కొత్త 2021 కవాసకి వల్కాన్ ఎస్ విడుదల: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు..
జపనీస్ టూవీలర్ బ్రాండ్ కవాసకి, ఇటీవలి కాలంలో భారత మార్కెట్లో తమ లేటెస్ట్ వాహనాలను విడుదల చేస్తూ వస్తోంది. ఇటీవలే తమ కొత్త 2022 కవాసకి నింజా 650 మరియు 2022 కవాసకి జీ650 మోడళ్లను విడుదల చేసిన కంపెనీ, తాజాగా సరికొత్త 2022 కవాసకి వల్కాన్ ఎస్ క్రూయిజర్ మోటార్‌సైకిల్‌ని విడుదల చేసింది.

భారత మార్కెట్లో కొత్త 2022 కవాసకి వల్కాన్ ఎస్ ధర రూ.6.10 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. గతేడాది ఇదే సమయంలో విడుదల చేసిన ప్రస్తుత బిఎస్6 మోడల్ ధర కంటే ఈ కొత్త 2022 మోడల్ ధర రూ.6,000 అధికంగా ఉంటుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ విభాగంలో కవాసకి వల్కాన్ ఎస్ మోడల్‌కి నేరుగా ఎలాంటి పోటీ లేదు.

అయితే, ఇటాలియన్ టూవీలర్ బ్రాండ్ బెనెల్లీ ఇటీవల విడుదల చేసిన బెనెల్లీ 502సి మోడల్‌తో ఇది పోటీ పడే అవకాశం ఉన్నప్పటికీ, దీని ధర కేవలం రూ.4.98 లక్షలు (ఎక్స్-షోరూమ్) గానే ఉంటుంది. కాబట్టి, ఈ ధర వల్కాన్ ఎస్ ధర కంటే చాలా తక్కువగా ఉంటుంది. భవిష్యత్తులో ఈ మోడల్‌కి పోటీగా హోండా నుండి రెబెల్ 500 బైక్ రాబోతోంది. ఈ ఏడాది చివరి నాటికి ఇది భారతదేశంలో విడుదలయ్యే అవకాశం ఉంది.

కొత్త 2022 వల్కాన్ ఎస్ మోటార్‌సైకిల్‌లో కంపెనీ డిజైన్ పరంగా పెద్ద మార్పులు ఏవీ చేయలేదు. కంపెనీ దీనిని ఇప్పుడు కొత్త మెటాలిక్ మ్యాట్ గ్రే పెయింట్ ఆప్షన్‌తో ప్రవేశపెట్టింది. ఈ కొత్త మోడల్‌లో ఇంధన ట్యాంక్, రేడియేటర్ సైడ్ కవర్ మరియు వీల్ రిమ్‌ల గుండా నడుస్తున్న ఆకుపచ్చ పిన్‌స్ట్రిప్ ఈ బైక్ మొత్తం ఆకర్షణను పెంచుతుంది.

ఇంజన్ పరంగా కూడా కొత్త 2022 కవాసకి వల్కాన్ ఎస్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ బైక్‌లో బిఎస్6 కంప్లైంట్ 650సిసి లిక్విడ్-కూల్డ్, పారలల్-ట్విన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 60.1 బిహెచ్‌పి శక్తిని మరియు 6,600 ఆర్‌పిఎమ్ వద్ద 63 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

అదనపు సౌలభ్యం కోసం, కవాసకి వల్కాన్ ఎస్ ఎర్గో-ఫిట్‌తో అందించబడుతుంది, ఇది రైడర్లు వారి సౌకర్యానికి అనుగుణంగా ఫుట్‌పెగ్‌లు, సీటు మరియు లివర్‌ల స్థానాన్ని మార్చడానికి అనుమతిస్తుంది. ఈ బైక్‌లో, కంపెనీ డైమండ్-టైప్ ఫ్రేమ్‌ని, ట్రెడిషనల్ టెలిస్కోపిక్ ఫోర్కులను మరియు 7-వే అడ్జస్టబల్ రియర్ మోనోషాక్ సస్పెన్షన్ సెటప్‌ను ఉపయోగించిది.

వల్కాన్ ఎస్ క్రూయిజర్ మోటార్‌సైకిల్‌లో రెట్రో-లుకింగ్ ఓవల్-షేప్ హెడ్‌ల్యాంప్ ఉంటుంది, దాని చుట్టూ బ్లాక్ కలర్ కౌల్ ఉంటుంది. ముందు వైపు హెడ్‌ల్యాంప్‌కు దిగువవ రెండు చివర్లలో అమర్చిన టర్న్ ఇండికేటర్స్ మరియు వెనుక వైపు టెయిల్ ల్యాంప్‌తో పాటు అమర్చిన లోవర్-సెట్ టర్న్ సిగ్నల్, స్టయిలిష్ బై-స్పోక్ అల్లాయ్ వీల్స్ మరియు ఇంజన్‌కు దిగువన అమర్చిన ఎగ్జాస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఈ బైక్ ముందు భాగంలో డ్యూయెల్ 300 మిమీ డిస్క్ బ్రేక్‌లు మరియు వెనుకవైపు సింగిల్ 250 మిమీ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. ఈ మోటార్‌సైకిల్ స్టాండర్డ్ డ్యూయెల్-ఛానల్ ఏబిఎస్‌ను కలిగి ఉంటుంది. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, కొత్త కసవాకి వల్కాన్ ఎస్ బిఎస్6 యొక్క మొత్తం బరువు 226 కిలోలుగా ఉంటుంది.

కవాసకి వల్కాన్ ఎస్‌లోని ఇతర ఫీచర్లను గమనిస్తే, 14-లీటర్ స్కల్ప్టెడ్ ఫ్యూయెల్ ట్యాంక్, అప్-రైట్ హ్యాండిల్ బార్ మరియు మంచి కుషనింగ్ కలిగిన రైడర్ అండ్ పిలియన్ సీట్స్, ఫార్వర్డ్-సెట్ ఫుట్‌పెగ్స్ మొదలైనవి ఉన్నాయి. ఈ ఫీచర్లన్నీ కూడా వల్కాన్ ఎస్ క్రూయిజర్‌పై సుదూర ప్రయాణాలకు అనువుగా ఉంటాయి.

ఈ బైక్‌లో సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది మరియు ఇది గేర్ ఇండికేటర్, ట్రిప్-మీటర్, స్పీడ్, మరియు ఫ్యూయెల్ ఇండెక్స్ మొదలైన రైడర్‌కు అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది. కొత్త 2022 కవాసకి వల్కాన్ ఎస్ కోసం కంపెనీ బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. ఈ బైక్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్ లేదా అధికారిక డీలర్‌షిప్‌ల నుండి బుక్ చేసుకోవచ్చు.
కవాసకి ఇండియా దేశీయ మార్కెట్లో ఇటీవల తన కొత్త 2022 నింజా 650 బైక్ ని కూడా లాంచ్ చేసింది. కవాసకి యొక్క 2022 నింజా 650 బైక్ యొక్క ఫీచర్స్ మరియు పరికరాలతో పాటు మరింత సమాచారం తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications