ఏప్రిల్ 2021 నుండి మరింత ప్రియం కానున్న హోండా హైనెస్ సిబి350 బైక్

హోండా మోటార్‌సైకిల్ మరియు స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) లిమిటెడ్ తమ బిగ్‌వింగ్ ప్రీమియం డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయిస్తున్న హోండా హైనెస్ సిబి350 మోటార్‌సైకిల్ ధరలను ఏప్రిల్ 2021 నెల నుండి పెరగనున్నాయి.

ఏప్రిల్ 2021 నుండి మరింత ప్రియం కానున్న హోండా హైనెస్ సిబి350 బైక్

వచ్చే నెల నుండి ఈ రెట్రో క్లాసిక్ మోటార్‌సైకిల్ ధరలు రూ.5,000 మేర పెరగే అవకాశం ఉంది. కాగా, ధరల పెరుగుదలకు సంబంధించి అధికారిక ప్రకటనను కంపెనీ ఇంకా విడుదల చేయలేదు. ప్రస్తుతం, ఇది డీలక్స్ మరియు డీలక్స్ ప్రో అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది.

ఏప్రిల్ 2021 నుండి మరింత ప్రియం కానున్న హోండా హైనెస్ సిబి350 బైక్

ప్రతి వేరియంట్ కూడా మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. వాటి ధరలు ఇలా ఉన్నాయి:

* హోండా హైనెస్ సిబి350 డీలక్స్: రూ.1,86,500

* హోండా హైనెస్ సిబి350 డీలక్స్ ప్రో: రూ.1,92,500

(రెండు ధరలు ఎక్స్-షోరూమ్)

MOST READ:వాహనదారులకు గుడ్ న్యూస్.. మళ్ళీ పెరిగిన డ్రైవింగ్ లైసెన్స్ గడువు, లాస్ట్ డేట్ ఎప్పుడంటే

ఏప్రిల్ 2021 నుండి మరింత ప్రియం కానున్న హోండా హైనెస్ సిబి350 బైక్

హోండా హైనెస్ సిబి350 మోటార్‌సైకిల్‌లో 348.36 సిసి సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 20.78 బిహెచ్‌పి పవర్ మరియు 30 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్ జతచేయబడి ఉంటుంది.

ఏప్రిల్ 2021 నుండి మరింత ప్రియం కానున్న హోండా హైనెస్ సిబి350 బైక్

ఈ మోటార్‌సైకిల్‌లోని మెకానికల్స్‌ను గమనిస్తే, ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో ట్విన్-షాక్ సస్పెన్షన్ యూనిట్స్ ఉంటాయి. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లు అమర్చబడి ఉంటాయి, ఇవి డ్యూయల్-ఛానల్ ఏబిఎస్‌ను సపోర్ట్ చేస్తాయి.

MOST READ:ట్రాఫిక్ సిగ్నెల్‌లో డాన్స్ చేసిన కెటిఎమ్ బైక్ రైడర్ [వీడియో]

ఏప్రిల్ 2021 నుండి మరింత ప్రియం కానున్న హోండా హైనెస్ సిబి350 బైక్

ఇందులో ముందు వైపు 19 ఇంచ్, వెనుక వైపు 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి మరియు వాటిపై ట్యూబ్‌లెస్ టైర్లను అమర్చబడి ఉంటాయి. దీని మొత్తం బరువు 181 కిలోలుగా ఉంటుంది. ఇందులో 15 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది.

ఏప్రిల్ 2021 నుండి మరింత ప్రియం కానున్న హోండా హైనెస్ సిబి350 బైక్

ఈ రెట్రో లుకింగ్ మోటార్‌సైకిల్ లుక్‌ని మరింత అందంగా మార్చడానికి ఇందులో గుండ్రటి ఆకారంలో ఉండే ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్ లాంప్స్ మరియు టర్న్-సిగ్నల్ ఇండికేటర్స్ ఉంటాయి. ఇంకా ఇందులో గుండ్రటి సైడ్ మిర్రర్స్, పెద్ద ఫ్యూయెల్ ట్యాంక్‌ ఉంటాయి. ప్రీమియం లుక్ కోసం ఈ మోటారుసైకిల్ సైలెన్సర్‌తో సహా కొన్ని ఇతర భాగాలు క్రోమ్‌తో ఫినిష్ చేయబడి ఉంటాయి.

MOST READ:భార్య పుట్టినరోజుకి కోటి రూపాయల కార్ గిఫ్ట్‌గా ఇచ్చిన భర్త.. ఎవరో తెలుసా?

ఏప్రిల్ 2021 నుండి మరింత ప్రియం కానున్న హోండా హైనెస్ సిబి350 బైక్

ఈ బైక్‌లో సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది, ఇది రైడర్‌కు కావల్సిన డేటాను అందిస్తుంది. మోటార్‌సైకిల్‌ను స్మార్ట్‌ఫోన్‌తో అనుసంధానం చేయటం కోసం ఇందులో బ్లూటూత్ కనెక్టింగ్ టెక్నాలజీతో కూడిన బ్రాండ్ యొక్క మొట్టమొదటి ‘హోండా స్మార్ట్‌ఫోన్ వాయిస్ కంట్రోల్ సిస్టమ్' కూడా ఉంటుంది. ఇంకా ఇందులో హోండా టార్క్ కంట్రోల్ ఫంక్షన్‌ను కూడా ఉంది.

ఏప్రిల్ 2021 నుండి మరింత ప్రియం కానున్న హోండా హైనెస్ సిబి350 బైక్

హోండా హైనెస్ సిబి 350 ఈ విభాగంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 మరియు స్టాండర్డ్ జావా మోటార్‌సైకిల్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. ఈ మోడల్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ ఓ రోడ్‌స్టర్ మోటార్‌సైకిల్ సిబి 350 ఆర్ఎస్‌ను కూడా ఇటీవలే విడుదల చేసింది. - పూర్తి సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

MOST READ:మీకు తెలుసా.. మారుతి సుజుకి బాలెనోతో 22 గంటల్లో 1,850 కిమీ ప్రయాణం.. కొత్త రికార్డ్ కైవసం

Source: HT Auto

Most Read Articles

English summary
Honda H'ness CB350 Prices To Go Up From 1st April 2021, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X