అలెర్ట్: హోండా హైనెస్ సిబి350 మోటార్‌సైకిల్ గేర్‌బాక్స్‌లో సమస్యలు, రీకాల్!

హోండా మోటార్‌సైకిల్ మరియు స్కూటర్ ఇండియా (హెచ్‌ఎమ్ఎస్‌ఐ) గతేడాది భారత మార్కెట్లో విడుదల చేసిన తమ సరికొత్త ప్రీమియం మోటార్‌సైకిల్ హైనెస్ సిబి350లో గేర్‌బాక్స్‌లో తలెత్తే సమస్యల కారణంగా వాటిని రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

అలెర్ట్: హోండా హైనెస్ సిబి350 మోటార్‌సైకిల్ గేర్‌బాక్స్‌లో సమస్యలు, రీకాల్!

భారతదేశంలో నవంబర్ 25, 2020వ తేదీ నుండి డిసెంబర్ 12, 2020వ తేదీ మధ్య కాలంలో తయారు చేసిన హోండా హైనెస్ సిబి350 మోటార్‌సైకిళ్లు ఈ రీకాల్‌కు వర్తిస్తాయని కంపెనీ పేర్కొంది. ఈ మధ్య కాలంలో తయారైన హోండా సిబి350 మోటార్‌సైకిళ్ల గేర్‌బాక్స్‌లో వేరొక ప్రమాణంతో కూడిన విడిభాగాన్ని ఉపయోగించినట్లు కంపెనీ గుర్తించి స్వచ్ఛంద రీకాల్ ప్రకటించింది.

అలెర్ట్: హోండా హైనెస్ సిబి350 మోటార్‌సైకిల్ గేర్‌బాక్స్‌లో సమస్యలు, రీకాల్!

ఈ మోటార్‌సైకిల్‌లోని గేర్‌బాక్స్ యొక్క కౌంటర్ షాఫ్ట్ 4వ గేర్‌లో హోండా వేరే మెటీరియల్ గ్రేడ్ వాడకాన్ని గుర్తించింది, ఇది భవిష్యత్తులో మోటారుసైకిల్ యొక్క పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని కంపెనీ పేర్కొంది. అయితే, ఇప్పటి వరకూ ఈ సమస్య గురించి ఎలాంటి ఫిర్యాదులు రాలేదని, తామే రెగ్యులర్ చెక్స్‌లో భాగంగా ఈ విషయాన్ని గుర్తించామని కంపెనీ తెలిపింది.

MOST READ:షిప్పుల గురించి తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు.. ఇక్కడ మీకోసం..ఓ లుక్కేసెయ్యండి

అలెర్ట్: హోండా హైనెస్ సిబి350 మోటార్‌సైకిల్ గేర్‌బాక్స్‌లో సమస్యలు, రీకాల్!

నవంబర్ 25, 2020వ తేదీ నుండి డిసెంబర్ 12, 2020వ తేదీ మధ్య కాలంలో తయారైన హోండా సిబి350 మోటార్‌సైకిళ్ల యొక్క ప్రస్తుత వారంటీ స్థితితో సంబంధం లేకుండా, ముందుజాగ్రత్త చర్యగా ప్రభావిత భాగాన్ని (గేర్‌బాక్స్‌లో కౌంటర్ షాఫ్ట్ 4వ గేర్‌ను) ఉచితంగా భర్తీ చేస్తామని కంపెనీ ప్రకటించింది. మార్చి 23, 2021వ తేదీ నుండి ఈ రీకాల్ క్యాంపైన్ ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది.

అలెర్ట్: హోండా హైనెస్ సిబి350 మోటార్‌సైకిల్ గేర్‌బాక్స్‌లో సమస్యలు, రీకాల్!

ఇప్పటికే హోండా హైనెస్ సిబి350 మోటార్‌సైకిళ్లను కొనుగోలు చేసిన కస్టమర్లు, తమ మోటార్‌సైకిల్ ఈ రీకాల్‌కు వర్తిస్తుందో తెలుసుకోవటానికి కంపెనీ తమ వెబ్‌సైట్‌ను అప్‌డేట్ చేసింది.

MOST READ:టైర్లు లేని ఈ ట్రాక్టర్, వ్యవసాయానికి బలేగుంది గురూ..!

