రైడింగ్‌కి సిద్ధమవ్వండి.. Yamaha నుంచి మరో బైక్ వచ్చేసింది.. చూసారా!!

భారతీయ మార్కెట్లో రోజు రోజుకి కొత్త వాహనాలు విడుదలవుతున్నాయి. ఇవన్నీ కూడా అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటాయి. ఇందులో భాగంగానే ప్రముఖ బైక్ అండ్ స్కూటర్ తయారీదారు Yamaha దేశీయ మార్కెట్లో కొత్త బైక్ విడుదల చేసింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

రైడింగ్‌కి సిద్ధమవ్వండి.. Yamaha నుంచి మరో బైక్ వచ్చేసింది

Yamaha Motor India (యమహా మోటార్ ఇండియా) దేశీయ మార్కెట్లో కొత్త MT-15 Monster Energy Moto GP Edition (ఎంటి-15 మాన్స్టర్ ఎనర్జీ మోటో GP ఎడిషన్‌)ను విడుదల చేసింది. భారతీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త బైక్ ధర రూ. 1,47,900 (ఎక్స్-షోరూమ్). కొత్త MT-15 Monster Energy Moto GP Edition బైక్ లో కంపెనీ కేవలం కాస్మెటిక్ అప్‌డేట్‌లు మాత్రమే చేసింది. అయితే ఈ బైక్‌లో ఎలాంటి సాంకేతిక మార్పులు చేయలేదు. ఈ కొత్త బైక్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

రైడింగ్‌కి సిద్ధమవ్వండి.. Yamaha నుంచి మరో బైక్ వచ్చేసింది

Yamaha కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త MT-15 Monster Energy Moto GP Edition బైక్ చూడటానికి చాలా స్టైలిష్ గా ఉంటుంది. ఈ బైక్ లో Monster Energy మరియు Moto GP అనే బ్రాండింగ్‌ను పొందుతుంది. ఈ బైక్ ఇప్పుడు ఏకంగా 10 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. బైక్ యొక్క అల్లాయ్ వీల్స్‌ మంచి పెయింటింగ్ కూడా ఇవ్వబడింది. మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇందులో ఈ పెయింట్ స్కీమ్ కాకుండా మునుపటి పరికరాలు మరియు ప్యానెల్లు చూడవచ్చు. మొత్తానికి ఈ బైక్ చూడగానే ఆకర్షించే విధంగా తయారుచేయబడింది.

రైడింగ్‌కి సిద్ధమవ్వండి.. Yamaha నుంచి మరో బైక్ వచ్చేసింది

Yamaha యొక్క ఈ కొత్త బైక్ డిజైన్ విషయానికి వస్తే, ఇది దాదాపు దాని MT-09 బైక్ వాటి డిజైన్ కలిగి ఉంటుంది. MT-09 లాగానే, ఈ బైక్ ముందు భాగంలో ఎల్ఈడీ ప్రొజెక్టర్ లైట్స్ ఇవ్వబడ్డాయి. ఈ లైట్స్ బైక్ కి మంచి ఆకర్షణను అందించడంలో సహాయపడతాయి. ఇప్పుడు Yamaha MT-15 వెనుక సీటు కొంత వరకు పెంచబడింది. ఫుట్ పెగ్స్ కొద్దిగా వెనుక భాగంలో ఉంచబడతాయి, తద్వారా రైడర్ కి చాలా అనుకూలంగా ఉంటుంది. ఐతే కాకుండా ఇది లాంగ్ డ్రైవ్ సమయంలో కూడా చాలా సౌకర్యవంతంగా ఉండేలా చేస్తాయి.

