ఇయర్-ఎండ్ ఎఫెక్ట్; డిసెంబర్ 2020లో 3 శాతం పెరిగిన హోండా సేల్స్

గడచిన డిసెంబర్ 2020 నెలలో ఇయర్ ఎండ్ సేల్స్ ఆఫర్లు చక్కగా పనిచేశాయి. ఈ ఆఫర్ల కారణంగా, ప్రముఖ టూవీలర్ కంపెనీ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) లిమిటెడ్ గత నెలలో 3 శాతం అమ్మకాల వృద్ధిని సాధించినట్లు ప్రకటించింది.

ఇయర్-ఎండ్ ఎఫెక్ట్; డిసెంబర్ 2020లో 3 శాతం పెరిగిన హోండా సేల్స్

డిసెంబర్ 2019లో హోండా విక్రయించిన 2,55,283 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే, డిసెంబర్ 2020లో కంపెనీ మొత్తం 2,63,027 టూవీలర్లను విక్రయించి 3 శాతం వృద్ధిని సాధించింది.

ఇయర్-ఎండ్ ఎఫెక్ట్; డిసెంబర్ 2020లో 3 శాతం పెరిగిన హోండా సేల్స్

గత నెలలో హోండా విక్రయించిన మొత్తం 2,63,027 యూనిట్లలో 2,42,046 యూనిట్లు దేశీయ మార్కెట్ నుండే వచ్చాయని, మిగిలిన 20,981 యూనిట్లు వివిధ అంతర్జాతీయ మార్కెట్లకు చేసిన ఎగుమతుల నుండి వచ్చాయని కంపెనీ వివరించింది.

MOST READ:మారుతి-టొయోటా జేవీ నుండి వస్తున్న చిన్న కారు మరియు ఓ ఎమ్‌పివి

ఇయర్-ఎండ్ ఎఫెక్ట్; డిసెంబర్ 2020లో 3 శాతం పెరిగిన హోండా సేల్స్

డిసెంబర్ 2020లో హోండా దేశీయ అమ్మకాలు 5 శాతం పెరిగి 2,42,046 యూనిట్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే సమయంలో ఇవి 2,30,197 యూనిట్లుగా ఉన్నాయి. దేశంలో కరోనా మహమ్మారి విజృంభన తర్వాత వరుసగా 5వ నెలలో కూడా కంపెనీ సానుకూల వృద్ధిని నమోదు చేసింది.

ఇయర్-ఎండ్ ఎఫెక్ట్; డిసెంబర్ 2020లో 3 శాతం పెరిగిన హోండా సేల్స్

కోవిడ్-19 మహమ్మారి కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీ చాలా క్లిష్టతరంగా మారింది. రెండవ త్రైమాసికంలో పరిస్థితులు కొంచెం మారడంతో, మార్కెట్లో టూవీలర్లకు తిరిగి డిమాండ్ జోరందుకుంది. కాగా, మూడవ త్రైమాసికం నుండి కంపెనీ సానుకూల ఫలితాలను సాధించడం మొదలుపెట్టింది.

MOST READ:లవ్‌బర్డ్ ; భారతదేశపు మొదటి ఎలక్ట్రిక్ కార్.. మీరు చూసారా..!

ఇయర్-ఎండ్ ఎఫెక్ట్; డిసెంబర్ 2020లో 3 శాతం పెరిగిన హోండా సేల్స్

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ మరియు డిసెంబర్ 2020 మధ్య కాలంలోని మూడవ త్రైమాసికంలో, ఇయర్-ఆన్-ఇయర్ అమ్మకాలను పోల్చి చూస్తే, అంతకు ముందు ఆర్థిక సంవత్సరం క్యూ3లో 10,91,299 యూనిట్ల అమ్మకాలు నమోదు కాగా, ప్రస్తుత క్యూ3లో అమ్మకాలు 11,49,101 యూనిట్లకు పెరిగి 5 శాతం వృద్ధిని సాధించాయి.

ఇయర్-ఎండ్ ఎఫెక్ట్; డిసెంబర్ 2020లో 3 శాతం పెరిగిన హోండా సేల్స్

డిసెంబర్ 2020లో సానుకూలమైన రిటైల్ మరియు హోల్‌సేల్ ఫలితాలను చూసిన తరువాత, కొత్త ఆశలతో 2021లోకి ప్రవేశిస్తున్నామని, తాము భారతదేశంలో హోండా బ్రాండ్ యొక్క 20వ వార్షికోత్సవానికి సన్నద్ధమవుతున్నామని హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ - సేల్స్ అండ్ మార్కెటింగ్ మిస్టర్ యాద్వీందర్ సింగ్ గులేరియా అన్నారు.

MOST READ:అటల్ టన్నెల్‌లో ఒకటి, రెండు కాదు ఏకంగా 82 వాహనాలు చిక్కుకున్నాయి.. కారణం ఇదే

ఇయర్-ఎండ్ ఎఫెక్ట్; డిసెంబర్ 2020లో 3 శాతం పెరిగిన హోండా సేల్స్

ఇదిలా ఉంటే, హోండా అందిస్తున్న ప్రీమియం లీజర్ మోటార్‌సైకిల్ హైనెస్ సిబి350 వెయిటింగ్ పీరియడ్ ఇప్పుడు ఈ విభాగంలోని రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 కన్నా తక్కువగా ఉంటోంది. కేవలం ఒక్క నెల వ్యవధిలోనే ఇది కస్టమర్ల వద్దకు చేరుకుంటోంది. - మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Honda Two Wheeler Sales Registers 3 Percent Yearly Growth In December 2020. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X