భారత్‌లో కెటిఎమ్ డ్యూక్ 125 విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

కెటిఎమ్ ఇండియా, దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న తమ ఎంట్రీ లెవల్ మోటార్‌సైకిల్ డ్యూక్ 125లో కంపెనీ నేడు ఓ సరికొత్త రిఫ్రెష్డ్ వెర్షన్‌ను విడుదల చేసింది. భారత మార్కెట్లో కొత్త 2021 కెటిఎమ్ డ్యూక్ 125 ధరను రూ.1.50 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించారు.

భారత్‌లో కెటిఎమ్ డ్యూక్ 125 విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

కొత్త 2021 కెటిఎమ్ డ్యూక్ 125 దాని పెద్ద ఇంజన్ వెర్షన్ల నుండి స్పూర్తిపొంది డిజైన్ చేశారు. ఇది సరికొత్త డిజైన్‌ను కలిగి ఉండటమే కాకుండా ఇందులో కొత్త ఫీచర్లు మరియు పరికరాలు కూడా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న కెటిఎమ్ డీలర్‌షిప్ కేంద్రాల్లో ఇప్పటికే ఈ మోడల్ కోసం బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి. డెలివరీలు కూడా త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

భారత్‌లో కెటిఎమ్ డ్యూక్ 125 విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

కెటిఎమ్ తమ డ్యూక్ సిరీస్‌లో అందిస్తున్న శక్తివంతమైన '1290 సూపర్ డ్యూక్ ఆర్' మోడల్ నుండి స్ఫూర్తి పొంది కొత్త 2021 కెటిఎమ్ డ్యూక్ 125ను డిజైన్ చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఇది మునుపటి మోడల్‌తో పోల్చుకుంటే పూర్తిగా సరికొత్త డిజైన్‌తో విశిష్టమైన స్టైలింగ్‌ను కలిగి ఉంటుంది.

భారత్‌లో కెటిఎమ్ డ్యూక్ 125 విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

కొత్త 2021 కెటిఎమ్ డ్యూక్ 125 ఇప్పుడు చాలా షార్ప్, అగ్రెసివ్‌గా కనిపిస్తుంది. దీని డిజైన్‌లో చేసిన మార్పుల కారణంగా ఇది మరింత స్పోర్టీగా కనిపిస్తుంది. కొత్త డిజైన్ అప్‌డేట్స్‌తో పాటు, కొత్త డ్యూక్ 125 కూడా కొత్త బోల్ట్-ఆన్ రియర్ సబ్-ఫ్రేమ్ మరియు పెద్ద స్టీల్ ట్యాంక్‌ను అమర్చారు. వీటి ఫలితంగా దీని రైడింగ్ ఎర్గోనామిక్స్ మారుతాయి.

భారత్‌లో కెటిఎమ్ డ్యూక్ 125 విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

కొత్త కెటిఎమ్ డ్యూక్ 125లోని కొత్తగా 13.5-లీటర్ ట్యాంక్‌ను అమర్చా, ఇది మెరుగైన లెగ్ కాంటాక్ట్‌ను అందించేలా డిజైన్ చేయబడింది. ఇందులో సవరించిన సీట్లు మరియు రీడిజైన్ చేయబడిన ట్యాంక్ కారణంగా మోటార్‌సైకిల్‌కు మరింత స్పోర్టి మరియు మంచి రైడింగ్ పొజిషన్ లభిస్తుంది.

భారత్‌లో కెటిఎమ్ డ్యూక్ 125 విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

ఈ మోటార్‌సైకిల్‌లో పూర్తిగా కొత్త డబ్ల్యుపి సస్పెన్షన్‌ను ఉపయోగించారు. ఇందుల ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. అలాగే, కొత్త డ్యూక్ 125 మోటార్‌సైకిల్‌పై ఛాస్సిస్ మరియు బ్రేకింగ్ భాగాలను అప్‌డేట్ చేసినట్లు కంపెనీ తెలిపింది.

