భారత్‍లో విడుదలైన 2022 Kawasaki Versys 1000: ధర & వివరాలు
జపనీస్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసకి (Kawasaki) భారతీయ మార్కెట్లో 2022 కవాసకి వెర్సిస్ 1000 (2022 Kawasaki Versys 1000) అనే కొత్త బైకుని విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిన ఈ స్పోర్ట్స్ టూరింగ్ మోటార్‌సైకిల్ యొక్క అప్‌డేటెడ్ వెర్షన్ ధర రూ. 11.55 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). కంపెనీ ఈ కొత్త బైక్ యొక్క బుకింగ్స్ ప్రారంభించింది. అయితే డెలివరీలు 2021 నవంబర్ నెల మధ్యలో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది.

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త 2022 Kawasaki Versys 1000 బైక్ క్యాండీ లైమ్ గ్రీన్ టైప్ 3 షేడ్ పేరుతో ఒకే కలర్ అప్సన్ లో అందుబాటులో ఉంటుంది. Kawasaki Versys బైక్ ఇప్పటికే బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేయబడి ఉంది. కావున ఈ బైక్ లో ఎటువంటి మెకానికల్ అప్డేట్స్ జరగలేదు.

2022 Kawasaki Versys 1000 మోటార్‌సైకిల్ 1043 సిసి, ఇన్-లైన్ ఫోర్, లిక్విడ్-కూల్డ్, ఫోర్-స్ట్రోక్ ఇంజన్ ఉపయోగించబడింది. ఈ ఇంజిన్ 9,000 ఆర్‌పిఎమ్ వద్ద 120 బిహెచ్‌పి పవర్ మరియు 7,500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 102 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. అంతే కాకుండా ఇందులో స్లిప్పర్ క్లచ్ కూడా అందుబాటులో ఉంటుంది.

Kawasaki Versys 1000 బైక్ చాలా స్టైలిష్ డిజైన్ కలిగి ఉంటుంది. అంతే కాకుండా అప్డేటెడ్ ఫీచర్స్ మరియు పరికరాలు అందుబాటులో ఉంటాయి. ఈ బైక్ ట్విన్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, సెమీ-అనలాగ్ సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు అడ్జస్టబుల్ విండ్‌స్క్రీన్ వంటి ఆధునిక ఫీచర్స్ కలిగి ఉంటుంది.

ఈ స్పోర్ట్స్ టూరర్ మోటార్‌సైకిల్‌లో ఎలక్ట్రానిక్ క్రూయిజ్ కంట్రోల్, కార్నరింగ్ మేనేజ్‌మెంట్ ఫంక్షన్, కవాసకి యొక్క ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ మొదలైనవి ఇవ్వబడ్డాయి. మోటార్‌సైకిల్ అల్యూమినియం ట్విన్-ట్యూబ్ ఫ్రేమ్‌పై నిర్మించబడింది. కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

Versys 1000 బైక్ యొక్క ముందువైపు 150 మి.మీ ట్రావెల్ 43 మిమీ ఇన్వర్టెడ్ ఫోకస్ మరియు వెనుక వైపు 152 మి.మీ ట్రావెల్ అడ్జస్టబుల్ గ్యాస్-ఛార్జ్డ్ మోనో-షాక్ అబ్జార్బర్ వంటి వాటికి పొందుతుంది. ఇక ఈ కొత్త బైక్ యొక్క బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో డ్యూయల్ 310 మి.మీ పెటల్ డిస్క్‌లు ఉపయోగించబడ్డాయి. ఇది కవాసకి యొక్క ఇంటెలిజెంట్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో పాటు వెనుక భాగంలో 250 మి.మీ పెటల్ డిస్క్ బ్రేక్ యూనిట్‌ను పొందుతుంది.

కొత్త Kawasaki Versys 1000 బైక్ బరువు 255 కేజీల వరకు ఉంటుంది. అయితే ఈ బైక్ యొక్క ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 21 లీటర్లు. ఈ స్పోర్ట్స్ టూరర్ కోసం కె-కేర్ ప్యాకేజీని ప్రారంభించనున్నట్లు కంపెనీ ప్రకటించడం గమనార్హం. ఈ ప్యాకేజీలో మోటార్‌సైకిల్‌కు వారంటీ అందుబటుకో ఉంటుంది.

కవాసకి ఇటీవల అంతర్జాతీయ మార్కెట్ల కోసం తన కొత్త 2022 కవాసకి డబ్ల్యు800 ని వెల్లడించింది. ఈ కొత్త బైక్ ఇటీవల కాలంలో యునైటెడ్ స్టేట్స్‌లో పరిచయం చేయబడింది. అయితే ఈ రెట్రో క్లాసిక్ మోటార్‌సైకిల్ యూరోపియన్ మార్కెట్‌లకు కూడా పరిచయం చేయబడింది.

కొత్త 2022 కవాసకి డబ్ల్యు800 బైక్ ఇప్పుడు చూడటానికి చాలా అద్బుతంగా ఉంది, దీని కోసం కంపెనీ ఈ బైక్ లో అనేక కాస్మొటిక్ అప్డేట్స్ అందించింది. ఈ బైక్ కొత్త కలర్ స్కీమ్ మరియు ఆకర్షణీయమైన బాడీ గ్రాఫిక్స్ మొదలైన వాటితో మార్కెట్లోకి ప్రవేశపెట్టబడింది. ఇది ఒక్క చూపులోనే ఆకర్శించే విధంగా ఉంది.

ఈ కొత్త రెట్రో మోటార్‌సైకిల్ 773 సిసి, వర్టికల్-ట్విన్, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్ట్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజన్ 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 48 బిహెచ్‌పి పవర్ మరియు 4,800 ఆర్‌పిఎమ్ వద్ద 62.9 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. అంతే కాకుండా కంపెనీ ఈ ఇంజన్‌లో అసిస్ట్ మరియు స్లిప్పర్ క్లచ్‌ని కూడా ఉపయోగిస్తుంది. ఈ కొత్త బైక్ గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








