భారతీయ మార్కెట్లో తిరుగులేని లెజండరీ బైక్ - 2021 Royal Enfield Classic 350 రివ్యూ.. ఫీచర్స్ & పర్ఫామెన్స్

Royal Enfield (రాయల్ ఎన్‌ఫీల్డ్) అనేది పరిచయం అవసరం లేని బైక్ తయారీ సంస్థ. కంపెనీ ప్రారంభమైన మొదటి నుంచి కూడా మంచి ప్రజాదరణతో ముందుకు సాగుతున్న కంపెనీ ఈ Royal Enfield. ఎదుకంటే దశాబ్దాలుగా ఈ బైక్ బ్రాండ్ కి ఆదరణ ఏ మాత్రం తగ్గలేదు అంటే అతిశయోక్తి కాదు.

ఈ రోజుకి కూడా యువకులను ఉర్రూతలూగిస్తున్న బైక్ బ్రాండ్ గా ప్రసిద్ధి చెందిన కంపెనీ ఇప్పటివరకు కూడా అనేక మోడల్స్ ప్రవేశపెట్టింది. చాలామంది రైడర్లు లాంగ్ డ్రైవ్ వంటివాటి కోసం ఈ బైక్స్ ఎంపిక చేసుకుంటే మరికొంతమంది లగ్జరీ అనుభవాన్ని ఆస్వాదించడానికి ఈ బైక్స్ ఎంచుకుంటున్నారు.

2009 లో మొదటిసారిగా ప్రవేశపెట్టబడిన Royal Enfield Classic బైక్, కొనుగోలుదారుల కొత్త శకానికి శ్రీకారం చుట్టింది. అతి తక్కువ కాలంలోనే ఈ కంపెనీ బైక్ తయారీదారులలోనే ఒక తిరుగులేని బ్రాండ్ గా నిలిచింది. మొదటి నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్నప్పటికీ, కంపెనీ యొక్క క్లాసిక్ బైక్ కొంత పాతది అవుతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. కావున కంపెనీ తరువాత దశలో కొత్త Royal Enfield Meteor 350 బైక్ విడుదల చేసింది.

ఇదిలా ఉండగా Royal Enfield కంపెనీ విడుదల చేయనున్న కొత్త 2021 Royal Enfield Classic 350 ఇప్పటికే అనేక సార్లు టెస్ట్ చేయబడింది. టెస్టింగ్ సమయంలో ఈ కొత్త బైక్ అనేకసార్లు గుర్తించబడింది. అయితే మేము ఇటీవల ఈ కొత్త 2021 Royal Enfield Classic 350 బైక్ రైడ్ చేసాము.

2021 Royal Enfield Classic 350 యొక్క ఫీచర్స్, పరికరాలు మరియు ఇంజిన్ పర్ఫామెన్స్ వంటి వాటిని గురించి మాత్రమే కాకుండా ఇందులోని అప్డేట్స్ వంటి విషయాలను గురించి మరింత సమాచారం ఈ రివ్యూ ద్వారా మీ కోసం తీసుకువచ్చాము.

2021 Royal Enfield Classic 350 డిజైన్ మరియు స్టైల్:

సాధారణంగా Classic 350 బైక్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే ఈ 2021 Royal Enfield Classic 350 బైక్ కొంత అప్డేటెడ్ డిజైన్ మరియు స్టైల్ పొందుతుంది. ఇందులో మునుపటి చాయలు ఏ మాత్రం తీసివేయకుండా కొత్త డిజైన్ ప్రవేశపెట్టడం అనేది కొంత సాహసంతో కూడుకున్న చర్య. కొత్త 2021 Classic 350 బైక్ తక్కువ వైఖరితో మరింత రెట్రోగా కనిపిస్తోంది. అయినప్పటికీ ఇది కొన్ని సిగ్నేచర్ డిజైన్ ఫీచర్స్ కలిగి ఉంటుంది.

కొత్త 2021 Royal Enfield Classic 350 ముందు భాగంలో రౌండ్ హెడ్‌ల్యాంప్‌ను పొందుతుంది, కానీ హెడ్‌ల్యాంప్ ఇప్పుడు దిగువ స్థానంలో ఉంది. హెడ్‌ల్యాంప్ సరౌండ్‌ క్రోమ్‌లో పూర్తయింది. ఇది మునుపటి మోడల్ మాదిరిగానే అప్పర్ హుడ్‌ను కూడా పొందుతుంది. ఈ బైక్ యొక్క హెడ్‌ల్యాంప్, గేజ్‌లు మరియు ఫ్రంట్ ఫోర్క్ మౌంట్‌ను మెటల్ క్లాక్ లోపల ఉంచే ఐకానిక్ ఫీచర్ కూడా కలిగి ఉంది. దీని వలన డాష్‌బోర్డ్ చక్కగా కనిపిస్తుంది.

