Kawasaki Z650RS బైక్ విడుదల: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

జపనీస్ టూవీలర్ బ్రాండ్ కవాసకి (Kawasaki) భారత మార్కెట్లో మరో అత్యాధునిక బైక్‌ను విడుదల చేసింది. కొత్త కవాసకి జెడ్650 ఆర్ఎస్ (Kawasaki Z650 RS) పేరుతో కంపెనీ ఈ కొత్త బైక్ విడుదల చేసింది. దీని ధర మరియు ఇతర ముఖ్యమైన సమాచారాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

Kawasaki Z650RS బైక్ విడుదల: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

కవాసకి ఇటీవలి కాలంలో భారతదేశంలో తమ ఉత్పత్తులను ఒక్కొక్కటిగా అప్‌గ్రేడ్ చేస్తూ వస్తోంది. ఇదే క్రమంలో కంపెనీ కొన్ని సరికొత్త మోడళ్లను కూడా ఇక్కడి మార్కెట్ కు పరిచయం చేస్తుంది. ఇందులో భాగంగానే, తాజాగా కొత్త కవాసకి జెడ్650 ఆర్ఎస్ (Kawasaki Z650 RS) బైక్ ను కంపెనీ విడుదల చేసింది.

Kawasaki Z650RS బైక్ విడుదల: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

అక్టోబర్ 30 వ తేదీ నుండి ఈ కొత్త బైక్ భారతదేశంలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. మార్కెట్లో కొత్త కవాసకి జెడ్650 ఆర్ఎస్ ధర రూ. 6.65 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంటుంది. కవాసకి Z650RS ఒక మిడిల్ వెయిట్ మోటార్‌సైకిల్. ఈ బైక్ క్యాండీ ఎమరాల్డ్ గ్రీన్ మరియు మెటాలిక్ మూన్ లైట్ గ్రే కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

Kawasaki Z650RS బైక్ విడుదల: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

ఈ బైక్ రెట్రో స్టైల్ లో కనిపించినప్పటికీ, ఇది ఆధునిక ఫీచర్లను కలిగి ఉంటుంది. దీని క్లాసిక్ లుక్ ని మరింత పెంచే గుండ్రటి ఎల్ఈడి హెడ్‌లైట్, పాత కాలపు మోటార్‌సైకిళ్ల మాదిరిగా కనిపించే ఫ్యూయెల్ ట్యాంక్ డిజైన్, సింగిల్ పీస్ కెఫే రేసర్ స్టైల్ సీట్, వెనుక వైపు గుండ్రటి టెయిల్ ల్యాంప్ మరియు దానికి ఇరువైపులా మోడ్రన్ ఎల్ఈడి ఇండికేటర్స్ వంటి క్లాసిక్ డిజైన్ ఎలిమెంట్స్ ను ఇందులో చూడొచ్చు.

Kawasaki Z650RS బైక్ విడుదల: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

కవాసకి జెడ్650 ఆర్ఎస్ బైక్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా రెట్రో మోడ్రన్ కలయికతో ఉంటుంది. ఇందులో ఓవైపు స్పీడ్ మరోవైపు ఆర్‌పిఎమ్ మీటర్లను సూచించే అనలాగ్ ట్విన్ డయల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు వాటి మధ్యలో డ్రైవర్ సమాచారం కోసం ఎల్‌సిడి స్క్రీన్‌ అమర్చబడి ఉంటుంది. మినిమలిస్టిక్ స్విచ్ గేర్ మరియు గుండ్రటి సైడ్ మిర్రర్స్ వంటి అంశాలను కూడా ఇందులో గమనించవచ్చు.

Kawasaki Z650RS బైక్ విడుదల: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

అధనపు స్థిరత్వం కోసం ఈ బైక్ను స్టీల్ ట్రేల్లిస్ ఫ్రేమ్ పై తయారు చేశారు. ఈ బైక్ మొత్తం బరువు 192 కిలోలుగా ఉంటుంది. ఇంజన్ విషయానికి వస్తే, Kawasaki Z650 RS బైక్‌లో 649 సిసి పారలల్ ట్విన్ ఇంజన్ ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 68 పిఎస్ శక్తిని మరియు 6,700 ఆర్‌పిఎమ్ వద్ద 64 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది.

