ఒక ఛార్జ్‌తో 130 కి.మీ.. డ్రైవింగ్ లైసెన్స్ అవసరమే లేని కొత్త ఒకినవ స్కూటర్

దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు రోజురోజుకి డిమాండ్ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలామంది వాహనతయారీదారులు ఎలక్ట్రిక్ వాహనాలను భారత మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నారు. ఇటీవల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఒకినవ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకినావా డ్యూయల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త స్కూటర్‌ను బి 2 బి కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా మార్కెట్లో ప్రవేశపెట్టారు.

ఒక ఛార్జ్‌తో 130 కి.మీ.. డ్రైవింగ్ లైసెన్స్ అవసరమే లేని ఒకినవ కొత్త స్కూటర్

ఈ ఒకినవ ఎలక్ట్రిక్ స్కూటర్ వ్యక్తిగత ఉపయోగం కోసం కూడా ఉపయోగించవచ్చని కంపెనీ తెలిపింది. ఇందుకోసం కంపెనీ కస్టమైజేషన్ ఆప్షన్లను కూడా ఇందులో అందించింది. భారత మార్కెట్లో విడుదలైన ఈ ఒకినావా డ్యూయల్‌ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర 58,998 రూపాయలు.

ఒక ఛార్జ్‌తో 130 కి.మీ.. డ్రైవింగ్ లైసెన్స్ అవసరమే లేని ఒకినవ కొత్త స్కూటర్

భారత మార్కెట్లో ఈ స్కూటర్ జెమోపాయ్ మిసోతో ప్రత్యేకంగా పోటీ పడబోతోంది. ఈ స్కూటర్ యొక్క ప్రత్యేక లక్షణం ఏమిటంటే ఇది 200 కిలోల వరకు బరువును మోయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కావున లగేజ్ మోయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.

MOST READ:అమెరికా కొత్త ప్రెసిడెంట్ జో బైడెన్ ఉపయోగించే 'దెయ్యం' కారు గురించి తెలుసా?

ఒక ఛార్జ్‌తో 130 కి.మీ.. డ్రైవింగ్ లైసెన్స్ అవసరమే లేని ఒకినవ కొత్త స్కూటర్

ఈ కొత్త ఒకినవ డ్యూయెల్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఫ్రంట్ మరియు రియర్ లోడింగ్ క్యారియర్‌లను కలిగిఉంది. ఇందులో గ్యాస్ సిలిండర్లు, హెవీ హార్డ్‌వేర్ పరికరాలు, వాటర్ క్యాన్లు, కిరాణా, మందులు, కోల్డ్ స్టోరేజ్ మొదలైన వస్తువులను ఈ క్యారియర్‌లపై ఉంచుకుని సులభంగా తీసుకెళ్లవచ్చు.

ఒక ఛార్జ్‌తో 130 కి.మీ.. డ్రైవింగ్ లైసెన్స్ అవసరమే లేని ఒకినవ కొత్త స్కూటర్

దీని కోసం ఒకినవ డెలివరీ బాక్స్‌లు, స్టాక్ చేయగల డబ్బాలు మరియు కోల్డ్ స్టోరేజ్ బాక్స్‌లు వంటి అనేక అదనపు అనుకూలీకరించదగిన యాక్సససరీస్ కూడా అందిస్తోంది. ఒకినావా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని రెండు కలర్ అప్సన్లలో అందిస్తుంది. అవి ఫైర్ రెడ్ మరియు షాన్షైన్ ఎల్లో కలర్స్.

MOST READ:బైక్ మ్యూజియంలో అగ్నికి ఆహుతైన అరుదైన వాహనాలు

ఒక ఛార్జ్‌తో 130 కి.మీ.. డ్రైవింగ్ లైసెన్స్ అవసరమే లేని ఒకినవ కొత్త స్కూటర్

ఒకినవ డ్యూయల్ దాదాపు 70% మెటల్ బాడీని ఉపయోగిస్తుందని అంతే కాకుండా కంపెనీ ఉత్పత్తుల్లో 92 శాతం స్థానికీకరించబడిందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్ 2021 నాటికి ఇది 100% చేరుకోవడమే లక్ష్యమని కూడా కంపెనీ పేర్కొంది.

ఒక ఛార్జ్‌తో 130 కి.మీ.. డ్రైవింగ్ లైసెన్స్ అవసరమే లేని ఒకినవ కొత్త స్కూటర్

ఒకినవ డ్యూయల్ ఎలక్ట్రిక్ స్కూటర్ 250 వాట్ల ఎలక్ట్రిక్ మోటారును ఉపయోగిస్తుంది. ఇది గరిష్టంగా 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కావున వాహనదారులు ఈ స్కూటర్‌ను నడపడానికి ప్రత్యేకంగా డ్రైవింగ్ లైసెన్స్ మరియు ఆర్‌సి వంటివి తీసుకోవాల్సిన అవసరం లేదు.

MOST READ:బువ్వ తిను, బుల్లెట్ బైక్ పట్టుకెళ్లు: రాయల్ ఎన్‌ఫీల్డ్ 'బుల్లెట్' థాలి ఛాలెంజ్

ఒక ఛార్జ్‌తో 130 కి.మీ.. డ్రైవింగ్ లైసెన్స్ అవసరమే లేని ఒకినవ కొత్త స్కూటర్

ఈ స్కూటర్ 48 వాట్ల 55Ah వేరు చేయగలిగిన లిథియం అయాన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీని కేవలం 1.5 గంటల్లో 80 శాతం, 4 నుంచి 5 గంటల్లో 100 శాతం ఛార్జ్ చేసుకోగలదు. ఈ కొత్త ఒకినవ డ్యూయెల్ ఎలక్ట్రిక్ స్కూటర్ బరువు 75 కిలోలు. ఈ స్కూటర్ ఒకే ఛార్జీతో 130 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

ఒక ఛార్జ్‌తో 130 కి.మీ.. డ్రైవింగ్ లైసెన్స్ అవసరమే లేని ఒకినవ కొత్త స్కూటర్

ఒకినవ డ్యూయెల్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ స్కూటర్‌లో రిమోట్ ఫంక్షన్, సైడ్ ఫుట్‌రెస్ట్, ఫ్రంట్ గ్లోవ్ బాక్స్ మరియు ఛార్జింగ్ పోర్ట్ వంటివి ఉన్నాయి. దీనితో పాటు, పుష్-టైప్ పిలియన్ సీట్లను కూడా కలిగి ఉంటుంది. ఈ స్కూటర్లు చూడటానికి చాలా సింపుల్ గా ఉన్నప్పటికీ చాలా ఆకర్షనీయంగా ఉంది. ఇది ప్రధానంగా వస్తువులను డెలివరీ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.

MOST READ:వామ్మో.. ఆరుగురు పర్యాటకులున్న కారుని నోటితో లాగేసిన పులి [వీడియో]

Most Read Articles

English summary
Okinawa Dual Electric Scooter Launched Price Range Features. Read in Telugu.
Story first published: Friday, January 22, 2021, 9:30 [IST]
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X