కొత్త Classic 350 బైక్ ట్రిప్పర్ నావిగేషన్ స్క్రీన్‌ను కూడా అదే సెటప్‌లో పొందుపరిచారు. అంతే కాకుండా ఇది కలర్ టిఎఫ్‌టి స్క్రీన్‌ కలిగి ఉంటుంది. ఇది రైడర్లను ఎంతగానో ఆకట్టుకోవడంలో ఉపయోగపడుతుంది.

మేము రైడ్ చేసిన కొత్త Classic 350 బైక్ క్రోమ్ రెడ్‌లో అలంకరించబడింది, కావున ఇది ఎక్కువ మొత్తంలో క్రోమ్ పొందుతుంది. ఫ్రంట్ మడ్‌గార్డ్ ఒక క్రోమ్ ఫినిషింగ్‌ని రెడ్ స్ట్రిప్ మధ్యలో మరియు గోల్డెన్ పిన్‌స్ట్రిప్స్‌తో పొందుతుంది. ఫ్యూయెల్ ట్యాంక్‌లో కూడా అదే థీమ్ ఉంటుంది.

ఈ కొత్త బైక్ లోని ఫ్యూయెల్ ట్యాంక్ దాని అవుట్‌గోయింగ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. ఇది చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది. ట్యాంక్‌పై క్రోమ్ ఫినిషింగ్‌తో ఉన్న ట్యాంక్ ప్యాడ్‌ ఉంటుంది. అంతే కాకుండా దీనిపై రాయల్ ఎన్‌ఫీల్డ్ సింబల్ అద్భుతంగా కనిపిస్తుంది.

కొత్త Classic 350 బైక్ యొక్క సైడ్ ప్యానెల్‌లు కొత్తవి. దీనితో పాటు వైరింగ్ మరియు ఫ్యూయల్-ఇంజెక్షన్ మెకానిజమ్స్ అన్నీ ఓవల్ ఆకారంలో బ్లాక్ ప్లాస్టిక్‌లతో కప్పబడి ఉంటాయి. మెటల్ సైడ్ ప్యానెల్లు గ్లోస్ బ్లాక్ పూర్తి చేయబడ్డాయి. ఇవి కొత్త క్లాసిక్ 350 లోగోను కలిగి ఉంటాయి.

కొత్త Classic 350 బైక్ యొక్క స్టైలింగ్‌ను మెరుగుపరచడంలో ఇంజిన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీనికి ఇరువైపులా కవర్‌లు క్రోమ్‌లో పూర్తి చేయబడి, మంచి ఎగ్జాస్ట్ కూడా పొందుతుంది. ఇతర క్రోమ్డ్ భాగాలలో బార్-ఎండ్ వెయిట్స్, స్పోక్డ్ వీల్స్, రియర్ ఫెండర్, ఇన్స్ట్రుమెంటేషన్ సరౌండ్స్, ఇండికేటర్ సరౌండ్స్, రియర్-వ్యూ మిర్రర్స్, ఫ్యూయల్ ట్యాంక్ క్యాప్ మొదలైనవి ఉన్నాయి.

ఈ బైక్ యొక్క వెనుక వైపు రౌండ్ ఇండికేటర్స్ చుట్టూ సింపుల్ రౌండ్ టెయిల్ ల్యాంప్ ఉంది. టెయిల్ ల్యాంప్ కింద రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ ఉంది. సీట్లు కూడా రీడిజైన్ చేయబడి, కాంట్రాస్ట్ స్టిచ్చింగ్ కలిగి ఉంటాయి. డిస్క్ బ్రేక్‌లు పెద్దవి, కావున వెనుక భాగంలో ఎక్కువగా కనిపిస్తుంది.

ఇంజిన్ మరియు పర్ఫామెన్స్:

2021 Royal Enfield Classic 350 బైక్ 349 సిసి సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 6,100 ఆర్‌పిఎమ్ వద్ద 20.3 బిహెచ్‌పి పవర్ మరియు 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 27 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది.

