Just In
Don't Miss
- News
కువైట్‌లో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Movies
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హోండా ప్రవేశపెట్టిన కొత్త బైక్ ; హైనెస్ సిబి 350.. చూసారా !
హోండా మోటార్‌సైకిల్ భారతదేశంలో హైనెస్ సిబి 350 ను ప్రవేశపెట్టింది. ఈ రెట్రో స్టైల్ బైక్ కంపెనీ బిగ్‌వింగ్ డీలర్‌షిప్ ద్వారా దేశవ్యాప్తంగా అమ్మబడుతుంది. హైనెస్ సిబి 350 త్వరలో భారత మార్కెట్లో విడుదల కానుంది. త్వరలో ఈ బైక్ అమ్మకాలు కూడా ప్రారంభమవుతాయి.

హోండా హైనెస్ సిబి 350 డిఎల్ఎక్స్ మరియు డిఎల్ఎక్స్ ప్రో అనే రెండు వేరియంట్లలో అందుబాటులోకి వస్తుంది. ఈ రెండు వేరియంట్లలో చాలా ఫీచర్లు కలిగి ఉండటమే కాకుండా కొత్త టెక్నాలజీని కూడా కలిగి ఉంటాయి. హోండా హైనెస్ సిబి 350 ధరను సుమారు 1.90 లక్షల రూపాయల (ఎక్స్-షోరూమ్) వరకు ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఈ బైక్ ప్రారంభదర బైక్ లాంచ్ సమయంలో ప్రకటించబడుతుంది. హోండా హైనెస్ సిబి 350 యొక్క ఈ రెట్రో బైక్‌కు అనేక ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కూడా ఇవ్వబడింది.

హోండా హైనెస్ సిబి 350 బైక్ డిజైన్ ని గమనించినట్లయితే దీని ముందు భాగంలో రౌండ్ ఎల్‌ఇడి హెడ్‌లైట్, రౌండ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, క్రోమ్ హైలైట్‌లు, సర్కిలర్ మిర్రర్స్, రౌండ్ సైడ్ ఇండికేటర్లు ఉన్నాయి. ఇవన్నీ రెట్రో డిజైన్ ఆకర్షణను మరింత పెంచుతాయి. బైక్ సైడ్ లో ఫ్యూయెల్ ట్యాంక్ పై హోండా లోగో ఉంటుంది. ప్యానెల్‌లో హైనెస్ యొక్క బ్యాడ్జ్ ఉంది.
MOST READ:ఇప్పుడే చూడండి.. రెనాల్ట్ డస్టర్ టర్బో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

ఈ బైక్ యొక్క సీట్లు ఫ్లాట్ గా ఉంచబడుతుంది. వెనుక భాగంలో హైనెస్ బ్యాడ్జ్, స్మాల్ రౌండ్ ఎల్ఈడి టెయిల్ లైట్ కూడా ఉంది. అంతేకాకుండా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ సెమీ డిజిటల్ కూడా ఇందులో ఉంటుంది.

ఇక ఈ బైక్ ఫీచర్స్ విషయానికి వస్తే ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ, బ్యాటరీ హెల్త్ ఇండికేటర్, హోండా స్మార్ట్‌ఫోన్ వాయిస్ కంట్రోల్ ఉన్నాయి.
దీని ప్రో వెర్షన్‌కు డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్, రెండు హార్న్ యూనిట్లు ఇవ్వబడ్డాయి. భద్రత పరంగా హోండా హైనెస్ సిబి 350 లో హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్, డ్యూయల్ ఛానల్ ఎబిఎస్ ఉన్నాయి. ఇది రెండు వైపులా డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంది మరియు అల్లాయ్ వీల్స్ ఉపయోగిస్తుంది.
MOST READ:బైక్‌కు జరిమానా విధించడానికి గూగుల్ సర్చ్ చేసిన చేసే పోలీసులు.. ఎందుకో తెలుసా ?

సస్పెన్షన్ విషయానికి వస్తే ఈ బైక్ టెలిస్కోపిక్ ఫ్రంట్ మరియు రియర్ ట్విన్ షాక్ అబ్జార్బర్స్ కలిగి ఉంది. హోండా హైనెస్ సిబి 350 బైక్ 348.36 సిసి, సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 20.8 బిహెచ్‌పి పవర్ మరియు 30 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. దీనికి 5 స్పీడ్ గేర్‌బాక్స్ జతచేయబడి ఉంటుంది.

హోండా హైనెస్ సిబి 350 మొత్తం ఆరు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వస్తుంది. భారతీయ మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350, జావా, బెనెల్లి ఇంపీరియల్ వంటి మోడళ్లతో హోండా హైనెస్ సిబి 350 పోటీ పడబోతోంది. సుజుకి కూడా త్వరలో ఈ విభాగంలో ఒక మోడల్‌ను తీసుకురాబోతోంది.
MOST READ:అక్టోబర్ 1 నుంచి కొత్త ఆర్‌సి, డ్రైవింగ్ లైసెన్స్ ఫార్మాట్ : ఇది ఎలా ఉంటుందో తెలుసా ?

హోండా బిగ్‌వింగ్ డీలర్‌షిప్ ద్వారా హోండా హైనెస్ సిబి 350 భారతదేశంలో విక్రయించబడుతుంది. త్వరలో మార్కెట్లోకి తీసుకువస్తామని, బిగ్‌వింగ్ దేశవ్యాప్తంగా 50 డీలర్‌షిప్‌లను ప్రారంభిస్తామని కంపెనీ ప్రకటించింది.