మూడవసారి టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్ ధర పెంపు - వివరాలు

చెన్నైకి చెందిన ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలో తమ బిఎస్6 వెర్షన్ ఎన్‌టార్క్ 125 స్కూటర్‌ను మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. ఈ స్కూటర్ విడుదల సమయంలోనేక కంపెనీ దాని బిఎస్4 వెర్షన్‌తో పోల్చుకుంటే రూ.7,500 అధిక ధరతో బిఎస్6 మోడల్‌ను విడుదల చేసింది.

మూడవసారి టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్ ధర పెంపు - వివరాలు

గడచిన నెలలో కూడా కంపెనీ ఈ స్కూటర్ ధరలను స్వల్పంగా పెంచింది. తాజా నివేదికల ప్రకారం, టీవీఎస్ మరోసారి బిఎస్6 ఎన్‌టార్క్ 125 ధరలను పెంచింది. తాజాగా ఈ స్కూటర్ ధర అన్ని వేరియంట్లపై రూ.1,000 మేర పెరిగింది.

మూడవసారి టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్ ధర పెంపు - వివరాలు

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 ప్రస్తుతం మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి - డ్రమ్, డిస్క్ మరియు రేస్ ఎడిషన్. ధరలు పెరిగిన తర్వాత, ఇప్పుడు ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ.67,885 వద్ద ఉండగా, డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ.71,885 మరియు రేస్ ఎడిషన్ ధర రూ.74,365 లకు పెరిగింది ) అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీ).

మూడవసారి టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్ ధర పెంపు - వివరాలు

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 బిఎస్6 స్కూటర్ చూడటానికి బిఎస్4 మోడళ్ల మాదిరిగానే ఉంది. ఈ స్కూటర్‌ను బిఎస్6 కంప్లైంట్ ఇంజన్ అప్‌గ్రేడ్ మినహా వేరే ఇతర మార్పులు ఏవీ లేవు. ఇందులోని 124 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్ ఇప్పుడు ఇంధన-ఇంజెక్షన్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఈ ఇంజన్ 9.1 బిహెచ్‌పి శక్తిని మరియు 10.5 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

మూడవసారి టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్ ధర పెంపు - వివరాలు

అప్‌గ్రేడెడ్ బిఎస్6 స్కూటర్ దాని బిఎస్4 వెర్షన్‌తో పోలిస్తే కొంచెం బరువుగా ఉంటుంది. బిఎస్6 ఎన్‌టార్క్ 125లో ఫ్యూయెల్ ట్యాంక్ సామర్థ్యాన్ని 5 లీటర్ల నుంచి 5.8 లీటర్లకు పెంచారు. ఇవి కాకుండా, స్కూటర్‌లో వేరే ఏ ఇతర మార్పులు లేవు.

మూడవసారి టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్ ధర పెంపు - వివరాలు

టీవీఎస్ ఎన్‌టార్క్ 125లో పూర్తి-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ను ఉంటుంది. దీనిని స్మార్ట్‌ఫోన్‌తో జత చేసుకోవచ్చు. బయటి వైపు ఉండే ఫ్యూయెల్ ఫిల్లింగ్ క్యాప్, ఇంజన్ కిల్ స్విచ్ మరియు ఎల్‌ఈడి లైటింగ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ స్కూటర్ ఎగ్జాస్ట్ నోట్ ఇందులో ప్రధానంగా ఆకట్టుకునే ఫీచర్.

మూడవసారి టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్ ధర పెంపు - వివరాలు

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 తో పాటు, కంపెనీ తన జూపిటర్ బిఎస్6 స్కూటర్ ధరలను కూడా పెంచింది. తాజా ధరల పెరుగుదల తరువాత, టీవీఎస్ జూపిటర్ ప్రారంభ ధర రూ.63,102 వద్ద ఉండగా, టాప్-స్పెక్ క్లాసిక్ వేరియంట్ ధర రూ. 69,602 (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)గా ఉంది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

మూడవసారి టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్ ధర పెంపు - వివరాలు

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్ ధర పెంపుపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

బిఎస్6 నిబంధనల కారణంగా, పెరిగిన ఉత్పాదక వ్యయం మరియు ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితుల కారణంగా మార్కెట్లోని చాలా మంది తయారీదారుల మాదిరిగానే, టీవీఎస్ కూడా తమ బిఎస్6 మోడళ్ల ధరలను పెంచినట్లు తెలుస్తోంది. టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్ ఈ సెగ్మెంట్లో బెస్ట్ స్పోర్ట్స్ స్కూటర్‌గా ఉంటుంది. ఇది హోండా డియోకి పోటీగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, August 4, 2020, 18:07 [IST]
English summary
According to the latest reports, TVS has yet again increased the prices of the BS6 Ntroq 125. It will be a second price hike since its launch in the market. The BS6 scooter receives a hike of Rs 1,000 across all variants of the scooter. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+