ఇంజిన్ కెపాసిటీ 3 క్యూబిక్ సెంటీమీటర్లు పెరిగింది. బోర్ సైజు 2 మిమీ పెంచడం ద్వారా మరియు స్ట్రోక్ పొడవును 4.2 మిమీ తగ్గించడం ద్వారా ఇది సాధించబడింది. కావున ఇది మంచి రెస్పాన్స్ కలిగి ఉంటుంది. అంతే కాకుండా మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది.

ఈ కొత్త బైక్ లోని పాత పుష్ రాడ్ల స్థానంలో కొత్త ఓవర్‌హెడ్ క్యామ్‌షాఫ్ట్ మరియు కావెన్షనల్ వాల్వ్‌ట్రెయిన్ సెటప్ ఉన్నాయి. దీని ఫలితంగా, ఇంజిన్ మరింత శుద్ధి మరియు పరిపక్వత అనిపిస్తుంది. అంతే కాకుండా వైబ్రేషన్‌లు అరికట్టబడతాయి.

మునుపటి Classic 350 కొనుగోలుదారులు కలిగి ఉన్న అతి పెద్ద సమస్య ఇందులోని సౌండ్. అయితే ఈ కొత్త బైక్ లో ఈ సమస్య ఉండదు. కావున ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. కొనుగోలుదారులు తప్పకుండా దీనిని ఇష్టపడతారు.

కొత్త Classic 350 బైక్ దశాబ్దాల క్రితం నాటి పాత 'బుల్లెట్' లాగా అనిపించదు. కానీ ఇది చాలా అద్భుతంగా ఉంటుందని మాత్రం మేము చెప్పగలము. కొత్త బైక్ యొక్క ఇంజిన్ పెర్పామెన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది, కావున ఎలాంటి రోడ్డులో అయినా మంచి రైడింగ్ అనుభవాన్ని అందిస్తూ మంచి టార్క్ కూడా అందిస్తుంది.

రైడింగ్ మరియు హ్యాండ్లింగ్:

2021 Royal Enfield Classic 350 అనేది ఓపెన్ రోడ్ కోసం ఉద్దేశించబడింది, కానీ ఇది చాలా సంవత్సరాలుగా సాహసాలు చేయడానికి కూడా ఎక్కువగా ఉపయోగించబడింది. మనదేశంలో అడ్వెంచర్ మోటార్‌సైకిళ్లు ప్రాచుర్యం పొందడానికి ముందు, ఎక్కువమంది Classic 350 ను లేహ్-లడఖ్ సర్క్యూట్ చేయడానికి మరియు మంచుతో నిండిన రహదారులలో ప్రయాణించడానికి ఉపయోగించారు.

కొత్త Classic 350 బైక్ రైడింగ్ అంత ఆశ్చర్యం కలిగించకపోయినా, అనుకూలంగా ఉంది. ఈ మోటార్‌సైకిల్ సియేట్ జూమ్ ప్లస్ టైర్‌లపై నడుస్తుంది, కావున పొడి పరిస్థితులలో ఈ బైక్ మంచి పట్టును అందించింది. కానీ తడి పరిస్థితులలో, ఇది మరింత విశ్వాసాన్ని ప్రేరేపించాలని ఆశిస్తున్నాము, ఎందుకంటే బురదపై ప్రయాణించినప్పుడు, టైర్లు పూర్తిగా పట్టును కోల్పోతాయి.

పట్టణ ప్రాంతాల్లో Classic 350 రైడింగ్ చాలా సులభం. ఇది మంచి వేగంతో ప్రయాణిస్తూ కూడా మంచి పట్టుని అందించింది. ఇందులోని కొత్త ఫ్రేమ్ మరియు సస్పెన్షన్ చాలా అనుకూలంగా ఉంది.

ఓల్డ్-సింగిల్ డౌన్‌ట్యూబ్ చాసిస్ స్థానంలో ట్విన్-డౌన్‌ట్యూబ్ స్పైన్ చాసిస్ భర్తీ చేయబడింది. కావున కొత్త ఇంజిన్ మౌంట్‌లతో పాటు అద్భుతమైన వైబ్రేషన్ లేని రైడ్‌ని అందిస్తుంది. బెంగళూరు వంటి ట్రాఫిక్ నిండిన రోడ్లపై రైడ్ చేయడం కూడా సులభంగా ఉంటుంది.

