Just In
- 17 hrs ago
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- 1 day ago
బిఎండబ్ల్యు ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్ & పర్ఫామెన్స్
- 1 day ago
డ్యుకాటి మోన్స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!
- 1 day ago
భారత్‌లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..
Don't Miss
- News
మాజీ రాష్ట్రపతి కలాం సోదరుడు మహమ్మద్ ముత్తుమీర కన్నుమూత
- Finance
IPO: LIC ఆథరైజ్డ్ క్యాపిటల్ భారీ పెంపు, రూ.25,000 కోట్లకు..
- Movies
‘ఆచార్య’ టీంకు షాక్.. మొదటి రోజే ఎదురుదెబ్బ.. లీకులపై చిరు ఆగ్రహం
- Sports
కిడ్స్ జోన్లో టీమిండియా క్రికెటర్ల ఆట పాట!వీడియో
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అక్టోబర్‌లో అదరగొట్టిన యమహా.. టూవీలర్ అమ్మకాల్లో 31 శాతం వృద్ధి!
జపనీస్ టూవీలర్ బ్రాండ్ యమహా, భారత మార్కెట్లో అక్టోబర్ 2020 నెలలో ప్రోత్సాహకర అమ్మకాలను నమోదు చేసింది. కంపెనీ గత నెలలో బైక్ మరియు స్కూటర్ అమ్మకాల పరంగా మార్కెట్లో 31 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు కంపెనీ తెలిపింది. అక్టోబర్ 2020లో యమహా మొత్తం 60,176 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది.

కాగా, అక్టోబర్ 2019లో కంపెనీ 46,082 యూనిట్లను మాత్రమే విక్రయించింది. ఇది ఈ ఏడాది అక్టోబర్ అమ్మకాల కంటే 14,094 యూనిట్లు తక్కువ. కోవిడ్-19 మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత, కంపెనీ గత 4 నెలల్లో వరుసగా తన అమ్మకాల పరిమాణంలో వృద్ధిని కనబరుస్తూ వస్తోంది.

జూలై 2019తో పోల్చితే యమహా జూలై 2020లో 4.3 శాతం వృద్ధిని నమోదు చేసింది. అలాగే, ఆగస్టు 2019తో పోలిస్తే ఆగస్టు 2020లో 14.8 శాతం వృద్ధి మరియు సెప్టెంబర్ 2019తో పోలిస్తే సెప్టెంబర్ 2020లో 17 శాతం వృద్ధిని కనబరినచినట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
Month | 2019 Domestic | 2020 Domestic | Growth (%) |
July | 47918 | 49989 | 4.3 |
August | 52706 | 60505 | 14.8 |
September | 53727 | 63052 | 17 |
October | 46082 | 60176 | 31 |
MOST READ:రూ. 30 వేల విలువైన స్కూటర్‌కి రూ. 42 వేలు ఫైన్.. చివరికి ఏమైందంటే ?

పైన చూపిన టేబుల్‌ను గమనిస్తే, గడచిన సెప్టెంబర్ 2020లో విక్రయించిన మొత్తం యూనిట్లు అక్టోబర్ 2020లో విక్రయించిన మొత్తం యూనిట్ల కంటే తక్కువగా ఉన్నాయి. ఈ విషయంలో కంపెనీ ఏడాదికేడాది అమ్మకాల వృద్ధిని కనబరిచినప్పటికీ, యూనిట్ల పరంగా అక్టోబర్ 2020లో సెప్టెంబర్ 2020 నెల కన్నా 2,876 యూనిట్లు తక్కువగా అమ్ముడై 4.5 శాతం క్షీణతను నమోదు చేసింది.

యమహా తమ అమ్మకాలను గరిష్టంగా పెంచుకునేందుకు ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రత్యేక ఫైనాన్స్ పథకాలు మరియు తమ ఉత్పత్తులపై ఆకర్షణీయమైన తగ్గింపులను అందించడం వంటి ప్రయత్నాలు చేసింది. ప్రస్తుతం భారతదేశంలో కొనసాగుతున్న పండుగ సీజన్లో అమ్మకాలను మరింత పెరుగుతాయని కంపెనీ ధీమాగా ఉంది.
MOST READ:దేశీయ మార్కెట్లో టీవీఎస్ అపాచీ RTR 200 4V బైక్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

యమహా ప్రత్యేకంగా అందిస్తున్న క్యూరేటెడ్ ఫైనాన్స్ ఆఫర్లలో తక్కువ డౌన్ పేమెంట్ చెల్లింపు ఆప్షన్లు, తక్కువ ఈఎమ్ఐ పథకాలు మొదలైనవి ఉన్నాయి. ఈ ఆఫర్లన్నీ కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడానికి అవసరమైన ప్రారంభ నిబద్ధతను తగ్గించడానికి మరియు కొనసాగుతున్న పండుగ సీజన్ కస్టమర్ సెంటిమెంట్‌ను బలపరచేందుకు సహాయపడతాయి.

భారత్‌లో యమహా చీప్ బ్రాండ్ ఇమేజ్‌ను దూరం చేసుకునేందుకు ఎంట్రీ లెవల్ కమ్యూటర్ సెగ్మెంట్ నుంచి మెల్లిగా వైదొలగి, ప్రీమియం లెవల్ సెగ్మెంట్ వైపు అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే, ఇప్పుడు యమహా లైనప్‌లో ఇప్పుడు స్కూటర్లు ఫాసినో, రే-జెడ్ఆర్ వంటి 125సీసీ మోడళ్లతో ప్రారంభమవుతుండగా, మోటారుసైకిల్ పోర్ట్‌ఫోలియో 150సిసి విభాగంలో ఉంచిన ఎఫ్‌జెడ్ సిరీస్‌తో ప్రారంభమవుతోంది.
MOST READ:త్వరపడండి.. దీపావళి సందర్భంగా బెనెల్లి ఇంపీరియల్ 400 బైక్‌పై భారీ ఆఫర్స్

యమహా ప్రస్తుత మార్కెట్ ధోరణికి అనుగుణంగా, బ్లూటూత్ కనెక్టెడ్ టెక్నాలజీతో కూడిన మోడళ్లను కూడా భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఎఫ్‌జెడ్ఎస్ డార్క్ నైట్ ఎడిషన్ పేరిట కంపెనీ ఓ కొత్త మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఇది ‘యమహా మోటార్‌సైకిల్ కనెక్ట్ ఎక్స్' బ్లూటూత్ కనెక్టింగ్ టెక్నాలజీతో వచ్చిన మొట్టమొదటి మోటార్‌సైకిల్‌గా అవతరించింది - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

యమహా అక్టోబర్ 2020 నెల అమ్మకాలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
గత ఏడాది అమ్మకాలతో పోలిస్తే యమహా మోటార్ ఇండియా భారతదేశంలో గణనీయమైన వృద్ధిని సాధించింది. భారతదేశంలో కొనసాగుతున్న పండుగ సీజన్లో డిమాండ్ పెరుగుతుందని కంపెనీ ధీమాగా ఉంది. అదనంగా, దేశంలో అమ్మకాలను పెంచుకోవడానికి కంపెనీ ఆకర్షణీయమైన ఫైనాన్స్ పథకాలను కూడా అందిస్తోంది.
MOST READ:నవంబర్ 7 న 6 నగరాల్లో లాంచ్ కానున్న ఏథర్ 450 ఎక్స్ ; ఆ నగరాలు ఇవే