అడ్వెంచర్ బైక్ ప్రియుల కోసం కెటిఎమ్ అడ్వెంచర్ డే ప్రోగ్రామ్

ఆస్ట్రియన్ స్పోర్ట్స్ బైక్ బ్రాండ్ కెటిఎమ్, తమ అడ్వెంచర్ మోటార్‌సైకిళ్ల వినియోగదారుల కోసం ఫస్ట్ ఎడిషన్ అడ్వెంచర్ డేని పూనేలో నిర్వహించింది. కెటిఎమ్ ప్రస్తుతం భారత మార్కెట్లో అడ్వెంచర్ 250 మరియు అడ్వెంచర్ 390 అనే రెండు అడ్వెంచర్ మోటార్‌సైకిళ్లను విక్రయిస్తోంది.

అడ్వెంచర్ బైక్ ప్రియుల కోసం కెటిఎమ్ అడ్వెంచర్ డే ప్రోగ్రామ్

ఈ అడ్వెంచర్ మోటార్‌సైకిళ్లను ఎలా వినియోగించాలో అనే అంశంపై కంపెనీ ఈ ప్రోగ్రామ్ ద్వారా తమ వినియోగదారులకు శిక్షణ అందిస్తుంది. ఈ రెండు రకాల అడ్వెంచర్ మోటార్‌సైకిళ్లను కలిగి ఉన్న వినియోగదారులను కంపెనీ తమ అడ్వెంచర్ డేలో పాల్గోనేందుకు ఆహ్వానిస్తుంది.

అడ్వెంచర్ బైక్ ప్రియుల కోసం కెటిఎమ్ అడ్వెంచర్ డే ప్రోగ్రామ్

కెటిఎమ్ అడ్వెంచర్ డేలో భాగంగా, కీలకమైన ట్రైల్ రైడింగ్ మరియు ఆఫ్-రోడింగ్ నైపుణ్యాలను ఎలా మెరుగుపరచుకోవాలో అనే అంశాలపై రైడర్లకు నిపుణులు శిక్షణ అందిస్తారు. ఈ క్లోజ్డ్ సర్క్యూట్ ప్రోగ్రామ్ ప్రత్యేకంగా కెటిఎమ్ ఇంటర్నేషనల్ అథ్లెట్ల మార్గదర్శకత్వంలో రూపొందించబడింది మరియు కెటిఎమ్ యొక్క మాస్టర్ ట్రైనర్స్‌చే పర్యవేక్షించబడుతుంది.

MOST READ:ప్రపంచంలోనే పురాతన కార్ల తయారీ సంస్థలు ఏవో మీకు తెలుసా.. అయితే ఇది మీకోసమే

అడ్వెంచర్ బైక్ ప్రియుల కోసం కెటిఎమ్ అడ్వెంచర్ డే ప్రోగ్రామ్

కెటిఎమ్ అడ్వెంచర్ డేలో పాల్గొనేవారు ఒకే రోజులో శిక్షణా కార్యక్రమాన్ని క్లియర్ చేసినందుకు గాను వారికి కాంస్య స్థాయి ధృవీకరణ కూడా లభిస్తుంది. కెటిఎమ్ అడ్వెంచర్ డే ఫస్ట్ ఎడిషన్‌ను పూణేలోని కత్రాజ్ సమీపంలోని 21 ఎండ్యూరో పార్క్ వద్ద నిర్వహించారు.

అడ్వెంచర్ బైక్ ప్రియుల కోసం కెటిఎమ్ అడ్వెంచర్ డే ప్రోగ్రామ్

ఈ కార్యక్రమంలో ముంబై మరియు పూణేకు చెందిన కెటిఎమ్ అడ్వెంచర్ కస్టమర్లు పాల్గొన్నారు. ఇందులో పాల్గొన్న వారికి ఆఫ్-రోడింగ్ నైపుణ్యాలను పెంపొందించుకోవటానికి మరియు మెరుగుపరచడానికి వారికి అనేక రకాలుగా శిక్షణ ఇవ్వటం జరిగింది. కెటిఎమ్ మాస్టర్ ట్రైనర్ - వరద్ మోర్ మరియు అతని నిపుణుల బృందం ఇందులో పాల్గొన్న వారికి మార్గనిర్దేశం చేసింది.

MOST READ:అద్భుతంగా ఉన్న మలయాళీ స్టార్ మమ్ముట్టి లగ్జరీ కారవాన్.. చూసారా !

