Bajaj Dominar 400 ఇప్పుడు కొత్త యాక్ససరీస్‌తో: ధర రూ. 2.17 లక్షలు

దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థ Bajaj Auto (బజాజ్ ఆటో) తన Bajaj Dominar 400 యొక్క అప్డేటెడ్ వెర్షన్ ను భారతీయ విఫణిలో విడుదల చేసింది. ఈ కొత్త బైక్ ఫ్యాక్టరీ ఫిట్టేడ్ యాక్ససరీస్ కలిగి ఉంటుంది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త Bajaj Dominar 400 ధర రూ. 2.17 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

Bajaj Dominar 400 ఇప్పుడు కొత్త యాక్ససరీస్‌తో: ధర రూ. 2.17 లక్షలు

కొత్త Bajaj Dominar 400 బైక్ ఫ్యాక్టరీ ఫిట్టేడ్ యాక్ససరీస్ కలిగి ఉంటుంది కావున, చాలా ఆకర్షణీయంగా మరియు అధునాతనంగా ఉంటుంది. ఇది అదనపు ఫీచర్స్ తో అప్డేట్ చేయబడి ఉంటుంది. ఈ బైక్ ఇప్పుడు మునుపటి కంటే పొడవైన విజర్, హ్యాండ్ గార్డ్, పిలియన్ బ్యాక్-రెస్ట్ మరియు లగేజ్ క్యారియర్ వంటి అదనపు ఫీచర్లను పొందుతుంది.

Bajaj Dominar 400 ఇప్పుడు కొత్త యాక్ససరీస్‌తో: ధర రూ. 2.17 లక్షలు

అంతే కాకుండా Dominar 400 బైక్ ఇంటిగ్రేటెడ్ మెటల్ స్కిడ్ ప్లేట్, కొత్త లెగ్ గార్డ్ మరియు శాడిల్ స్టేతో కూడిన ఇంజన్ బాష్ ప్లేట్‌ను కూడా కలిగి ఉంటుంది. వీటితో పాటు కంపెనీ అప్‌డేట్ చేయబడిన ఈ మోటార్‌సైకిల్‌పై నావిగేషన్ స్టే కూడా అమర్చింది. కావున రైడర్ తన నావిగేషన్ డివైజ్‌లలో ఒకదాన్ని ఈ మోటార్‌సైకిల్‌కి అటాచ్ చేసుకోవచ్చు. తద్వారా ఇది వాహన ఇనియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

Bajaj Dominar 400 ఇప్పుడు కొత్త యాక్ససరీస్‌తో: ధర రూ. 2.17 లక్షలు

ఈ కొత్త అప్డేటెడ్ బైక్ లో మొబైల్ ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి USB ఛార్జింగ్ పోర్ట్ ఆప్సన్ కూడా ఇవ్వబడింది. ఈ కొత్త బైక్ లో కంపెనీ అందించిన ప్రత్యేకమైన యాక్సెసరీలు కాకుండా మిగిలినవన్నీ కూడా స్టాండర్డ్‌గా అందుబాటులో ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇందులో చేసిన మార్పులు దాని కొత్త యాక్సెసరీస్ ప్యాక్‌కి మాత్రమే పరిమితమయ్యాయి.

Bajaj Dominar 400 ఇప్పుడు కొత్త యాక్ససరీస్‌తో: ధర రూ. 2.17 లక్షలు

బజాజ్ డామినార్ 400 బైక్ దాని మునుపటి మోడల్ యొక్క స్టాండర్డ్ ఇంజిన్ పొందుతుంది. ఈ బైక్ లో ఇప్పటికే ఉన్న బజాజ్ డామినార్ 400 యొక్క 373.3 సిసి సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగిస్తుంది. ఈ ఇంజన్ 39.42 బిహెచ్‌పి పవర్ మరియు 35 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ అందిస్తుంది.

