Ola S1 Pro ఇక కొత్త కలర్ ఆప్షన్‌లో కూడా.. వివరాలు

అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీదారు ఓలా (Ola) యొక్క ఎస్1 మరియు ఎస్1 ప్రో స్కూటర్లు ఆశించిన స్థాయి కంటే కూడా ఎక్కువ ఫలితాలను పొందుతున్నాయి. ఈ స్కూటర్ కోసం దేశీయ మార్కెట్లో పెద్ద ఎత్తున బుకింగ్స్ జరిగాయి. అయితే ప్రస్తుతం ఈ ఎలెక్ట్రిక్ స్కూటర్స్ యొక్క టెస్ట్ రైడ్ ప్రారంభమైంది, కానీ డెలివరీలు ఇంకా జరగలేదు, త్వరలో డెలివరీలు జరుగుతాయని కంపెనీ ఇప్పటికే తెలిపింది.

Ola S1 Pro ఇక కొత్త కలర్ ఆప్షన్‌లో కూడా.. వివరాలు

ఇదిలా ఉండగా కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను కస్టమర్ కి ఇష్టమైన రంగులో అందించటానికితగిన సన్నాహాలు సిద్ధం చేస్తున్నట్లు సీఈఓ భవిష్ అగర్వాల్ తెలిపారు. అయితే ఈ కస్టమైజ్డ్ కలర్ స్కూటర్లు ఎప్పుడు వివలవుతాయి అనే దాని పైన స్పష్టమైన సమాచారం అందుబాటులో లేదు.

Ola S1 Pro ఇక కొత్త కలర్ ఆప్షన్‌లో కూడా.. వివరాలు

ఓలా ఎలక్ట్రిక్ 2021 ఆగష్టు 15 న ఓలా ఎస్1 మరియు ఓలా ఎస్1 ప్రో అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. ఇందులో, Ola S1 యొక్క ఎక్స్-షోరూమ్ ధర రూ. 99,999 కాగా, Ola S1 ప్రో ధర రూ. 1,29,999 (ఎక్స్-షోరూమ్). కంపెనీ ఇటీవల భారతదేశంలోని నెదర్లాండ్స్ ఎంబసీకి మొత్తం 9 Ola S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌లను డెలివరీ చేయనున్నట్లు ఇటీవల కంపెనీ ప్రకటించింది. ఈ స్కూటర్లు 'డచ్ ఆరంజ్' అనే ప్రత్యేకమైన కలర్ లో ఉంటాయి. అయితే కంపెనీ ఈ కలర్ స్కూటర్లను కస్టమర్లు కోరుకుంటే వారికి కూడా అందించటానికి సిద్దమవుతున్నట్లు సమాచారం.

Ola S1 Pro ఇక కొత్త కలర్ ఆప్షన్‌లో కూడా.. వివరాలు

Ola S1 మరియు Ola S1 ప్రో యొక్క కస్టమర్ డెలివరీలు రాబోయే వారాల్లో ప్రారంభమవుతాయని ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీదారు ఓలా ఎలక్ట్రిక్ ధృవీకరించింది. అయితే, డెలివరీకి సంబందించిన ఒక అధికారిక తేదీని మాత్రం కంపెనీ వెల్లడించలేదు. కావున డెలివరీలు ఎప్పుడు జరుగుతాయి అనే విషయంపై స్పష్టమైన విషయం తెలియరాలేదు.

Ola S1 Pro ఇక కొత్త కలర్ ఆప్షన్‌లో కూడా.. వివరాలు

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ లో సింపుల్‌గా కనిపించే ఫ్రంట్ ఆప్రాన్‌ మధ్యలో OLA బ్యాడ్జ్‌తో చూడవచ్చు. స్కూటర్ ముందు భాగంలో ఉన్న ఏకైక ఫీచర్ హెడ్‌ల్యాంప్స్ క్లస్టర్, ఇందులో ఎల్ఈడీ డిఆర్ఎల్ ల చుట్టూ ట్విన్-పాడ్ ఎల్ఈడీ సెటప్ ఉంటుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లో క్షితిజ సమాంతరంగా అమర్చిన ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌లు, ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్స్, రియర్ ఫుట్-రెస్ట్ మరియు కాంటూర్డ్ సీట్లు ఉన్నాయి.

Ola S1 Pro ఇక కొత్త కలర్ ఆప్షన్‌లో కూడా.. వివరాలు

అంతే కాకూండా ఇందులో అల్లాయ్ వీల్స్, 36-లీటర్ అండర్-సీట్ స్టోరేజ్, రియర్ గ్రాబ్ రైల్స్, ఫ్రంట్ స్టోరేజ్ పాకెట్స్, లగేజ్ హుక్ మరియు రబ్బర్-లైన్డ్ ఫ్రంట్ ఫుట్‌వెల్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క కొలతల విషయానికి వస్తే, ఇది 1860 మిమీ పొడవు, 700 మిమీ వెడల్పు, 1155 మిమీ ఎత్తు, 1345 మిమీ వీల్‌బేస్ మరియు 74 కిలోల బరువు ఉంటుంది.

Ola S1 Pro ఇక కొత్త కలర్ ఆప్షన్‌లో కూడా.. వివరాలు

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు వేర్వేరు డ్రైవింగ్ మోడ్‌లను కలిగి ఉంటుంది. అవి నార్మల్, స్పోర్ట్ మరియు హైపర్ మోడ్స్. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అద్భుతమైన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండటం మాత్రమే కాకుండా, మంచి పనితీరుని కూడా అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 10 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది.

Ola S1 Pro ఇక కొత్త కలర్ ఆప్షన్‌లో కూడా.. వివరాలు

ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు కస్టమర్ల సౌలభ్యం కోసం, ఫైనాన్స్ సదుపాయాలను అందించడానికి HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, కోటక్ మహీంద్రా ప్రైమ్ మరియు టాటా క్యాపిటల్‌ వంటి వాటితో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసే కస్టమర్లకు ఈ బ్యాంకులు ఫైనాన్స్ సదుపాయాన్ని కల్పిస్తాయి. కావున ఇది కొనుగోలుదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

Ola S1 Pro ఇక కొత్త కలర్ ఆప్షన్‌లో కూడా.. వివరాలు

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ 3.9 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది. దీని ఎలక్ట్రిక్ మోటార్ 8.5 kW గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీని 750W సామర్థ్యం గల పోర్టబుల్ ఛార్జర్‌తో దాదాపు 6:30 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఇది కాకుండా, ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 18 నిమిషాల్లో 75% వరకు ఛార్జ్ చేయబడుతుంది.

Ola S1 Pro ఇక కొత్త కలర్ ఆప్షన్‌లో కూడా.. వివరాలు

ఓలా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అనేక కొత్త మరియు ఆధునిక ఫీచర్లను అందించింది. Ola S1 పూర్తి ఛార్జ్‌పై 121 కిమీల రేంజ్‌ను అందిస్తుంది, అయితే హై ఎండ్ వేరియంట్ S1 ప్రో 181 కిమీల పరిధిని కలిగి ఉంది. రెండు స్కూటర్ల టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే, Ola S1 గరిష్టంగా 90 km/h వేగంతో, Ola S1 Pro గరిష్టంగా 115 km/h వేగంతో రైడ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Monday, November 22, 2021, 10:26 [IST]
English summary
Ola electric plans to deliver s1 pro scooter with custom colour option details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+