Yamaha నుంచి రానున్న కొత్త స్కూటర్; Aerox 155

జపాన్‌కు చెందిన ప్రముఖ ద్వి చక్ర వాహన తయారీ సంస్థ Yamaha భారతీయ మార్కెట్లో కొత్త మోడల్స్ ప్రవేశపెట్టడానికి తగిన సన్నాహాలను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ Yamaha కంపెనీ కొత్త 155 సిసి స్కూటర్ త్వరలో విడుదల చేయనుంది. ఈ కొత్త స్కూటర్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

Yamaha నుంచి రానున్న కొత్త స్కూటర్; Aerox 155

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన Yamaha Aerox 155 స్కూటర్ రాబోయే కొద్ది రోజుల్లో భారతీయ మార్కెట్లో అరంగేట్రం చేయనుంది. భారతదేశంలో ప్రీమియం సెగ్మెంట్‌పై దృష్టి పెడతామని Yamaha ప్రకటించిన విషయం తెలిసిందే. కావున కంపెనీ ఇప్పుడు 150 సిసి మరియు 250 సిసి మోడల్స్ త్వరలో విడుదల చేయబడతాయి. ఇందులో భాగంగా Yamaha Aerox 155 విడుదల కానుంది.

Yamaha నుంచి రానున్న కొత్త స్కూటర్; Aerox 155

అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించబడుతున్న కొత్త Yamaha Aerox 155 స్కూటర్ చాలా స్టైలిష్ గా, అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో షార్ప్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు మరియు ఎల్ఈడీ డిఆర్ఎల్ వంటి వాటిని కలిగి ఉంటుంది. ఈ స్కూటర్ కొత్త ఎల్ఈడీ టెయిల్‌లైట్‌ను పొందడంతో, టెయిల్‌గేట్ కూడా పునఃరూపకల్పన చేయబడింది.

Yamaha నుంచి రానున్న కొత్త స్కూటర్; Aerox 155

కొత్త Yamaha Aerox 155 స్కూటర్ ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంది. కొత్త Yamaha Aerox 155 స్కూటర్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో Yamaha ఆర్15 వి3.0 వలె 155 సీసీ, లిక్విడ్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 15.4 బిహెచ్‌పి పవర్ మరియు 13.8 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఆర్15 లో కనిపించే 6 స్పీడ్ గేర్‌బాక్స్ కాకుండా, స్కూటర్ CVT గేర్‌బాక్స్‌ను అందుకుంటుంది.

Yamaha నుంచి రానున్న కొత్త స్కూటర్; Aerox 155

కొత్త Yamaha Aerox 155 స్కూటర్ యొక్క ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 4.6 లీటర్ల నుండి 5.5 లీటర్లకు పెంచారు. Yamaha Aerox 155 స్కూటర్ లో 14 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కలిగి ఉంటుంది. కావున మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది.

Yamaha నుంచి రానున్న కొత్త స్కూటర్; Aerox 155

కొత్త Yamaha Aerox 155 స్కూటర్ సస్పెన్షన్ సెటప్ విషయానికొస్తే, ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుకవైపు ట్విన్ గ్యాస్-ఛార్జ్డ్ షాకర్‌లు లభిస్తాయి. ఈ కొత్త Yamaha Aerox 155 స్కూటర్ లో బ్రేకింగ్ సిస్టమ్ చాలా అద్భుతంగా ఉంది. బ్రేకింగ్ కోసం ముందు భాగంలో డిస్క్ బ్రేక్‌లు మరియు వెనుకవైపు డ్రమ్ బ్రేక్ అమర్చబడి ఉంటాయి.

Yamaha నుంచి రానున్న కొత్త స్కూటర్; Aerox 155

Yamaha కంపెనీ తన కొత్త MT-15 MotoGP ఎడిషన్‌ను భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో కొత్త MT-15 Monster Energy Moto GP Edition (ఎంటి-15 మాన్స్టర్ ఎనర్జీ మోటో GP ఎడిషన్‌)ను విడుదల చేసింది. భారతీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త బైక్ ధర రూ. 1,47,900 (ఎక్స్-షోరూమ్). ఇది MT-15 కంటే దాదాపు రూ. 1,400 ఖరీదైనది. కొత్త యమహా MT 15 MotoGP ఎడిషన్ బైక్ కోసం బుకింగ్ ప్రారంభయ్యాయి.

Yamaha నుంచి రానున్న కొత్త స్కూటర్; Aerox 155

Yamaha కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త MT-15 Monster Energy Moto GP Edition బైక్ చూడటానికి చాలా స్టైలిష్ గా ఉంటుంది. ఈ బైక్ లో Monster Energy మరియు Moto GP అనే బ్రాండింగ్‌ను పొందుతుంది. ఈ బైక్ ఇప్పుడు ఏకంగా 10 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. బైక్ యొక్క అల్లాయ్ వీల్స్‌ మంచి పెయింటింగ్ కూడా ఇవ్వబడింది. మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇందులో ఈ పెయింట్ స్కీమ్ కాకుండా మునుపటి పరికరాలు మరియు ప్యానెల్లు చూడవచ్చు. మొత్తానికి ఈ బైక్ చూడగానే ఆకర్షించే విధంగా తయారుచేయబడింది.

Yamaha నుంచి రానున్న కొత్త స్కూటర్; Aerox 155

కొత్త Yamaha MT-15 Monster Energy Moto GP Edition బైక్ కి 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఇవ్వబడ్డాయి. ఈ బైక్ పొడవు 2,020 మిమీ, వెడల్పు 800 మిమీ మరియు ఎత్తు 1,070 మిమీ ఉండగా వీల్‌బేస్ 1,335 మిమీ వరకు ఉంటుంది. ఈ బైక్ మొత్తం బరువు 138 కేజీల వరకు ఉంటుంది. అంతే కాకూండా ఈ బైక్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ 160 మిమీ.

Yamaha నుంచి రానున్న కొత్త స్కూటర్; Aerox 155

MT-15 Monster Energy Moto GP Edition బైక్ లోని ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో Yamaha MT-15 R5 వెర్షన్ 3.0 కి సమానమైన 155 సిసి లిక్విడ్ కూల్డ్, 4 వాల్వ్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ వేరియబుల్ వాల్వ్ యాక్చుయేషన్ (VVA) ఇంజిన్‌ ఉంటుంది. ఈ ఇంజిన్ 10,000 ఆర్‌పిఎమ్ వద్ద 18.2 బిహెచ్‌పి పవర్ మరియు 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 13.9 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.కొత్త MT-15 Monster Energy Moto GP Edition గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Wednesday, August 25, 2021, 13:46 [IST]
English summary
New yamaha 155cc maxi scooter will be launch soon in india details
Read more on: #యమహా #yamaha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+