దూసుకెళ్తున్న ఓలా ఎలక్ట్రిక్స్ స్కూటర్ బుకింగ్స్; కేవలం 24 గంటల్లో లక్ష
భారతీయ మార్కెట్లో ఓలా కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేయడానికి తగిన అన్ని సన్నాహాలను సిద్ధం చేస్తోందన్న సంగతి తెలిసిందే. అయితే ఈ స్కూటర్ దేశీయ మార్కెట్లో విడుదల చేయడానికి ముందే కంపెనీ బుకింగ్స్ ప్రారంభించింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఓలా కంపెనీ సిఈఓ భవిష్ అగర్వాల్ అధికారికంగా విడుదల చేశారు.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ యొక్క బుకింగ్స్ జూలై 15 నుండి కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో బుకింగ్ కోసం అందుబాటులో ఉంచబడింది. బుకింగ్స్ ఓపెన్ చేసిన కేవలం 24 గంటల్లోనే 1 లక్షకు పైగా స్కూటర్లు బుక్ చేసుకున్నట్లు కంపెనీ తాజా నివేదిక ద్వారా తెలిపింది. అయితే ఒక్కసారికా భారీగా బుకింగ్స్ జరగడం వల్ల వెబ్‌సైట్ హెవీ ట్రాఫిక్ ఎదుర్కోవలసి వచ్చింది. ఈ కారణంగా కంపెనీ వెబ్‌సైట్ క్రాష్ అయ్యింది. అయితే దీనిని కంపెనీ కొన్ని నిమిషాల్లో పరిష్కరించింది.

ఓలా చైర్మన్ మరియు గ్రూప్ సిఇఒ భవీష్ అగర్వాల్ మాట్లాడుతూ, భారతదేశం అంతటా కస్టమర్ల నుండి అధిక స్పందన లభించడం పట్ల చాలా ఆనందంగా మరియు ఆశ్చర్యంగా ఉంది. దేశీయ మార్కెట్లో స్కూటర్లపై కస్టమర్లకు ఉన్న ఆసక్తి ఏవిధంగా ఉందొ తెలుస్తుంది. ప్రపంచాన్ని ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లించడానికి మేము తగిన ప్రయతలు చేస్తున్నాము. ఇది కేవలం ప్రారంభం మాత్రమే అన్నారు.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కంపెనీ ఈ నెల చివరలో లేదా వచ్చే నెల ప్రారంభంలో విడుదల చేసే అవకాశం ఉంది. ఇటీవల కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, ఓలా స్కూటర్ ఎస్, ఎస్ 1 మరియు ఎస్ 1 ప్రో అనే వేరియంట్లలో తీసుకు వచ్చే అవకాశం ఉండాలి తెలుస్తుంది. అయితే కంపెనీ దీని గురించి అధికారిక సమాచారం వెల్లడించలేదు.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక పూర్తి ఛార్జీతో 100 నుంచి 150 కిలోమీటర్ల పరిధిని ఇవ్వగలదు. అదే సమయంలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 90 కిమీ వరకు ఉంటుంది. ఈ స్పెసిఫికేషన్‌తో, ఇది హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో చేరే అవకాశం కూడా ఉంది.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ హోమ్ ఛార్జర్‌తో వస్తుంది, దానిని స్టాండర్డ్ వాల్ సాకెట్‌లోకి ప్లగ్ చేయడం ద్వారా ఛార్జ్ చేయవచ్చు. స్కూటర్‌ను పూర్తిగా ఛార్జ్ చేయడానికి 2 నుంచి 2.5 గంటల సమయం పడుతుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ దేశీయ మార్కెట్లో ఏథర్ 450 ఎక్స్‌కి ప్రత్యర్థిగా ఉంటుంది. అంతే కాకుండా ఇది మార్కెట్లో బజాజ్ చేతక్ మరియు టివిఎస్ ఐక్యూబ్ వాటి వాటికీ కూడా ప్రత్యర్థిగా వుంటుది.

ఓలా యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అనేక హైటెక్ ఫీచర్లు ఉంటాయి. ఈ స్కూటర్‌లో డ్యూయల్ పాడ్ ఎల్‌ఇడి హెడ్‌లైట్, కలర్ ఎల్‌సిడి డిస్‌ప్లే, క్లౌడ్ కనెక్టివిటీ, నావిగేషన్ టెక్నాలజీ, రిమూవబుల్ లిథియం అయాన్ బ్యాటరీ, టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్, అల్లాయ్ వీల్స్ వంటివి ఉంటాయి.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల ఉత్పత్తి త్వరలో ప్రారంభం కానున్న తమిళనాడు ప్లాంట్ లో జరగనుంది. ఇక్కడ కంపెనీ నిర్మిస్తున్న ప్లాంట్ ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ కేంద్రం కానుంది. ఇక్కడ ప్రారంభ దశలో సంవత్సరానికి 20 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేయబడతాయి. అంతే కాకుండా ఒక్కడా కార్యకలాపాలు పూర్తిగా ప్రారంభమైన తర్వాత, ఈ ప్లాంట్ కి ప్రతి సంవత్సరం 10 మిలియన్ వాహనాలను తయారు చేసే సామర్థ్యం ఉంటుంది.

మేడ్-ఇన్-ఇండియా స్కూటర్లు భారతదేశంలో మాత్రమే కాకుండా యూరప్, యుకె, లాటిన్ అమెరికా, ఆసియా పసిఫిక్, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ వంటి దేశాలకు కూడా ఎగుమతి చేయబడతాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఈ స్కూటర్ లాంచ్ అయ్యే సమయంలో ఈ స్కూటర్ ధర వెల్లడయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ స్కూటర్ కి మార్కెట్లో ఉన్న డిమాండ్ చూస్తే భారీ అమ్మకాలతో ప్రభంజనం సృష్టిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








