కొత్త 2021 Royal Enfield Classic 350 డెలివరీలు ప్రారంభం

చెన్నైకి చెందిన ప్రీమియం మోటార్‌సైకిల్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) తాజాగా మార్కెట్లో విడుదల చేసిన కొత్త 2021 క్లాసిక్ 350 (Classic 350) మోటార్‌సైకిల్ ను కంపెనీ తమ ఫ్యాక్టరీ నుండి డీలర్‌షిప్‌లకు డెలివరీ చేయటం ప్రారంభించింది. దేశీయ విపణిలో కొత్త 2021 Royal Enfield Classic 350 ప్రారంభ ధర రూ. 1.84 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది.

కొత్త 2021 Royal Enfield Classic 350 డెలివరీలు ప్రారంభం

దీని ఆన్-రోడ్ ధర విషయానికి వస్తే, స్టాండర్డ్ వేరియంట్ ధర సుమారు రూ. 2.07 లక్షలు కాగా, ఇందులో ఈ టాప్-ఎండ్ మోడల్ క్రోమ్ బ్రాంజ్ వేరియంట్ ఆన్ రోడ్ ధర సుమారు రూ. 2.40 లక్షల వరకు ఉంటుంది. వివిధ నగరాలు, రాష్ట్రాలు మరియు కస్టమర్లు ఎంచుకునే ఇన్సూరెన్స్ పాలసీలను బట్టి ఈ ఆన్-రోడ్ ధరలలో మార్పులు ఉంటాయని గమనించండి.

కొత్త 2021 Royal Enfield Classic 350 డెలివరీలు ప్రారంభం

కొత్త 2021 Classic 350 మోటార్‌సైకిల్‌ను కంపెనీ మొత్తం 11 కలర్ ఆప్షన్ లలో ప్రవేశపెట్టింది. మార్కెట్లో వీటి ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 1.84 లక్షల నుండి రూ. 2.15 లక్షల వరకు ఉంటాయి. అదే ఆన్-రోడ్ ధర విషయానికి వస్తే, వీటి ధరలు సుమారు రూ. 2.07 లక్షల నుండి రూ. 2.40 లక్షల వరకు ఉంటాయి.

కొత్త 2021 Royal Enfield Classic 350 డెలివరీలు ప్రారంభం

కొత్త 2021 Royal Enfield Classic 350 కోసం దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీ డీలర్లు బుకింగ్ లను స్వీకరిస్తున్నారు. ఆసక్తిగల కస్టమర్లు రూ. 10,000 అడ్వాన్స్ మొత్తాన్ని చెల్లించి ఈ బైక్ ను బుక్ చేసుకోవచ్చు. మరికొద్ది రోజుల్లోనే వీటి టెస్ట్ రైడ్ లు మరియు కస్టమర్ డెలివరీలు కూడా ప్రారంభం కానున్నాయి.

కొత్త 2021 Royal Enfield Classic 350 డెలివరీలు ప్రారంభం

కొన్ని ఎంపిక చేసిన కలర్ ఆప్షన్లను మాత్రమే Royal Enfield డీలర్‌షిప్ లు తమ షోరూమ్ లలో ప్రదర్శనకు ఉంచుతున్నాయి. కొత్త 2021 Classic 350 లో లభిస్తున్న కలర్ ఆప్షన్లలో క్రోమ్ బ్రాంజ్, డార్క్ స్టీల్త్ బ్లాక్, డార్క్ గన్‌మెటల్ గ్రే, సిగ్నల్స్ మార్ష్ గ్రే, సిగ్నల్స్ శాండ్‌స్టోర్మ్, హాల్‌సియోన్ గ్రీన్, హాల్‌సియాన్ బ్లాక్, హాల్‌సియోన్ గ్రే, రెడ్డిచ్ గ్రీన్ మరియు రెడ్డిచ్ గ్రే లు ఉన్నాయి.

కొత్త 2021 Royal Enfield Classic 350 డెలివరీలు ప్రారంభం

Royal Enfield తమ సిగ్నల్స్ ఎడిషన్ ను తిరిగి తీసుకువచ్చింది మరియు ఇది మునుపటి కన్నా మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కొత్త 2021 Classic 350 మోడల్ ను కూడా మీటియోర్ 350 (Meteor 350) ని తయారు చేసిన కొత్త J ప్లాట్‌ఫామ్ ఆధారంగానే నిర్మించారు.

