కవాసకి బైక్స్‌పై జనవరి 2021 ఆఫర్స్; భారీ డిస్కౌంట్స్

జపనీస్ టూవీలర్ బ్రాండ్ కవాసాకి, భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఎంపిక చేసిన మోడళ్లపై జనవరి 2021 ఆఫర్లను ప్రకటించింది. ఈనెలలో కస్టమర్లు కొనుగోలు చేసే కవాసకి మోటార్‌సైకిళ్లపై గరిష్టంగా రూ.50,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు.

కవాసకి బైక్స్‌పై జనవరి 2021 ఆఫర్స్; భారీ డిస్కౌంట్స్

డిస్కౌంట్లను అందిస్తున్న కవాసకి మోడళ్లలో కెఎల్ఎక్స్ 110, కెఎల్ఎక్స్ 140, కెఎక్స్ 100, డబ్ల్యూ 800, జెడ్ 650 వెర్సిస్ 650, మరియు వల్కాన్ ఎస్ మోటార్‌సైకిళ్లు ఉన్నాయి. ఈ మోడళ్లపై కంపెనీ ఓ డిస్కౌంట్ కూపన్‌ను అందిస్తోంది. కస్టమర్లు ఆ కూపన్‌లోని మొత్తాన్ని మోటార్‌సైకిల్ ధర తగ్గించడానికి ఉపయోగించుకోవచ్చు.

కవాసకి బైక్స్‌పై జనవరి 2021 ఆఫర్స్; భారీ డిస్కౌంట్స్

అలాకాకుండా, కస్టమర్లు ఆ కూపన్‌లో ఉన్న మొత్తంతో ఆఫ్టర్ మార్కెట్ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ ఆఫర్ జనవరి 1 నుండి జనవరి 31, 2021 మధ్య కొనుగోలు చేసిన కవాసకి మోటార్‌సైకిళ్లకు వర్తిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఓ కవాసాకి డీలర్‌షిప్‌లోనైనా ఈ కూపన్‌ను ఉపయోగించుకోవచ్చు.

MOST READ:ఫలించిన కల; భారత్‌లో ప్రారంభమైన ఎయిర్ టాక్సీ సర్వీస్

కవాసకి బైక్స్‌పై జనవరి 2021 ఆఫర్స్; భారీ డిస్కౌంట్స్

కవాసాకి వెర్సిస్ 650 మరియు వెర్సిస్ 1000 అడ్వెంచర్ టూరింగ్ మోటార్‌సైకిళ్లను కంపెనీ వరుసగా రూ.50,000 మరియు రూ.30,000 విలువైన ‘అడ్వెంచర్ వోచర్' అనే డిస్కౌంట్‌తో అందిస్తున్నారు. కస్టమర్లు ఈ కూపన్‌ను అప్-ఫ్రంట్ ఖర్చును తగ్గించడానికి లేదా మోటారుసైకిల్ యాక్ససరీస్ కోసం ఉపయోగించవచ్చు.

కవాసకి బైక్స్‌పై జనవరి 2021 ఆఫర్స్; భారీ డిస్కౌంట్స్

కవాసకి వల్కాన్ ఎస్ మరియు జెడ్ 650 మోడళ్లపై వరుసగా రూ.20,000 మరియు రూ.30,000 వోచర్‌ను అందిస్తున్నారు. అలాగే, కంపెనీ అందిస్తున్న డబ్ల్యూ800 రెట్రో-స్టైల్ మోటారుసైకిల్‌పై రూ.30,000 విలువైన డిస్కౌంట్ వోచర్‌ను ఆఫర్ చేస్తున్నారు.

MOST READ:కొత్త ఆడి ఎ4 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. పూర్తి వివరాలు

కవాసకి బైక్స్‌పై జనవరి 2021 ఆఫర్స్; భారీ డిస్కౌంట్స్

ఇకపోతే, బ్రాండ్ యొక్క ఆఫ్-రోడ్ నాన్-స్ట్రీట్-లీగల్ మోటార్‌సైకిళ్లు అయిన కెఎక్స్ 100, కెఎల్ఎక్స్ 140 మరియు కెఎల్ఎక్స్ 110 మోడళ్లను‘ఆఫ్-రోడ్ వోచర్' అనే డిస్కౌంట్ వోచర్‌తో అందిస్తున్నారు. ఈ మోడళ్లపై వరుసగా రూ.50,000, రూ.40,000 మరియు రూ.30,000 డిస్కౌంట్‌ను అందిస్తున్నారు.

కవాసకి బైక్స్‌పై జనవరి 2021 ఆఫర్స్; భారీ డిస్కౌంట్స్

కవాసాకి ఇటీవలే భారత మార్కెట్లో తమ సరికొత్త 2021 మోడల్ కవాసాకి జెడ్ 650 మరియు కవాసకి వెర్సిస్ 1000 మోటార్‌సైకిళ్లను విడుదల చేసింది. ఈ రెండు కొత్త మోడళ్లలో అనేక డిజైన్, ఫీచర్ అప్‌గ్రేడ్‌లు ఉన్నాయి.

MOST READ:బైక్ రైడర్‌కి రూ. 1 లక్షకు పైగా జరిమానా.. కారణం మాత్రం ఇదే

కవాసకి బైక్స్‌పై జనవరి 2021 ఆఫర్స్; భారీ డిస్కౌంట్స్

కొత్త 2021 కవాసాకి జెడ్ 650 మోటార్‌సైకిల్‌ను రూ.6.04 రీటైల్ ధరతో విక్రయిస్తున్నారు. ఇది మునుపటి తరం మోడల్ కంటే రూ.10,000 ఎక్కువ ధరను కలిగి ఉంది. ఇకపోతే, కొత్త 2021 కవాసకి వెర్సిస్ 1000 మోటార్‌సైకిల్‌ను రూ.11.19 లక్షల రీటైల్ ధరతో విడుదల చేశారు. ఇది పాత మోడల్ ధర కంటే రూ.20,000 అధికంగా ఉంటుంది (పైన పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా). - మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
January 2021 Offers And Discounts On Select Kawasaki Motorcycles. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X