Bajaj Dominar 400 ఇప్పుడు కొత్త యాక్ససరీస్‌తో: ధర రూ. 2.17 లక్షలు

ఇంజిన్ మాత్రమే కాకుండా, ఇతర భాగాలూ కూడా దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. కావున ఈ కొత్త డామినార్ 400 బైక్ ఫ్యాక్టరీ-ఫిట్టింగ్ టూరింగ్ యాక్సెసరీస్‌తో పాటు, 43 మిమీ అప్‌సైడ్ ఫ్రంట్ ఫోర్కులు, రియర్ మోనో-షాక్, రెండు చక్రాలపై డిస్క్ బ్రేకులు మరియు ట్విన్ బారెల్ ఎగ్సాస్ట్ సెటప్‌ వంటి వాటిని కలిగి ఉంటుంది.

Bajaj Dominar 400 ఇప్పుడు కొత్త యాక్ససరీస్‌తో: ధర రూ. 2.17 లక్షలు

కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త బైక్ కేవలం రెండు కలర్స్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అవి అరోరా గ్రీన్ మరియు చార్‌కోల్ బ్లాక్ కలర్స్. ఈ రెండు కలర్స్ మాత్రమే విక్రయానికి అందుబాటులో ఉన్నాయి. ఇది చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉండటమే కాకుండా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా కూడా ఉంటుంది.

Bajaj Dominar 400 ఇప్పుడు కొత్త యాక్ససరీస్‌తో: ధర రూ. 2.17 లక్షలు

దేశీయ మార్కెట్లో కంపెనీ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన బైక్ మోడల్స్ లో బజాజ్ డామినార్ 400 ఒకటి. ఇది మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. అంతే కాకుండా కంపెనీ యొక్క అమ్మకలను పెంచడంలో కూడా ఈ మోడల్ చాలా సహకరిస్తోంది.

Bajaj Dominar 400 ఇప్పుడు కొత్త యాక్ససరీస్‌తో: ధర రూ. 2.17 లక్షలు

కంపెనీ బజాజ్ డొమినార్ 400 ను విక్రయిస్తోంది. ఇది కాకుండా, బజాజ్ ఆటో తన కొత్త బజాజ్ పల్సర్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేయబోతోంది. కంపెనీ కొత్త తరం బజాజ్ పల్సర్‌ను రాబోయే అక్టోబర్ 28న విడుదల చేయనుంది.

Bajaj Dominar 400 ఇప్పుడు కొత్త యాక్ససరీస్‌తో: ధర రూ. 2.17 లక్షలు

ఇదిలా ఉండగా బజాజ్ ఆటో భారత మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ మోటార్‌సైకిల్ బ్రాండ్ పల్సర్ లో కంపెనీ ఓ కొత్త తరం మోడల్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. బజాజ్ నుండి రానున్న ఈ నెక్స్ట్ జనరేషన్ పల్సర్ మోటార్‌సైకిల్ లేటెస్ట్ డిజైన్ మరియు ఫీచర్లను కలిగి ఉంటుంది.

Bajaj Dominar 400 ఇప్పుడు కొత్త యాక్ససరీస్‌తో: ధర రూ. 2.17 లక్షలు

ప్రస్తుతం, భారత మార్కెట్లో బజాజ్ పల్సర్ మోడళ్లు అత్యంత ప్రజాదరణ పొందినవి మరియు యువతను ఎక్కువగా ఆకర్షిస్తాయి. బజాజ్ ఆటో తమ పల్సర్ సిరీస్ లో 125 సిసి మొదలుకొని 220 సిసి వరకు వివిధ రకాల బాడీ స్టైల్ లో వీటిని విక్రయిస్తోంది. కాగా, ప్రస్తుత పండుగ సీజన్ లో కంపెనీ ఈ కొత్త తరం పల్సర్ బైక్ ను మార్కెట్లో విడుదల చేయనుంది. దీని గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Monday, October 25, 2021, 18:30 [IST]
English summary
New bajaj dominar 400 launched with factory fitted touring accessories details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+