సాధారణంగా Classic 350 ఎల్లప్పుడూ ఓపెన్ రోడ్ మరియు లాంగ్ రైడ్స్ కోసం ఉద్దేశించబడింది. ఓల్డ్ Classic 350 బైక్ గంటకు 80 కిమీ కంటే ఎక్కువ వేగంతో ఎక్కువ సేపు నడిపితే వైబ్రేషన్‌లను గమనించవచ్చు. తక్కువ వేగంతో వైబ్రేషన్‌లు ఉన్నాయి, కానీ అవి ఒక నిర్దిష్ట RPM వద్ద భరించలేని రివ్‌లు పెరిగే కొద్దీ పెరిగాయి.

అయితే కొత్త Classic 350 లో ఇవన్నీ కూడా చాలా భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే గంటకు 80 కిమీ వేగం వద్ద వైబ్రేషన్‌లు లేవు, గంటకు 100 కిమీ వేగంలో కూడా వైబ్రేషన్‌లు చాలా తక్కువ. ఇది నిజంగానే రాయల్ ఎన్‌ఫీల్డ్‌ సాధించిన గొప్ప విజయం. ఈ బైక్ రోజంతా 100 కిమీ కంటే ఎక్కువ వేగంతో రైడ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. రైడర్ మరియు పిలియన్‌కు ఎటువంటి ఇబ్బంది ఉండదు.

సస్పెన్షన్ ఇప్పుడు చాలా సాఫ్ట్ గా ఉండటం వల్ల రైడింగ్ కూడా చాలా స్మూత్ గా ఉండి ఎటువంటి రోడ్డులో అయినా ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. సీటు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇందులోని ఫుట్‌పెగ్‌లు రైడర్‌ని మరింత సౌకర్యవంతంగా ఉంచడానికి అనుమతిస్తాయి.

ఇందులోని బ్రేకింగ్ సిస్టం కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ బైక్ యొక్క ముందు భాగంలో 300 మిమీ డిస్క్ బ్రేక్ ఉంటుంది. ఇది దాని మునుపటి మోడల్ కంటే 20 మిమీ పెద్దదిగా ఉంటుంది, అదేవిధంగా వెనుక వైపు 270 మిమీ డిస్క్ బ్రేక్ అమర్చబడి ఉంటుంది. ఇది దాని మునుపటి మోడల్ కంటే 30 మిమీ పెద్దదిగా ఉంటుంది. అంతే కాకుండా ఇందులో ఏబీఎస్ కూడా స్టాండర్డ్ ఆ లభిస్తుంది. కొనుగోలుదారులు ఎంచుకున్న వేరియంట్‌ను బట్టి సింగిల్-ఛానల్ లేదా డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ పొందుతారు. అయితే వేరియంట్‌ల ధరలు భిన్నంగా ఉంటాయి.

ఈ కొత్త బైక్ 13 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్‌ కలియు ఉంటుంది. ఇది ఒక లీటరుకు 36 కిమీ మైలేజ్ అందిస్తూ, ఒక ఫుల్ ట్యాంక్ తో 450 కిలోమీటర్లకు పైగా పరిధిని అందిస్తుంది. మొత్తం మీద, పాత మోడల్ కంటే సరికొత్త Royal Enfield Classic 350 చాలా అప్డేట్స్ కలిగి ఉండటం వల్ల, వాహనదారులకు మంచి రైడింగ్ ఆనుభావాన్ని అందిస్తుంది.

ఫీచర్స్;

కొత్త Royal Enfield Classic 350 ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులోని అతి పెద్ద హైలైట్ ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్. ట్రిప్పర్ నావిగేషన్ సిస్టం మొదట Royal Enfield Meteor 350 లో ప్రవేశించింది. ఇకపై వచ్చే అన్ని మోడల్స్ ఈ సిస్టం కలిగి ఉండే అవకాశం ఉంటుంది.

కొత్త Classic 350 లో ఇది కన్సోల్‌లో చక్కగా విలీనం చేయబడింది. కావున దీనిని ఉపయోగించడం చాలా సులభం. Royal Enfield స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా డైరెక్షన్స్ సర్క్యులర్ TFT స్క్రీన్‌కు సులభంగా మరియు త్వరగా పంపవచ్చు. ట్రిప్పర్ నావిగేషన్ కొన్ని వేరియంట్లలో మాత్రమే ప్రామాణిక పరికరాలుగా అందుబాటులో ఉంటుంది. మిగిలిన వేరియంట్‌లలో, అదే స్థలం Royal Enfield లోగోతో ఉంటుంది.

