టాప్ బైక్ న్యూస్ - హోండా లివో, హీరో ఎక్స్‌ట్రీమ్, హ్యార్లీ బడ్జెట్ బైక్

భారత టూవీలర్ మార్కెట్లో ఈ వారం కొన్ని కొత్త మోటార్‌సైకిళ్లు విడుదలయ్యాయి. త్వరలోనే మరికొన్ని కొత్త మోడళ్లు భారత రోడ్లపైకి రానున్నాయి. గడచిన వారంలో ద్విచక్ర వాహన పరిశ్రమలో జరిగిన కొన్ని ముఖ్యాంశాలు మీ కోసం..!

టాప్ బైక్ న్యూస్ - హోండా లివో, హీరో ఎక్స్‌ట్రీమ్, హ్యార్లీ బడ్జెట్ బైక్

హోండా లివో బిఎస్6 మోటార్‌సైకిల్ విడుదల

హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ తమ కొత్త లివో బిఎస్6 మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ మోటార్‌సైకిల్ డ్రమ్ మరియు డిస్క్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. దేశీయ విపణిలో ఈ మోడల్ ప్రారంభ ధర రూ.69,422, ఎక్స్-షోరూమ్ (ఇండియా)గా ఉంది.

టాప్ బైక్ న్యూస్ - హోండా లివో, హీరో ఎక్స్‌ట్రీమ్, హ్యార్లీ బడ్జెట్ బైక్

కొత్త హోండా లివో బిఎస్6 మోడల్‌లో ఇంజన్ అప్‌గ్రేడ్స్‌తో పాటుగా డిజైన్, ఫీచర్లలో కూడా మార్పులు చేర్పులు ఉన్నాయి. ఇందులో ఎయిర్-కూల్డ్, ఫ్యూయెల్ ఇంజెక్టెడ్, సింగిల్ సిలిండర్ 109.51 సిసి ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 7500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 8.7 బిహెచ్‌పిల శక్తిని మరియు 5500 ఆర్‌పిఎమ్ వద్ద 9.3 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

MOST READ: మీకు తెలుసా.. నాగార్జున గ్యారేజీలో చేరిన కొత్త కార్, ఇదే

టాప్ బైక్ న్యూస్ - హోండా లివో, హీరో ఎక్స్‌ట్రీమ్, హ్యార్లీ బడ్జెట్ బైక్

హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ మోటార్‌సైకిల్ విడుదల

హీరో మోటోకార్ప్ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ మోటార్‌సైకిల్‌ను కంపెనీ గత వారం భారత మార్కెట్లో విడుదల చేసింది. కొత్త హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ సింగిల్ డిస్క్, డబుల్ డిస్క్ అనే రెండు వేరింట్లలో లభిస్తోంది. ప్రారంభ వేరియంట్ ధర రూ.99,950 లుగా ఉంటే టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.1.03 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉన్నాయి.

టాప్ బైక్ న్యూస్ - హోండా లివో, హీరో ఎక్స్‌ట్రీమ్, హ్యార్లీ బడ్జెట్ బైక్

కొత్త హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ మోటార్‌సైకిల్‌లో ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్, సింగిల్ సిలిండర్ 163 సిసి ఇంజన్ ఉంటుంది. ఇది 8500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 15 బిహెచ్‌పిల శక్తిని మరియు 6500 ఆర్‌పిఎమ్ వద్ద 14 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్టాండర్డ్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

MOST READ: ఎలక్ట్రిక్ ఆటో రిక్షా బ్లాస్ట్ : రిక్షా డ్రైవర్ మృతి, ఎక్కడో తెలుసా ?

టాప్ బైక్ న్యూస్ - హోండా లివో, హీరో ఎక్స్‌ట్రీమ్, హ్యార్లీ బడ్జెట్ బైక్

హ్యార్లీ డేవిడ్‌సన్ 350సీసీ పారలల్ ట్విన్ మోటార్‌సైకిల్

అమెరికన్ టూవీలర్ బ్రాండ్ హార్లీ డేవిడ్‌సన్ ఏషియా మార్కెట్ల కోసం కొత్త ఎంట్రీ లెవల్ మోటార్‌సైకిల్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. చైనాకు చెందిన క్యూజే మోటార్స్ భాగస్వామ్యంతో హ్యార్లీ డేవిడ్‌సన్ ఈ బడ్జెట్ మోటార్‌సైకిల్‌ను తయారు చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

టాప్ బైక్ న్యూస్ - హోండా లివో, హీరో ఎక్స్‌ట్రీమ్, హ్యార్లీ బడ్జెట్ బైక్

ఈ ఎంట్రీ లెవల్ హ్యార్లీ డేవిడ్‌సన్ మోటార్‌సైకిల్‌లో 353 సిసి పారలల్-ట్విన్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ 35.5 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీని ఫ్రేమ్, స్వింగ్ఆర్మ్, సస్పెన్షన్, డిస్క్ బ్రేక్ రోటర్స్‌ను బెనెల్లి టిఎన్‌టి 300 నుండి గ్రహించవచ్చని తెలుస్తోంది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