రైడింగ్‌కి సిద్ధమవ్వండి.. Yamaha నుంచి మరో బైక్ వచ్చేసింది

Yamaha MT-15 Monster Energy Moto GP Edition బైక్ వెనుక భాగంలో కూడా ఎల్ఈడీ లైట్స్ ఇవ్వబడ్డాయి, కావున బైక్ మంచి స్పోర్టి లుక్ పొందుతుంది. ఇందులోని ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ పూర్తిగా డిజిటల్, కావున ఇందులో గేర్ షిఫ్ట్ ఇండికేటర్, టైమ్, ఫ్యూయల్ గేజ్, ట్రిప్ మీటర్, ఓడోమీటర్, టాకోమీటర్ మరియు స్పీడోమీటర్ వంటి సమాచారాన్ని రైడర్ కి తెలుపుతుంది.

రైడింగ్‌కి సిద్ధమవ్వండి.. Yamaha నుంచి మరో బైక్ వచ్చేసింది

కొత్త Yamaha MT-15 Monster Energy Moto GP Edition బైక్ కి 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఇవ్వబడ్డాయి. ఈ బైక్ పొడవు 2,020 మిమీ, వెడల్పు 800 మిమీ మరియు ఎత్తు 1,070 మిమీ ఉండగా వీల్‌బేస్ 1,335 మిమీ వరకు ఉంటుంది. ఈ బైక్ మొత్తం బరువు 138 కేజీల వరకు ఉంటుంది. అంతే కాకూండా ఈ బైక్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ 160 మిమీ.

రైడింగ్‌కి సిద్ధమవ్వండి.. Yamaha నుంచి మరో బైక్ వచ్చేసింది

కొత్త Yamaha బైక్ అద్భుతమైన బ్రేకింగ్ సిస్టం కలిగి ఉంటుంది. ఈ బైక్ ముందు భాగంలో 282 మిమీ డిస్క్ బ్రేకులు మరియు వెనుకవైపు 200 మిమీ డిస్క్ బ్రేకులు ఉంటాయి. ఇందులో సింగిల్ ఛానల్ ఏబీఎస్ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ బైక్ ముందు భాగంలో, టెలిస్కోపిక్ ఫోర్కులు అప్సైడ్ ఫోర్క్‌ల స్థానంలో ఇవ్వబడ్డాయి, వెనుక భాగంలో మోనో-షాక్ సెటప్ ఉంటుంది. ఇవన్నీ కూడా బైక్ కి మంచి మద్దతు ఇస్తాయి. కావున ఎలాంటి రోడ్డులో అయినా ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటాయి.

MT-15 Monster Energy Moto GP Edition బైక్ లోని ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో Yamaha MT-15 R5 వెర్షన్ 3.0 కి సమానమైన 155 సిసి లిక్విడ్ కూల్డ్, 4 వాల్వ్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ వేరియబుల్ వాల్వ్ యాక్చుయేషన్ (VVA) ఇంజిన్‌ ఉంటుంది. ఈ ఇంజిన్ 10,000 ఆర్‌పిఎమ్ వద్ద 18.2 బిహెచ్‌పి పవర్ మరియు 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 13.9 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

రైడింగ్‌కి సిద్ధమవ్వండి.. Yamaha నుంచి మరో బైక్ వచ్చేసింది

ప్రస్తుతం భారతీయ మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త MT-15 Monster Energy Moto GP Edition ధర రూ. 1,47,900 (ఎక్స్-షోరూమ్). అయితే కంపెనీ దీని స్టాండర్డ్ మోడల్ ని 2019 లోనే రూ. 1.36 లక్షలకు విడుదల చేసింది. తరువాత ధరల పెరుగుదల తరువాత 155 సిసి బైక్స్ అత్యంత ఖరీదైనవిగా మారాయి. అయితే కొత్త Yamaha బైక్ దేశీయ మార్కెట్లో TVS Apache RTR 160 4V మరియు Bajaj Pulsar 150 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

Read more on: #యమహా #yamaha
English summary
Yamaha mt 15 motogp edition launched price features specifications details
Story first published: Tuesday, August 24, 2021, 9:55 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X