Royal Enfield Classic 350 డిజిటల్-అనలాగ్ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ను కలిగి ఉంది. స్పీడోమీటర్ అనలాగ్ ఫార్మాట్‌లో ఉంది. స్పీడోమీటర్ కింద మోటార్ సైకిల్ గురించి ప్రాథమిక సమాచారాన్ని ప్రదర్శించే ఒక చిన్న LCD స్క్రీన్ ఉంది. ఇది ఫ్యూయల్ గేజ్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్లు మొదలైన వాటిని ప్రదర్శిస్తుంది, ఇది ఒక ఎకో ఇండికేటర్‌ని కలిగి ఉంటుంది. ఇది మోటార్‌సైకిల్ ఇంధన సమర్థవంతమైన రీతిలో నడుస్తున్నప్పుడు LCD స్క్రీన్‌లో 'ECO' అనే పదాన్ని సూచిస్తుంది.

ఈ కొత్త మోటార్‌సైకిల్‌ LED లైటింగ్‌ను కోల్పోయింది. హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్ ల్యాంప్‌లు మరియు ఇండికేటర్స్ అన్నీ హాలోజన్ బల్బులను కలిగి ఉంటాయి. ఇవి కూడా వాహనదారునికి చాలా అనుకూలంగా ఉంటాయి.

కలర్ ఆప్సన్స్:

కొత్త 2021 Royal Enfield Classic 350 మునుపెన్నడూ లేనంత ఎక్కువ కలర్ ఆప్సన్స్ కలిగి ఉంది. కావున ఎక్కువమంది కస్టమర్లు తమకు నచ్చిన కలర్ ఆప్సన్ ఎంచుకోవచ్చు. ఇందులో

 • క్రోమ్ రెడ్
 • క్రోమ్ బ్రాంజ్
 • డార్క్ స్టీల్త్ బ్లాక్
 • డార్క్ గన్‌మెటల్ గ్రే
 • సిగ్నెల్స్ మార్స్ గ్రే
 • సిగ్నల్స్ సాండ్ స్ట్రోమ్
 • హాల్సియన్ గ్రీన్
 • హాల్సియోన్ బ్లాక్
 • హాల్సియోన్ గ్రే
 • రెడ్డిచ్ గ్రీన్
 • రెడ్డిచ్ గ్రే
 • హాల్సియాన్ గ్రీన్ షేడ్ అద్భుతంగా కనిపిస్తుంది, ఎందుకంటే ఇది అన్నింటిలోనూ అత్యంత రెట్రో కలర్ స్కీమ్. ఇది మాత్రమే కాకుండా డార్క్ గన్‌మెటల్ గ్రే మరియు డార్క్ స్టీల్త్ బ్లాక్ కూడా అద్భుతంగా ఉంటుంది.

  ప్రత్యర్థులు:

  కొత్త Royal Enfield Classic 350 బైక్ Honda Highness CB350, Jawa వంటి వాటికి మాత్రమే కాకుండా Royal Enfield Meteor 350 కి కూడా ప్రత్యర్దిగా ఉంటుంది. ఈ కొత్త బైక్ దాని ప్రత్యర్థులకంటే కూడా చాలా మెరుగ్గా ఉంటుంది.

  డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

  భారతీయ మార్కెట్లో కంపెనీ యొక్క అమ్మకాలను దృష్టిలో ఉంచుకుని చూసినట్లతే Classic 350 బైక్ కి అప్డేట్ అవసరం లేదు, కానీ మరిన్ని ఎక్కువ అమ్మకాల కోసం తప్పకుండా ఈ బైక్ అప్డేట్ చేయబడాలి. ఈ కారణంగానే ఈ బైక్ ఇప్పుడు అధునాతన ఫీచర్స్ కలిగి ఉంది.దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త Royal Enfield Classic 350 ధర రూ. 1.84 లక్షలు.

  కొత్త బైక్ అద్భుతమైన ఇంజిన్ మరియు ఫ్రేమ్ కలిగి ఉంది. కావున ఈ కొత్త 2021 Royal Enfield Classic 350 బైక్ దాని మునుపటి మోడల్ కంటే కూడా ఎక్కువ అమ్మకాలను సొంతం చేసుకుంటుందని భావిస్తున్నాము.

Most Read Articles

English summary
2021 royal enfield classic 350 review performance specs engine riding impressions tripper navigation
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X