అడ్వెంచర్ బైక్ ప్రియుల కోసం కెటిఎమ్ అడ్వెంచర్ డే ప్రోగ్రామ్

పూణేలో జరిగిన కార్యక్రమంలో, వినియోగదారులకు బైక్ సెటప్ మరియు కంట్రోల్స్, బైక్ లిఫ్టింగ్, పోశ్చర్స్, సుదూర ప్రయాణాల ప్రణాళికపై శిక్షణ ఇవ్వబడింది మరియు స్లాలమ్, హిల్ రికవరీ, 8 ఫిగర్, పవర్ టర్న్స్ వంటి వివిధ రకాల డ్రిల్స్ ద్వారా వారి రైడ్ నైపుణ్యాలను మెరుగుపరిచారచేందుకు శిక్షణ ఇచ్చారు.

అడ్వెంచర్ బైక్ ప్రియుల కోసం కెటిఎమ్ అడ్వెంచర్ డే ప్రోగ్రామ్

కెటిఎమ్ తమ అడ్వెంచర్ డే కార్యక్రమాన్ని రానున్న కొద్ది నెలల్లో దేశంలోని మరో 7 నగరాల్లో క్రమం తప్పకుండా నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ అడ్వెంచర్ డేస్‌లో భాగంగా నిపుణులైన మాస్టర్ ట్రైనర్స్ మరియు సర్టిఫైడ్ ఆఫ్-రోడ్ నిపుణుల మాస్టర్ క్లాస్ కూడా ఉండనుంది.

MOST READ:3 కోట్ల కంటే ఎక్కువ ఖరీదైన లగ్జరీ కార్‌లో కనిపించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ఆ కార్ ఏదో మీరూ చూడండి

అడ్వెంచర్ బైక్ ప్రియుల కోసం కెటిఎమ్ అడ్వెంచర్ డే ప్రోగ్రామ్

కొత్త 2021 కెటిఎమ్ డ్యూక్ 125 విడుదల

కెటిఎమ్ బ్రాండ్‌కి సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, దేశీయ మార్కెట్లో కెటిఎమ్ విక్రయిస్తున్న తమ ఎంట్రీ లెవల్ మోటార్‌సైకిల్ డ్యూక్ 125లో కంపెనీ ఓ సరికొత్త రిఫ్రెష్డ్ వెర్షన్‌ను విడుదల చేసింది. భారత మార్కెట్లో కొత్త 2021 కెటిఎమ్ డ్యూక్ 125 ధర రూ.1.50 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

అడ్వెంచర్ బైక్ ప్రియుల కోసం కెటిఎమ్ అడ్వెంచర్ డే ప్రోగ్రామ్

కొత్త 2021 కెటిఎమ్ డ్యూక్ 125 దాని పెద్ద ఇంజన్ వెర్షన్ల నుండి స్పూర్తిపొంది డిజైన్ చేశారు. కెటిఎమ్ తమ డ్యూక్ సిరీస్‌లో అందిస్తున్న శక్తివంతమైన '1290 సూపర్ డ్యూక్ ఆర్' మోడల్ నుండి స్ఫూర్తి పొంది కొత్త 2021 కెటిఎమ్ డ్యూక్ 125ను డిజైన్ చేసినట్లు కంపెనీ పేర్కొంది.

MOST READ:కేవలం 4 గంటల సమయంలో భారీగా పట్టుబడ్డ దొంగ వాహనాలు..ఇంకా ఎన్నో..మీరే చూడండి

అడ్వెంచర్ బైక్ ప్రియుల కోసం కెటిఎమ్ అడ్వెంచర్ డే ప్రోగ్రామ్

ఇది మునుపటి మోడల్‌తో పోల్చుకుంటే పూర్తిగా సరికొత్త డిజైన్‌తో విశిష్టమైన స్టైలింగ్‌ను కలిగి ఉంటుంది. ఇది సరికొత్త డిజైన్‌ను కలిగి ఉండటమే కాకుండా ఇందులో కొత్త ఫీచర్లు మరియు పరికరాలు కూడా ఉన్నాయి. కొత్త 2021 కెటిఎమ్ డ్యూక్ 125 ఇప్పుడు చాలా షార్ప్, అగ్రెసివ్‌గా కనిపిస్తుంది. - దీనికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
KTM Conducts First-Edition Adventure Day In Pune, An Unique Training Programme For ADV Customers. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X