భారత్‌లో కెటిఎమ్ డ్యూక్ 125 విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

అయితే, ఇంజన్ పరంగా మాత్రం కొత్త 2021 కెటిఎమ్ డ్యూక్ 125లో ఎలాంటి మార్పులు లేవు. ఇందులోని బిఎస్6 కంప్లైంట్ 124 సిసి సింగిల్ సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్ 9,250 ఆర్‌పిఎమ్ వద్ద 14.3 బిహెచ్‌పి పవర్‌ను మరియు 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 12 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో అనుసంధానించబడి ఉంటుంది.

భారత్‌లో కెటిఎమ్ డ్యూక్ 125 విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

పైన పేర్కొన్న మార్పులతో పాటు, సరికొత్త 2021 కెటిఎమ్ డ్యూక్ 125 ఇప్పుడు రెండు కొత్త కలర్ ఆప్షన్లలో (ఎలక్ట్రానిక్ ఆరెంజ్ మరియు సిరామిక్ వైట్) కూడా లభిస్తుంది.

కొత్త కెటిఎమ్ డ్యూక్ 125 విడుదల గురించి బజాజ్ ఆటో లిమిటెడ్ ప్రెసిడెంట్ (ప్రోబైకింగ్) సుమీత్ నారంగ్ మాట్లాడుతూ, ఈ కొత్త మోడల్‌ను పాపులర్ 1290 సూపర్ డ్యూక్ ఆర్ నుండి స్పూర్తి పొంది తయారు చేశామని, ఇందులో ఇంతకు ముందెన్నడూ చూడని ఫీచర్లు ఉంటాయని, దీనిని అల్ట్రా-లైట్ వెయిట్ ట్రేల్లిస్ ఫ్రేమ్ మరియు సబ్‌ఫ్రేమ్ రేజర్‌లపై తయారు చేశామని ఫలితంగా ఇది షార్ప్ కంట్రోలింగ్‌ను కలిగి ఉంటుందని అన్నారు.

భారత్‌లో కెటిఎమ్ డ్యూక్ 125 విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

కొత్త 2021 డ్యూక్ దాని విశిష్టమైన స్టైలింగ్ కారణంగా తప్పకుండా చూపరులను తనవైపుకు తిప్పుకుంటుందని చెప్పారు. డ్యూక్ 125 మోడల్‌ను 2018 చివర్లో తొలిసారిగా మార్కెట్లో విడుదల చేసిన తర్వాత ఇది భారతదేశంలోని యువ బైకింగ్ ఔత్సాహికులను ఎంతగానో ఆకట్టుకుందని, ఇప్పుడు తాజాగా మార్కెట్లోకి వచ్చిన కొత్త మోడల్ కూడా అంతకన్నా ఎక్కువగా కస్టమర్లను ఆకట్టుగోలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

భారత్‌లో కెటిఎమ్ డ్యూక్ 125 విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

కెటిఎమ్ డ్యూక్ 125 మోటార్‌సైకిల్ విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

భారత మార్కెట్లో కెటిఎమ్ డ్యూక్ 125 బడ్జెట్ ధరలో అందుబాటులో ఉండే బెస్ట్ నేక్డ్ మోటార్‌సైకిల్ అని చెప్పొచ్చు. ఈ కొత్త 2021 మోడల్‌ను కంపెనీ పూర్తిగా రీడిజైన్ చేసి మునుపటి కన్నా మరింత అందంగా తీర్చిదిద్దింది. అంతేకాకుండా, ఇందులో అధనపు ఫీచర్లను మరియు పరికరాలను కూడా జోడించింది. ఇది ప్రీమియం 125 సిసి మోటార్‌సైకిల్ విభాగంలో బజాజ్ పల్సర్ 125 వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

More from DriveSpark

Article Published On: Monday, December 7, 2020, 15:55 [IST]
English summary
KTM has launched their all-new Duke 125 motorcycle in the Indian market priced at Rs 1.50 lakh, ex-showroom (Delhi). Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+