పెట్రోల్ ధరలు పెరుగుతున్నా తగ్గని బైక్ సేల్స్, ఫిబ్రవరి బజాజ్ సేల్స్ రిపోర్ట్

దేశంలో ఓవైపు పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నప్పటికీ, కస్టమర్లు మాత్రం కొత్త ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేయటం తగ్గించడం లేదు. గడచిన ఫిబ్రవరి నెలలో బజాజ్ ఆటో తమ ద్విచక్ర వాహన అమ్మకాల్లో 7 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసినట్లు పేర్కొంది.

పెట్రోల్ ధరలు పెరుగుతున్నా తగ్గని బైక్ సేల్స్, ఫిబ్రవరి బజాజ్ సేల్స్ రిపోర్ట్

ఫిబ్రవరి 2020తో పోల్చుకుంటే ఫిబ్రవరి 2021లో బజాజ్ ఆటో మొత్తం (ద్విచక్ర మరియు వాణిజ్య) వాహనాల అమ్మకాలు 6 శాతం వృద్ధిని నమోదు చేశాయి. వీటిలో బజాజ్ ఆటో యొక్క ద్విచక్ర వాహన అమ్మకాలు 7 శాతం వృద్ధిని నమోదు చేయగా, వాణిజ్య వాహనాల అమ్మకాలు 5 శాతం క్షీణతను నమోదు చేశాయి.

పెట్రోల్ ధరలు పెరుగుతున్నా తగ్గని బైక్ సేల్స్, ఫిబ్రవరి బజాజ్ సేల్స్ రిపోర్ట్

బజాజ్ ఆటో గత నెలలో (ఫిబ్రవరి 2021లో) మొత్తం 3,32,563 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో బజాజ్ టూవీలర్ల అమ్మకాలు 3,10,222 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో కంపెనీ టూవీలర్ అమ్మకాలు 7 శాతం వృద్ధిని సాధించాయి.

MOST READ:డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని ఎలక్ట్రిక్ బైక్ డెలివరీ షురూ చేసిన ఆటమ్‌మొబైల్; వివరాలు

పెట్రోల్ ధరలు పెరుగుతున్నా తగ్గని బైక్ సేల్స్, ఫిబ్రవరి బజాజ్ సేల్స్ రిపోర్ట్

మొత్తం టూవీలర్ అమ్మకాలలో 1,48,934 యూనిట్లను దేశీయ మార్కెట్లో విక్రయించగా, మిగిలిన 1,83,629 యూనిట్లను విదేశాలకు ఎగుమతి చేసినట్లు కంపెనీ ప్రకటించింది. దేశీయ మార్కెట్లో కంపెనీ అమ్మకాలు స్వల్పంగా 1 శాతం వృద్ధిని నమోదు చేయగా, ఎగుమతి అమ్మకాలు మాత్రం 12 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

పెట్రోల్ ధరలు పెరుగుతున్నా తగ్గని బైక్ సేల్స్, ఫిబ్రవరి బజాజ్ సేల్స్ రిపోర్ట్

ఇయర్-టు-డేట్ (వైటిడి) అమ్మకాల పరంగా చూసుకుంటే, బజాజ్ ఆటో మొత్తం అమ్మకాలలో 12 శాతం క్షీణత నమోదైంది. ఏప్రిల్ 2020 - ఫిబ్రవరి 2021 మధ్య కాలంలో కంపెనీ మొత్తం 32,75,760 యూనిట్ల విక్రయించగా, అంతకు ముందు ఇదే సమయంలో ఇవి 37,36,492 యూనిట్లుగా ఉన్నాయి.

MOST READ:మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ [వీడియో]

పెట్రోల్ ధరలు పెరుగుతున్నా తగ్గని బైక్ సేల్స్, ఫిబ్రవరి బజాజ్ సేల్స్ రిపోర్ట్

వీటిలో బజాజ్ ఆటో దేశీయ మార్కెట్లో 16,27,982 యూనిట్లను విక్రయించగా, మిగిలిన 16,47,778 యూనిట్లను విదేశాలకు ఎగుమతి చేసింది. నుండి వచ్చాయి. ఇయర్-టు-డేట్ (వైటిడి) (ఏప్రిల్ 2020 - ఫిబ్రవరి 2021) అమ్మకాల్లో బజాజ్ ఆటో దేశీయ మరియు ఎగుమతి అమ్మకాల్లో వరుసగా 18 శాతం మరియు 6 శాతం తగ్గుదలను నమోదు చేసింది.

పెట్రోల్ ధరలు పెరుగుతున్నా తగ్గని బైక్ సేల్స్, ఫిబ్రవరి బజాజ్ సేల్స్ రిపోర్ట్

ఇక వాణిజ్య వాహనాల (కమర్షియల్ వెహికల్) విషయానికి వస్తే, బజాజ్ ఆటో తన వార్షిక అమ్మకాలతో పోలిస్తే, ఈ విభాగంలో 5 శాతం క్షీణతను నమోదు చేసింది. ఫిబ్రవరి 2020లో 44,691 యూనిట్లుగా ఉన్న బజాజ్ వాణిజ్య వాహనాల విక్రయాలు ఫిబ్రవరి 2021లో 42,454 యూనిట్లకు పడిపోయాయి.

MOST READ:ట్రాఫిక్ ఫైన్ అడిగితే మంగళ సూత్రం ఇచ్చిన మహిళ.. ఇది ఎక్కడో కాదు, మన బెంగళూరులోనే

పెట్రోల్ ధరలు పెరుగుతున్నా తగ్గని బైక్ సేల్స్, ఫిబ్రవరి బజాజ్ సేల్స్ రిపోర్ట్

అయితే, ఈ సమయంలో (ఫిబ్రవరి 2021లో) వాణిజ్య వాహనాల ఎగుమతులు మాత్రం 16 శాతం వృద్ధిని నమోదు చేసి 26,577 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే సమయంలో దేశీయ మార్కెట్లో బజాజ్ ఆటో వాణిజ్య వాహనాల అమ్మకాలు 21,871 యూనిట్లుగా ఉంటే, ఫిబ్రవరి 2021లో 15,877 యూనిట్లకు పడిపోయి, 27 శాతం క్షీణతను నమోదు చేశాయి.

పెట్రోల్ ధరలు పెరుగుతున్నా తగ్గని బైక్ సేల్స్, ఫిబ్రవరి బజాజ్ సేల్స్ రిపోర్ట్

మొత్తంగా చూసుకుంటే, భారత మార్కెట్లోని ద్విచక్ర వాహన విభాగంలో బజాజ్ ఆటో సానుకూల వృద్ధితో ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది. కంపెనీ అందిస్తున్న పల్సర్ రేంజ్ మోటార్‌సైకిళ్లు కంపెనీ అమ్మకాలను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. బజాజ్ ఇటీవలే తమ కొత్త పల్సర్ 180 మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసింది. - దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

MOST READ:మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు సూపర్ లుక్, సూపర్ ఫీచర్స్

Most Read Articles

English summary
Bajaj Auto February 2021 Two Wheeler Sales Registers 7 Percent Growth. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X