Ola Electric Scooter అమ్మకాలు రేపటి నుంచే.. కొనుగోలు కోసం లోన్ అందించే బ్యాంకులు & ఆర్థిక సంస్థలు ఇవే
భారతీయ మార్కెట్లో 2021 ఆగష్టు 15 న విడుదలైన Ola Electric Scooter ఇప్పుడు రేపటి నుంచి అంటే 2021 సెప్టెంబర్ 08 నుంచి అమ్మకానికి అందుబాటులో ఉండనుంది. అయితే ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసే కస్టమర్లకు అనుకూలంగా ఉండటం కోసం ఫైనాన్స్ సదుపాయాలను అందించడానికి కొన్ని ప్రముఖ బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు కస్టమర్ల సౌలభ్యం కోసం, ఫైనాన్స్ సదుపాయాలను అందించడానికి HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, కోటక్ మహీంద్రా ప్రైమ్ మరియు టాటా క్యాపిటల్ వంటి వాటితో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసే కస్టమర్లకు ఈ బ్యాంకులు ఫైనాన్స్ సదుపాయాన్ని కల్పిస్తాయి.

పైన తెలిపిన బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలు మాత్రమే కాకుండా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్, HDFC ఫస్ట్ బ్యాంక్, Indusind Bank,, AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, జన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మరియు Yes బ్యాంక్ వంటివి కూడా ఉన్నట్లు, ఓలా ఎలక్ట్రిక్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ Varun Dubey (వరుణ్ దూబే) తెలిపారు.

అంతే కాకుండా, మేము అన్ని ప్రధాన బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నాము. ఇందులో చాలా వరకు సెప్టెంబర్ 8 నుండి అందుబాటులో ఉంటాయి. మిగిలినవి కూడా త్వరలో అందుబాటులో ఉంటాయన్నారు.

కొనుగోలుదారులలో ఫైనాన్సింగ్‌ని ఎంచుకునే వారు ఆప్షన్‌ని పొందగలగాలి. అప్పుడే బ్యాంకుల నుంచి ఫైనాన్స్ సదుపాయాన్ని పొందవచ్చు. ఇందులో ఈఎమ్ఐ కూడా కేవలం రూ. 2,999 నుంచి ప్రారంభమవుతుంది. ఈ అతి తక్కువ ఈఎమ్ఐ ఆప్సన్ కూడా ఎక్కువమంది కొనుగోలుదారులను ఆకర్షించే అవకాశం ఉంటుంది.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ అక్టోబర్ నెల నుండి ప్రారంభమవుతుంది కంపెనీ తెలిపింది. అంతే కాకుండా కంపెనీ ఇదివరకు చెప్పిన డోర్ డెలివరీ విధానాన్ని అనుసరిస్తుంది. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా 1,000 నగరాలు మరియు పట్టణాలకు తన ఎలక్ట్రిక్ స్కూటర్లను డోర్ డెలివరీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. దీన్ని బట్టి చూస్తే డెలివరీలు చాలా వేగంగా జరిగే అవకాశం ఉంది.

దేశీయ మార్కెట్లో విడుదలైన Ola ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు వరుసగా రూ. 99,999 (S1 వేరియంట్) మరియు రూ. 1,29,999 (S1 Pro వేరియంట్). ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల ప్రీ-లాంచ్ బుకింగ్‌లు జూలైలోనే ప్రారంభమయ్యాయి. ఓలా యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ముందుగా బుక్ చేసుకున్న కస్టమర్‌లు ఇప్పుడు బ్యాలెన్స్ మొత్తాన్ని చెల్లించి మరియు స్కూటర్ యొక్క కలర్ మరియు వేరియంట్‌ను ఫిక్స్ చేసిన తరువాత డెలివరీ పొందవచ్చు.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ లేటెస్ట్ ఫీచర్స్ మరియు పరికరాలతో నింది ఉంటుంది. అంతే కాకుండా ఇది మంచి మైలేజ్ అందిస్తూ వాహనవినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా ఈ స్కూటర్ కేవలం 3 సెకన్లలో గంటకు 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. దీని గరిష్ట వేగం గంటకు 115 కిలోమీటర్లు.

ఓలా కంపెనీ అందించిన సమాచారం Ola S1 స్కూటర్ టెస్ట్ రైడ్ అక్టోబర్ నుండి ప్రారంభం కానుంది, వినియోగదారులు స్కూటర్ టెస్ట్ రైడ్ చేసిన తరువాత కూడా నచ్చకపోతే వారి బుకింగ్‌ని రద్దు చేసే సదుపాయం అందుబాటులో ఉంటుంది. అయితే కంపెనీ ఇంకా దాని టెస్ట్ రైడ్ ఎలా నిర్వహించబడుతుందో అధికారికంగా వెల్లడించలేదు, త్వరలో వెల్లడవుతుంది.

అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ (Ola Electric Scooter) ఇప్పుడు దేశీయ మార్కెట్లో మాత్రమే కాకుండా విదేశీ మార్కెట్లో కూడా అడుగుపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ Ola Electric Scooter ఎగుమతి 2022 నుంచి ఎగుమతి చేయబడతాయని తెలిపారు. దీన్ని బట్టి చూస్తే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఖండాంతరాలు దాటడానికి సిద్ధంగా ఉంది.


Click it and Unblock the Notifications








