Just In
Don't Miss
- Finance
దారుణంగా పతనమైన బిట్‌కాయిన్, మార్చి నుండి ఇదే వరస్ట్
- Movies
HIT2 అప్డేట్.. ప్రాజెక్ట్ నుంచి విశ్వక్ సేన్ అవుట్!.. కొత్త హీరో ఎవరంటే?
- News
ఆ తపన ఉన్నా శరీరం సహకరించలేదు: చిన్నప్పుడు చీరాలలో: ఆ యుద్ధ విద్యలకు ప్రోత్సాహం: పవన్
- Sports
హైదరాబాద్‌లోనూ ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించండి.. బీసీసీఐకి కేటీఆర్ రిక్వెస్ట్!
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 6వ తేదీ వరకు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రూబీ రెడ్ కలర్‌లో మహీంద్రా మోజో బిఎస్6; కొత్త కలర్ మీకు నచ్చిందా?
మహీంద్రా గ్రూపుకి చెందిన ద్విచక్ర వాహన విభాగం 'మహీంద్రా టూవీలర్స్' అందిస్తున్న పవర్‌ఫుల్ మోటార్‌సైకిల్ 'మహీంద్రా మోజో' బిఎస్6 కోసం కంపెనీ రోజుకో ప్రత్యేకమైన కలర్ స్కీమ్‌ను, టీజర్ చిత్రాలను విడుదల చేస్తోంది. మోజో కోసం ఇటీవలే బ్లాక్ అండ్ రెడ్ థీమ్‌లో ఉండే సరికొత్త 'గార్నెట్ బ్లాక్' కలర్ స్కీమ్‌ను ఆవిష్కరించిన కంపెనీ ఇప్పుడు తాజాగా 'రూబీ రెడ్' కలర్ స్కీమ్‌ను పరిచయం చేసింది.

చిత్రంలో చూపించినట్లుగా, కొత్త మహీంద్రా మోజో ట్యాంక్‌పై సగం ఎరుపు మరియు సగం నలుపు రంగు ఉంటుంది. ఈ మోటారుసైకిల్ వెనుక కౌల్ కూడా బ్లాక్ అండ్ రెడ్ కలర్‌లో ఉంటుంది. అల్లాయ్ వీల్స్‌పై కూడా ఎరుపు రంగు స్ట్రైప్స్ ఉంటాయి. రూబీ రెడ్ వేరియంట్ ఫ్రేమ్ మరియు స్వింగ్ ఆర్మ్ రెండు మాత్రం నలుపు రంగులో ఉంటాయి. గార్నెట్ బ్లాక్ కలర్ వేరియంట్‌లో ఈ రెండు భాగాలు ఎరుపు రంగులో వస్తాయి.

ఈ రెండింటిలోనూ ఇలాంటి బ్లాక్ పెయింట్ స్కీమ్‌ను పొందే కొన్ని భాగాల్లో ఫ్రంట్ ఫెండర్లు, హెడ్‌లైట్ ఫెయిరింగ్, సైడ్ బాడీ ప్యానెల్స్, రేడియేటర్ ష్రుడ్స్ మరియు అండర్‌బెల్లీ పాన్‌లను గుర్తించవచ్చు. అంతేకాకుండా, రూబీ రెడ్ వేరియంట్ ఆల్ బ్లాక్డ్ అవుట్ ఇంజన్ బేను కూడా కలిగి ఉంటుంది.
MOST READ:భారీ ఆఫర్లను ప్రకటించిన మారుతి సుజుకి ; దేనిపై ఎంతెంతో తెలుసా ?

ఈ కొత్త మహీంద్రా మోజో బిఎస్6 మోడల్ ప్రస్తుత తరం మోడళ్ల మాదిరిగానే డిజైన్ లాంగ్వేజ్‌ను క్యారీ చేయనుంది. డ్యూయెల్ హెడ్‌ల్యాంప్స్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 21-లీటర్ పెద్ద ఫ్యూయెల్ ట్యాంక్ వంటి బిఎస్4 మోడల్‌లోని అన్ని ఇతర డిజైన్ అంశాలు బిఎస్6 మోడళ్లలో కూడా కొనసాగించే అవకాశం ఉంది. ఈ మోటార్‌సైకిల్‌లో 815 మిమీ సీట్ హైట్ రైడర్‌కు మంచి సౌకర్యాన్ని అందిస్తుంది.

ఇందులో ఇంజన్ అప్‌గ్రేడ్స్ మినహా డిజైన్‌లో పెద్దగా ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది. మహీంద్రా మోజో 300 బిఎస్6 మోటార్‌సైకిలో ఇదివరకటి 294.72సీసీ లిక్విడ్ కూల్డ్ ఫ్యూయెల్ ఇంజెక్టెడ్, సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ఈ బిఎస్4 ఇంజన్ 7500 ఆర్‌పిఎమ్ వద్ద 26.29 బిహెచ్‌పి శక్తిని, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 28 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. బిఎస్6 వెర్షన్‌లో ఈ ఇంజన్ పవర్ కాస్తంత తగ్గొచ్చని అంచనా.
MOST READ:ఈ ట్రక్కు 1700 కి.మీ ప్రయాణించడానికి సంవత్సర కాలం పట్టింది ; ఎందుకో తెలుసా

ఇకపోతే ముందు వైపు టెలిస్కోపిక్ వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్ ఉంటాయి. ఇందులో ముందు వైపు 320 ఎమ్.ఎమ్ డిస్క్ బ్రేక్ మరియు వెనుక వైపు 240 ఎమ్.ఎమ్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. ఇందులో డ్యూయెల్-ఛానెల్ ఏబిఎస్ ఉంటుంది, ఈ ఏబిఎస్ సిస్టమ్‌ను బైబ్రి కంపెనీ సప్లయ్ చేస్తోంది. ఈ బైక్‌లో పీరెల్లీ ఏంజెల్ సిటి టైర్స్ ఉండొచ్చని అంచనా.

మహీంద్రా మోజో బిఎస్6 కొత్త రూబీ రెడ్ కలర్ ఆప్షన్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఎప్పుడూ స్పోర్టీగానే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో, మహీంద్రా మోజోపై కొత్తగా డిజైన్ చేసిన రూబీ రెడ్ కలర్ స్కీమ్ కూడా ఖచ్చితంగా అద్భుతంగా ఉందనే చెప్పాలి. కొత్త కలర్ ఆప్షన్లతో రీ-ఎంట్రీ ఇస్తున్న మహీంద్రా మోజో బిఎస్6 ఈసారైనా కస్టమర్లను ఆకర్షిస్తోందో లేదో చూడాలి. మరింత సమాచారం కోసం వేచి ఉండండి.
MOST READ:ఇప్పుడే చూడండి.. వెహికల్ నెంబర్ ప్లేట్స్ పై క్లారిటీ ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్