ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఏ కలర్‌లో కావాలో మీరే చెప్పండి; భవిష్ అగర్వాల్

ప్రముఖ క్యాబ్ సర్వీస్ కంపెనీ ఓలా, ఇండియన్ మార్కెట్లో తన ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేయడానికి తగిన అన్ని సన్నాహాలను సిద్ధం చేస్తోందన్న సంగతి తెలిసిందే. అయితే ఈ స్కూటర్ దేశీయ మార్కెట్లో విడుదల చేయడానికి ముందే కంపెనీ బుకింగ్స్ ప్రారంభించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయదలచిన కస్టమర్లు కేవలం 499 రూపాయలకు కంపెనీ యొక్క అధికారిక వెబ్ సైట్ లో బుక్ చేసుకోవచ్చు.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఏ కలర్‌లో కావాలో మీరే చెప్పండి; భవిష్ అగర్వాల్

కంపెనీ విడుదల చేయనున్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ధరను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఇంతకు ముందు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను టెస్ట్ చేసే సమయంలో మూడు కలర్ ఆప్సన్స్ లో గుర్తించబడ్డాయి. ఇందులో పింక్ మరియు బ్లాక్ కాకుండా, బ్లూ కలర్ స్కూటర్స్ గుర్తించబడ్డాయి.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఏ కలర్‌లో కావాలో మీరే చెప్పండి; భవిష్ అగర్వాల్

ఈ మూడు కలర్ ఆప్సన్స్ లో మాత్రమే కాకుండా కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇతర కలర్ ఆప్షన్లలో కూడా అందించే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీని కారణంగానే ఓలా ఎలక్ట్రిక్ యొక్క ఛైర్మన్ మరియు సిఇఒ భవీష్ అగర్వాల్ ఎలక్ట్రిక్ స్కూటర్ కలర్స్ పై ప్రజల అభిప్రాయాన్ని కోరింది.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఏ కలర్‌లో కావాలో మీరే చెప్పండి; భవిష్ అగర్వాల్

దీని కోసం భవిష్ అగర్వాల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ట్విట్టర్ సహాయం తీసుకున్నారు, ఇందులో పోలింగ్ ట్వీట్ ద్వారా కొన్ని కలర్ ఆప్సన్స్ పై ప్రజల అభిప్రాయాన్ని కోరింది. ఈ రోజు ఎలక్ట్రిక్ స్కూటర్లు యొక్క కలర్స్ ఖరారు చేయబడుతున్నాయి. మీరు ఏ కలర్ ఇష్టపడతారు" అని ఆయన ట్వీట్ చేశారు.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఏ కలర్‌లో కావాలో మీరే చెప్పండి; భవిష్ అగర్వాల్

దీని తరువాత, వారు మూడు కేటగిరీలలో మొత్తం తొమ్మిది కలర్స్ ఉంచారు. ఇందులో మొదటిది పాస్టెల్ విభాగంలో రెడ్, ఎల్లో మరియు బ్లూ కలర్స్ ఉన్నాయి. ఇక రెండవ విభాగం మెటాలిక్, ఇందులో సిల్వర్, గోల్డ్ మరియు పింక్ కలర్స్ ఉన్నాయి. ఇక చివరిది మూడవ విభాగం మాట్టే, ఇందులో బ్లాక్, బ్లూ అండ్ గ్రే కలర్స్ ఉన్నాయి.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఏ కలర్‌లో కావాలో మీరే చెప్పండి; భవిష్ అగర్వాల్

ఇది మాత్రమే కాకూండా, భవీష్ అగర్వాల్ నాల్గవ ఎంపికను కూడా ఇచ్చారు, తద్వారా కస్టమర్లు ఈ రంగులన్నింటినీ ఎంచుకోవచ్చు. జూలై 15 న ఓలా ఎలక్ట్రిక్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్ ప్రారంభించింది. బుకింగ్స్ ఓపెన్ చేసిన కేవలం 24 గంటల్లో ఏకంగా 1 లక్షకు పైగా ఈ స్కూటర్ కి బుకింగ్స్ వచ్చాయని కంపెనీ సమాచారాన్ని అందించింది.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఏ కలర్‌లో కావాలో మీరే చెప్పండి; భవిష్ అగర్వాల్

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క వేరియంట్‌లకు సంబంధించిన సమాచారం కూడా ఇటీవల లీక్ అయింది. కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్లకు రెండు పేర్లను ట్రేడ్ మార్క్ చేసింది, వీటిలో ఎస్ 1 మరియు ఎస్ 1 ప్రో ఉన్నాయి. ఈ రెండు వేరియంట్లలో ఓలా ఎలక్ట్రిక్ లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఏ కలర్‌లో కావాలో మీరే చెప్పండి; భవిష్ అగర్వాల్

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక పూర్తి ఛార్జీతో దాదాపు 150 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఈ స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 90 కిమీ వరకు ఉంటుంది. ఈ స్పెసిఫికేషన్‌తో, ఇది హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో విస్తృత శ్రేణిలో చేరనుంది. స్కూటర్‌ను పూర్తిగా ఛార్జ్ చేయడానికి 2 గంటల నుంచి 2.5 గంటలు సమయం పడుతుది.

Most Read Articles

English summary
Bhavish Aggarwal Ola Electric Color Option Polling Tweet. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X