దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త బజాజ్ పల్సర్ 180 ; ధర & వివరాలు

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో ఎట్టకేలకు తన పల్సర్ 180 బిఎస్ 6 వెర్షన్ బైక్ కి భారత మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో ఈ బజాజ్ పల్సర్ 180 ధర రూ. 1.4 లక్షలు (ఎక్స్ షోరూమ్). ప్రస్తుతం ఈ బైక్ బ్లాక్ కలర్ అప్సన్ లో మాత్రమే అందుబాటులో ఉంది.

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త బజాజ్ పల్సర్ 180 ; ధర & వివరాలు

బజాజ్ పల్సర్ 180 బిఎస్ 6 ఒక నేకెడ్ రోడ్‌స్టర్ బైక్, ఇది స్పోర్టి లుక్ మరియు మంచి పనితీరుకి ప్రసిద్ధి చెందింది. ఇప్పటికే బజాజ్ కంపెనీ తమ బైకులను బిఎస్ 6 ఉద్గార నిబంధనలకు అనుకూలంగా అప్డేట్ చేస్తోంది. ఈ క్రమంలోనే బజాజ్ ఇప్పుడు తన పల్సర్ 180 ను బిఎస్ 6 అప్‌డేట్‌తో తీసుకువచ్చింది.

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త బజాజ్ పల్సర్ 180 ; ధర & వివరాలు

ఈ బైక్ చాలా స్టైలింగ్ గా కనిపిస్తుంది. ఇది సింగిల్ పాడ్ హెడ్లైట్, ట్విన్ డిఆర్ఎల్ మరియు ముందు భాగంలో లైట్ కలర్ విజర్ కలిగి ఉంది. ఇది సరికొత్త సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్యూయెల్ ట్యాంక్, ఇంజిన్ కౌల్, స్ప్లిట్-స్టైల్ సీట్ మరియు స్పోర్టి పిలియన్ గ్రాబ్ రైలవంటి వాటిని కలిగి ఉంది.

MOST READ:భర్తకు 16 లక్షల కారు గిఫ్ట్‌గా ఇచ్చిన తెలుగు యాంకర్ లాస్య

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త బజాజ్ పల్సర్ 180 ; ధర & వివరాలు

కొత్త బిఎస్ ప బజాజ్ పల్సర్ 180 లో 178.6 సిసి, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్ ఉంది. ఇది 8500 ఆర్‌పిఎమ్ వద్ద 16.7 బిహెచ్‌పి శక్తిని మరియు 6500 ఆర్‌పిఎమ్ వద్ద 14.52 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ ఇంజిన్‌తో 5-స్పీడ్ గేర్‌బాక్స్ తో జత చేయబడి ఉంటుంది.

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త బజాజ్ పల్సర్ 180 ; ధర & వివరాలు

ఈ బైక్ యొక్క సస్పెన్షన్ సెటప్ విషయానికి వస్తే, దీని ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక గ్యాస్ ఛార్జ్డ్ ట్విన్ స్ప్రింగ్ కలిగి ఉంది. బ్రేకింగ్ కోసం, ముందు భాగంలో 280 మిమీ సింగిల్ డిస్క్ మరియు వెనుక భాగంలో 230 మిమీ సింగిల్ రోటర్ ఇవ్వబడ్డాయి. ఈ బైక్‌లో సింగిల్ ఛానల్ ఎబిఎస్ కూడా అందుబాటులో ఉంటుంది.

MOST READ:శిల్పా శెట్టి గ్యారేజ్‌లో చేరిన మరో ఖరీదైన లగ్జరీ కార్, ఇదే

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త బజాజ్ పల్సర్ 180 ; ధర & వివరాలు

ఇప్పుడు బజాజ్ ఆటో ఈ కొత్త పల్సర్ 180 బైకుని 180 - 200 సిసి విభాగంలో తీసుకువచ్చారు. బజాజ్ యొక్క అమ్మకాలు గత జనవరిలో మంచి అమ్మకాలతో ముందుకు సాగింది. మునుపటి కంటే గత నెల అమ్మకాలపరంగా దాదాపు 58 శాతం వృద్ధిని నమోదు చేసింది.

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త బజాజ్ పల్సర్ 180 ; ధర & వివరాలు

బజాజ్ కంపెనీలు అత్యధికంగా అమ్మడైన మోడళ్లలో ఒకటి ఈ బజాజ్ పల్సర్. ఈ విభాగంలోని అన్ని మోడల్స్ మంచి అమ్మకాలను సాధించాయి. ఈ పరిధిలో కంపెనీ 125 సిసి, 150 సిసి, 180 సిసి, 200 సిసి, 220 సిసి మోడళ్లను విక్రయిస్తుంది.

MOST READ:రూ. 30 కోట్లతో హెలికాఫ్టర్ కొన్న రైతు.. ఎందుకో తెలుసా ?

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త బజాజ్ పల్సర్ 180 ; ధర & వివరాలు

బిఎస్ 6 నిబంధనలు అమలులోకి వచ్చిన తర్వాత చాలా మోడల్స్ వీటికి అనుగుణంగా అప్డేట్ చేయబడ్డాయి. బిఎస్ 6 అప్డేట్స్ తర్వాత ఈ పల్సర్ 180 బైక్ అమ్మకాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకోవడానికి కొంత సమయం వేచి చూడాలి.

Most Read Articles

English summary
Bajaj Pulsar 180 BS6 Launched In India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X