కొత్త 2021 Royal Enfield Classic 350 డెలివరీలు ప్రారంభం

కొత్త 2021 Classic 350 మోటార్‌సైకిల్ లో Royal Enfield తమ లేటెస్ట్ 349 సిసి, సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించింది. ఈ ఇంజన్ గరిష్టంగా 6,100 ఆర్‌పిఎమ్ వద్ద 20.2 బిహెచ్‌పి పవర్ ను మరియు 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 27 న్యూటన్ మీటర్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది.

కొత్త 2021 Royal Enfield Classic 350 డెలివరీలు ప్రారంభం

ఇందులోని మెకానికల్ ఫీచర్లను గమనిస్తే, బైక్ ముందు భాగంలో 300 మిమీ డిస్క్ బ్రేక్ మరియు వెనుకవైపు 270 మిమీ డిస్క్ బ్రేక్ లను ఉపయోగించారు. ఇవి రెండూ ABS ఫీచర్ ను కలిగి ఉంటాయి. కాకపోతే, కస్టమర్ ఎంచుకునే వేరియంట్ ను బట్టి ఇందులో సింగిల్ ఛానల్ లేదా డ్యూయల్ ఛానల్ ABS ఫీచర్ లభిస్తుంది.

కొత్త 2021 Royal Enfield Classic 350 డెలివరీలు ప్రారంభం

కొత్త 2021 Royal Enfield Classic 350 డిజైన్ ను గమనిస్తే, దాని రెట్రో లుక్ ని అలానే క్యారీ చేసేందుకు కంపెనీ ప్రయత్నించింది. ఇందులో హెడ్‌లైట్ మరియు దాని పక్కనే రెండు చిన్న లైట్లు, టర్న్ ఇండికేటర్స్ మరియు టెయిల్ ల్యాంప్స్ అన్నీ కూడా గుండ్రంగానే ఉంటాయి. ఇంకా ఇందులో క్రోమ్ లో ఫినిష్ చేయబడిన ఎగ్జాస్ట్ మరియు సైడ్ మిర్రర్స్ కూడా ఉంటాయి.

కొత్త 2021 Royal Enfield Classic 350 డెలివరీలు ప్రారంభం

ఈ కొత్త 2021 Classic 350 లో ఆసక్తికరమైన మార్పు ఏంటంటే, ఇప్పుడు ఇది సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ తో వస్తుంది. ఇందులో ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్, రౌండ్ టిఎఫ్‌టి స్క్రీన్, స్పీడోమీటర్ క్రింద చిన్న ఎల్‌సిడి స్క్రీన్‌ మొదలైన వాటిని కలిగి ఉంటుంది. కాకపోతే, ఎల్ఈడి లైట్లు విరవిగా అందుబాటులోకి వచ్చిన ఈ కాలంలో కూడా కంపెనీ ఇందులోని హెడ్‌లైట్, టైల్ లైట్ మరియు ఇండికేటర్లలో కూడా హాలోజన్ బల్బులనే ఉపయోగిస్తోంది.

కొత్త 2021 Royal Enfield Classic 350 డెలివరీలు ప్రారంభం

మైలేజ్ విషయానికి వస్తే, కొత్త 2021 Royal Enfield Classic 350 ఒక లీటరు పెట్రోల్ కి 36 కిలోమీటర్ల మైలేజ్ ని అందిస్తుంది. ఇందులో 13 లీటర్ల సామర్థ్యం కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే, ఈ మోటార్‌సైకిల్ పై గరిష్టంగా 450 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది.

కొత్త 2021 Royal Enfield Classic 350 డెలివరీలు ప్రారంభం

ఈ కొత్త మోడల్ లో కంపెనీ ట్విన్-డౌన్‌ట్యూబ్ స్పైన్ చాసిస్ ను ఉపయోగించింది. మునుపటి తరం మోడల్ లో ఇందులో సింగిల్ డౌన్‌ట్యూబ్ చాసిస్ ను ఉపయోగించారు. ఫలితంగా, ఈ బైక్ బరువు 195 కిలోల వరకు ఉంటుంది. మా డ్రైవ్‌స్పార్క్ బృందం ఇటీవలే ఈ మోటార్‌సైకిల్ ను టెస్ట్ రైడ్ చేసింది. - దీనికి సంబంధించిన పూర్తి రివ్యూ కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Friday, September 3, 2021, 15:06 [IST]
English summary
New 2021 royal enfield classic 350 started arriving to dealerships
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+