MOST READ: బైక్స్ కొనాలనుకునే వారికి కొత్త ఫైనాన్స్ స్కీమ్ : హోండా

టాప్ బైక్ న్యూస్ - హోండా లివో, హీరో ఎక్స్‌ట్రీమ్, హ్యార్లీ బడ్జెట్ బైక్

క్రెడ్ఆర్‌తో ఏథర్ ఎనర్జీ ఒప్పందం, ఎక్సేంజ్ స్కీమ్

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కోసం ఓ సరికొత్త ఎక్సేంజ్ ప్రోగ్రామ్‌ను ఆఫర్ చేసేందుకు గాను ప్రీ-ఓన్డ్ ద్విచక్ర వాహన బ్రాండ్ క్రెడ్ఆర్‌తో చేతులు కలిపింది. ఈ స్కీమ్‌లో భాగంగా కస్టమర్లు తమ పాత పెట్రోల్ వాహనాలను క్రెడ్ఆర్‌కి విక్రయించి, అందులో వచ్చిన మొత్తాన్ని కొత్త ఎథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై తగ్గింపుగా పొందవ్చచు.

టాప్ బైక్ న్యూస్ - హోండా లివో, హీరో ఎక్స్‌ట్రీమ్, హ్యార్లీ బడ్జెట్ బైక్

క్రెడ్ఆర్ కస్టమర్ల నుంచి కొనుగోలు చేసే పాత ద్విచక్ర వాహనాలకు ఇన్‌స్టాంట్ ప్రైస్ కోట్‌ను ఆఫర్ చేస్తుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుకు అయ్యే మొత్తం ఖర్చు నుండి పాత వాహనాల విక్రయం ద్వారా వచ్చిన మొత్తాన్ని తీసివేస్తారు. ఈ భాగస్వామ్యం వలన భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలను వేగంగా స్వీకరించడానికి అనుమతిస్తుంద. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

MOST READ: క్రాష్ టెస్ట్‌లో పాత కార్లు నుజ్జు నుజ్జు అయిపోయాయ్, ఇప్పటి కార్లే బెస్ట్!

టాప్ బైక్ న్యూస్ - హోండా లివో, హీరో ఎక్స్‌ట్రీమ్, హ్యార్లీ బడ్జెట్ బైక్

త్వరలో హోండా సిబి హార్నెట్ 160ఆర్ బిఎస్6 విడుదల!

సిబి హార్నెట్ 160ఆర్ బిఎస్6 మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసేందుకు హోండా సన్నద్ధమవుతోంది. ఈ నెలలోనే కొత్త హోండా సిబి హార్నెట్ 160ఆర్ బిఎస్6 మోటారుసైకిల్ దేశంలో ఎప్పుడైనా విడుదైలనా కావచ్చని అంచనా. యువ కొనుగోలుదారులే లక్ష్యంగా హోండా ఈ కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టనుంది.

టాప్ బైక్ న్యూస్ - హోండా లివో, హీరో ఎక్స్‌ట్రీమ్, హ్యార్లీ బడ్జెట్ బైక్

బిఎస్4 మోడల్‌లో ఉపయోగించిన ఇంజన్‌నే బిఎస్6 నిబంధనలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేసి ఇందులో ఉపయోగించనున్నారు. ప్రస్తుతం యునికార్న్ బిఎస్6 మోటార్‌సైకిల్‌లో ఇదే తరహా ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు. కాకపోతే సిబి హార్నెట్ 160ఆర్ ఏరోడైనమిక్ డిజైన్ కారణంగా ఈ ఇంజన్ దాన్ని కన్నా కాస్తం ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేయవచ్చని అంచనా. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

MOST READ: మీకు తెలుసా.. వడోదరలో ఇప్పుడు స్మార్ట్ సిటీ బస్ సర్వీస్

టాప్ బైక్ న్యూస్ - హోండా లివో, హీరో ఎక్స్‌ట్రీమ్, హ్యార్లీ బడ్జెట్ బైక్

ఈ వారం టాప్ బైక్ న్యూస్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఈ వారం భారత మార్కెట్లో రెండు మోటార్‌సైకిళ్ళు విడుదలయ్యాయి. భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టబోయే మరో రెండు మోటార్ సైకిళ్ల గురించి కూడా మాకు సమాచారం ఉంది. హ్యార్లీ డేవిడ్‌సన్ నుంచి రాబోయే కొత్త 350సిసి మోటార్‌సైకిల్‌ను అమెరికన్ బ్రాండ్ అభిమానులు అంగీకరిస్తారా అనేది వేచి చూడాలి.

Most Read Articles

English summary
This week in the two-wheeler market in India received a couple of new motorcycles. We also have information about a couple of motorcycles that will be soon arriving in the Indian market. Here are the highlights that happened in two-wheeler auto industry in the past week. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X