Kawasaki Z650RS బైక్ విడుదల: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

ఈ ఇంజన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌ తో జతచేయబడి ఉంటుంది. అదనంగా, ఈ ఇంజన్‌ లో అసిస్ట్ మరియు స్లిప్పర్ క్లచ్ ఫీచర్ కూడా ఉంటుంది. మెరుగైన డ్రైవింగ్ అనుభవం కోసం ఈ బైక్ యొక్క రెండు చివర్లలో 17 ఇంచ్ వీల్స్ ఉంటాయి. టైర్ల విషయానికి వస్తే, ముందు భాగంలో 120/70 సైజు టైర్ మరియు వెనుక భాగంలో 160/60 సైజు టైర్ అమర్చబడి ఉంటుంది.

Kawasaki Z650RS బైక్ విడుదల: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

అన్ని రోడ్లపై మంచి హ్యాండ్లింగ్ ను ఆఫర్ చేసే ఈ బైక్ ను డిజైన్ చేశారు. ఉత్తమ రైడింగ్ అనుభవాన్ని అందించడానికి దీని ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో ప్రీ-లోడెడ్ అడ్జస్టబుల్ మోనో షాక్ అబ్జార్వర్ ఉంటుంది. ఇవి బైక్ యొక్క గ్రౌండ్‌ క్లియరెన్స్ ను 125 మిమీగా ఉంచడంలో సహకరిస్తాయి.

Kawasaki Z650RS బైక్ విడుదల: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

ఇక చివరిగా బ్రేకింగ్ విషయానికి వస్తే, రైడర్ కు మరింత సురక్షితమైన ప్రయాణాన్ని అందించడానికి ఈ బైక్ ముందు భాగంలో డ్యూయల్ పిస్టన్ కాలిపర్‌ లతో కూడిన డ్యూయల్ సెమీ-ఫ్లోటింగ్ 300 మిమీ డిస్కులు మరియు బైక్ వెనుక భాగంలో సింగిల్ పిస్టన్ కాలిపర్‌ తో కూడిన 220 మిమీ పెటల్ డిస్క్‌ బ్రేక్ ను అమర్చారు. ఇది డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్ ను సపోర్ట్ చేస్తుంది మరియు అద్భుతమైన బ్రేకింగ్‌ పనితీరును అందిస్తుంది.

Kawasaki Z650RS బైక్ విడుదల: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

భారత్‍లో 2022 Kawasaki Versys 1000 విడుదల, వివరాలు..

ఇదిలా ఉంటే, కవాసకి భారత మార్కెట్లో తమ కొత్త 2022 కవాసకి వెర్సిస్ 1000 (2022 Kawasaki Versys 1000) బైక్ ని కూడా మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ స్పోర్ట్స్ టూరింగ్ మోటార్‌సైకిల్ యొక్క అప్‌డేటెడ్ వెర్షన్‌ ధర రూ. 11.55 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా నిర్ణయించబడింది. ఈ మోడల్ కోసం బుకింగ్స్ కూడా ప్రారంభించబడ్డాయి. వచ్చే నెలలో డెలివరీలు కూడా ప్రారంభం కానున్నాయి.

Kawasaki Z650RS బైక్ విడుదల: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

మునుపటి కవాసకి వెర్సిస్ తో పోల్చుకుంటే, ఈ కొత్త 2022 కవాసకి వెర్సిస్ 1000 బైక్ లో కొన్ని కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. ఈ కొత్త మోడల్ ఇప్పుడు క్యాండీ లైమ్ గ్రీన్ టైప్ 3 షేడ్ పేరుతో ఒకే ఒక కలర్ అప్సన్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త మోడల్ లోని ఇంజన్ ఇప్పటికే బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్‌గ్రేడ్ చేయబడి ఉంది, కాబట్టి ఇందులో యాంత్రికంగా ఎలాంటి మార్పులు లేవు. - మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Saturday, October 30, 2021, 14:43 [IST]
English summary
Kawasaki z650rs bike launched in india price specs details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+