అలెర్ట్: హోండా హైనెస్ సిబి350 మోటార్‌సైకిల్ గేర్‌బాక్స్‌లో సమస్యలు, రీకాల్!

ఇందుకు కస్టమర్లు చేయాల్సిందల్లా, హోండా బిగ్‌వింగ్ (https://www.hondabigwing.in/) వెబ్‌సైట్‌ను సందర్శించి అందులోని ప్రోడక్ట్ పేజ్‌లో హైనెస్ సిబి350 మోడల్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత కస్టమర్లు మోటార్‌సైకిల్ యొక్క విన్ నెంబర్‌ను అక్కడ ఇచ్చిన బాక్స్‌లో ఎంటర్ చేయటం ద్వారా తమ మోడల్ ఈ రీకాల్‌కు వర్తిస్తుందో లేదో తెలుసుకోవచ్చు.

అలెర్ట్: హోండా హైనెస్ సిబి350 మోటార్‌సైకిల్ గేర్‌బాక్స్‌లో సమస్యలు, రీకాల్!

ఒకవేళ కస్టమర్ యొక్క మోటార్‌సైకిల్ ఈ రీకాల్‌కు వర్తించినట్లయితే, సదరు కస్టమర్ ఉచిత మరమ్మతు కోసం డీలర్‌షిప్‌ను సందర్శించడానికి ముందుగా ముందస్తు అపాయింట్‌మెంట్ తీసుకోవాల్సి ఉంటుందని కంపెనీ పేర్కొంది. కంపెనీ కూడా, రీకాల్‌కు వర్తించే వాహనాలను గుర్తించి సదరు కస్టమర్లకు తెలియజేయటం జరుగుతుంది.

MOST READ:యువకులు కూడా చేయలేని బైక్ స్టంట్ చేసిన యువతి అరెస్ట్

అలెర్ట్: హోండా హైనెస్ సిబి350 మోటార్‌సైకిల్ గేర్‌బాక్స్‌లో సమస్యలు, రీకాల్!

హోండా టూవీలర్ అందిస్తున్న ఈ 'హైనెస్ సిబి350' మోటార్‌సైకిల్ మార్కెట్లోకి ప్రవేశించిన అతికొద్ది సమయంలోనే 10 వేల మందికి పైగా కస్టమర్లకు చేరువైనట్లు కంపెనీ తెలిపింది. అక్టోబర్ 21, 2020వ తేదీన ఈ మోడల్ డెలివరీలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. అప్పటి నుండి ఇప్పటి వరకూ కేవలం 3 నెలలో వ్యవధిలోనే 10,000 యూనిట్ల హైనెస్ సిబి350 మోడళ్లను విక్రయించినట్లు హెచ్ఎమ్ఎస్ఐ పేర్కొంది.

అలెర్ట్: హోండా హైనెస్ సిబి350 మోటార్‌సైకిల్ గేర్‌బాక్స్‌లో సమస్యలు, రీకాల్!

హోండా హైనెస్ సిబి350 డీలక్స్ మరియు డీలక్స్ ప్రో అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. ప్రతి వేరియంట్ కూడా మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. మార్కెట్లో దీని దరలు రూ.1.86 (ఎక్స్-షోరూమ్) లక్షల నుండి ప్రారంభం అవుతాయి. ఇది ఈ విభాగంలో ప్రధానంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 మోడల్‌కి పోటీగా నిలుస్తుంది.

MOST READ:గ్రామస్థుల మాటలు తప్పుగా అర్థం చేసుకుని వారిపై విరుచుకుపడిన యువతి [వీడియో]

అలెర్ట్: హోండా హైనెస్ సిబి350 మోటార్‌సైకిల్ గేర్‌బాక్స్‌లో సమస్యలు, రీకాల్!

ఈ మోటార్‌సైకిల్‌లో 348.36 సిసి సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 20.8 బిహెచ్‌పి పవర్ మరియు 30 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్ జతచేయబడి ఉంటుంది. ఇందులో డిస్క్ బ్రేకులు ఉంటాయి, ఇవి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్‌ను సపోర్ట్ చేస్తాయి.

Most Read Articles

English summary
Honda Twowheelers Recalled H'ness CB350 Due To Transmission Issues. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X