‌సైకిల్‌ వెయిటింగ్ పీరియడ్ ఇప్పుడు గణనీయంగా తగ్గింది. కేవలం ఒక్క నెల వ్యవధిలోనే ఇది కస్టమర్ల వద్దకు చేరుకుంటోంది.

మీటియోర్ 350 కన్నా హోండా సిబి 350 వెయిటింగ్ పీరియడే చాలా తక్కువ!

హోండా ఇప్పటి వరకూ భారత మార్కెట్లో 4,000 యూనిట్లకు పైగా హైనెస్ సిబి 350 మోటార్‌సైకిళ్లను విక్రయించింది. హోండా తమ 'బిగ్‌వింగ్' అనే ప్రత్యేకమైన డీలర్‌షిప్ కేంద్రాల ద్వారా ఈ మోడల్‌ను విక్రయిస్తోంది. ఈ బైక్ భారతదేశంలో లాంచ్ అయినప్పుడు, ఇది కేవలం ఐదు బిగ్‌వింగ్ షోరూమ్‌లలో మాత్రమే లభించేంది. కానీ ఇప్పుడు, హోండా దేశవ్యాప్తంగా తన బిగ్‌వింగ్ షోరూమ్‌ల సంఖ్యను విస్తరిస్తోంది.

మీటియోర్ 350 కన్నా హోండా సిబి 350 వెయిటింగ్ పీరియడే చాలా తక్కువ!

ఈ విభాగంలో హోండా హైనెస్ సిబి350 మోడల్‌కి ప్రధాన ప్రత్యర్థి అయిన రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 వెయిటింగ్ పీరియడ్ ప్రస్తుతం చాలా నగరాల్లో నాలుగు నెలల వరకు ఉంటోంది. ఇదే సమయంలో హోండా హైనెస్ సిబి350 వెయిటింగ్ పీరియడ్ కేవలం నెలలోపే ఉంటోంది. కొన్ని ప్రాంతాల్లో అయితే డీలర్లు తక్షణ డెలివరీలు కూడా చేస్తున్నారు.

MOST READ:రూ. 41,500 జరిమానాతో సీజ్ చేయబడిన డ్యాన్స్ స్కార్పియో ; కారణం ఏంటో తెలుసుకోండి

మీటియోర్ 350 కన్నా హోండా సిబి 350 వెయిటింగ్ పీరియడే చాలా తక్కువ!

ఈ నేపథ్యంలో, చాలా మంది రాయల్ ఎన్‌ఫీల్డ్ అభిమానులు కూడా హోండా హైనెస్ సిబి350 వైపే మొగ్గుచూపుతున్నారు. ఇందులో డ్యూయెల్ టోన్ బ్లూ కలర్ ఆప్షన్ డీలక్స్ ప్రో వేరియంట్ కోసం వెయిటింగ్ పీరియడ్ సుమారు నెల వరకూ ఉంటోంది. మిగిలిన వేరియంట్లను డీలర్లు తక్షణమే డెలివరీ చేస్తున్నట్లు సమాచారం.

మీటియోర్ 350 కన్నా హోండా సిబి 350 వెయిటింగ్ పీరియడే చాలా తక్కువ!

కొన్ని బిగ్‌వింగ్ డీలర్‌షిప్ కేంద్రాలయితే, లభ్యతను బట్టి ఈ మోటార్‌సైకిల్‌ను నేరుగా కస్టమర్ ఇంటికే డెలివరీ చేస్తున్నాయి. మన తెలుగువారి కోసం తెలంగాణాలోని హైదరాబాద్‌లో మూడు మరియు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఒకటి చొప్పున మొత్తం నాలుగు హోండా బిగ్‌వింగ్ షోరూమ్‌లు ఉన్నాయి.

MOST READ:నడిరోడ్డుపై జరిగిన ఈ సంఘటన చూస్తే ఒళ్ళు ఝల్లుమంటుంది.. కావాలంటే ఈ వీడియో చూడండి

మీటియోర్ 350 కన్నా హోండా సిబి 350 వెయిటింగ్ పీరియడే చాలా తక్కువ!

సరమైన ధర, విశ్వసనీయమైన బ్రాండ్ కారణంగా హోండా హైనెస్, అతి తక్కువ సమయంలోనే మార్కెట్లో మంచి విజయాన్ని సాధించింది. మార్కెట్లో హోండా హైనెస్ సిబి350 డీలక్స్ మరియు డీలక్స్ ప్రో అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. ప్రతి వేరియంట్ కూడా మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

మీటియోర్ 350 కన్నా హోండా సిబి 350 వెయిటింగ్ పీరియడే చాలా తక్కువ!

మార్కెట్లో హోండా హెచ్‌నెస్ సిబి350 ప్రారంభ ధర రూ.1.85 లక్షలుగా ఉంది. ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.1.90 లక్షలుగా ఉంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).

హోండా హెచ్‌నెస్ సిబి 350 మోటార్‌సైకిల్ గుండ్రటి ఆకారంలో ఉండే ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్ లాంప్స్ మరియు టర్న్-సిగ్నల్ ఇండికేటర్స్‌తో ఇది రెట్రో క్లాసిక్ లుక్‌ని కలిగి ఉంటుంది. దీని రెట్రో రూపాన్ని మరింత పెంచేందుకు ఇందులో గుండ్రటి సైడ్ మిర్రర్స్ మరియు పెద్ద ఫ్యూయెల్ ట్యాంక్‌ కూడా ఉంటాయి.

MOST READ:దీని ముందు టెస్లా కూడా దిగదుడుపేనండోయ్.. ఎందుకో చూడండి

మీటియోర్ 350 కన్నా హోండా సిబి 350 వెయిటింగ్ పీరియడే చాలా తక్కువ!

ఈ మోటార్‌సైకిల్‌లో సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది, ఇది రైడర్‌కు కావల్సిన డేటాను అందిస్తుంది. మోటార్‌సైకిల్‌ను స్మార్ట్‌ఫోన్‌తో అనుసంధానం చేయటం కోసం ఇందులో బ్లూటూత్ కనెక్టింగ్ టెక్నాలజీతో కూడిన బ్రాండ్ యొక్క మొట్టమొదటి ‘హోండా స్మార్ట్‌ఫోన్ వాయిస్ కంట్రోల్ సిస్టమ్' కూడా ఇందులో ఉంటుంది. ఇంకా ఇందులో హోండా టార్క్ కంట్రోల్ ఫంక్షన్‌ను కూడా ఉంది.

మీటియోర్ 350 కన్నా హోండా సిబి 350 వెయిటింగ్ పీరియడే చాలా తక్కువ!

హోండా హైనెస్ సిబి350 బైక్‌లో 348.36 సిసి సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 20.8 బిహెచ్‌పి పవర్ మరియు 30 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్ జతచేయబడి ఉంటుంది. ఇందులో డిస్క్ బ్రేకులు ఉంటాయి, ఇవి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్‌ను సపోర్ట్ చేస్తాయి.

MOST READ:ఒకటి, రెండు కాదు ఏకంగా 80 పోర్స్చే కార్లను కలిగి ఉన్న 80 ఏళ్ళ వ్యక్తి ; పూర్తి వివరాలు

Most Read Articles

English summary
Honda H’Ness CB350 Motorcycle Waiting Period Revealed, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X