ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న Ola ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు.. మొదట ఎవరికంటే?

భారతీయ మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్లను బుక్ చేసుకున్న కస్టమర్లందరూ కూడా డెలివెరీల కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే కంపెనీ ఎట్టకేలకు తన ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీలను ఈ రోజు (డిసెంబర్ 15) నుంచి ప్రారంభించనుంది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

రైడింగ్‌కి సిద్దమవ్వండి.. Ola ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోంది

ఓలా ఎలక్ట్రిక్ తమ మొదటి కస్టమర్‌లకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను డెలివరీ చేయడానికి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. నిజానికి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. మొత్తానికి ఈ రోజు డెలివరీలు ప్రారంభమయ్యాయి.

రైడింగ్‌కి సిద్దమవ్వండి.. Ola ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోంది

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క మొదటి డెలివరీని పొందబోతున్న వారికి మరియు మొదటి డెలివరీని పొందడానికి ఎంపిక చేసిన వ్యక్తులలో మీరు ఎంపికైనట్లు కంపెనీ ఈ-మెయిల్ ద్వారా తెలియజేసింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దీనికోసం ఒక ప్రత్యేక డెలివరీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

రైడింగ్‌కి సిద్దమవ్వండి.. Ola ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోంది

కంపెనీ ఇటీవల కాలంలో తమ మొదటి స్కూటర్ల యొక్క డెలివరీలను ప్రారంభం చేయడానికి ఉట్పపతిని కూడా చాలా వేగంగా జరుపుతోంది. దీనికి సంబంధించిన ఈ వీడియో కూడా ఇటీవల కాలంలో వెలువడింది. కంపెనీ ఇప్పటికే డెలివరీ టైమ్‌లైన్ గురించి కూడా తెలిపింది. ఓలా ఎలక్ట్రిక్ ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటల నుంచి దేశంలోని పలు ప్రధాన నగరాల్లో డెలివరీని కంపెనీ ప్రారంభించబోతోంది.

రైడింగ్‌కి సిద్దమవ్వండి.. Ola ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోంది

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు మొదట్లో దాదాపు 5,500 ఆర్డర్లు వచ్చినట్లు కంపెనీ నివేదించింది. కానీ ఈ సంఖ్య ఇప్పుడు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. మొత్తానికి కంపెనీ మొదటిసారి ఎన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లను డెలివరీ చేస్తుందో వేచి చూడాలి.

రైడింగ్‌కి సిద్దమవ్వండి.. Ola ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోంది

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఓలా ఎలక్ట్రిక్ యొక్క Ola S1 స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 99,999 కాగా, Ola S1 ప్రో ధర రూ. 1,29,999 (ఎక్స్-షోరూమ్).

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ సింపుల్‌ డిజైన్ కలిగి ఉంటుంది. ఈ బైక్ ఫ్రంట్ ఆప్రాన్‌ మధ్యలో OLA బ్యాడ్జ్‌తో చూడవచ్చు. స్కూటర్ ముందు భాగంలో ఉన్న ఏకైక ఫీచర్ హెడ్‌ల్యాంప్స్ క్లస్టర్, ఇందులో ఎల్ఈడీ డిఆర్ఎల్ ల చుట్టూ ట్విన్-పాడ్ ఎల్ఈడీ సెటప్ ఉంటుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లో క్షితిజ సమాంతరంగా అమర్చిన ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌లు, ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్స్, రియర్ ఫుట్-రెస్ట్ మరియు కాంటూర్డ్ సీట్లు ఉన్నాయి.

రైడింగ్‌కి సిద్దమవ్వండి.. Ola ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోంది

అంతే కాకూండా ఇందులో అల్లాయ్ వీల్స్, 36-లీటర్ అండర్-సీట్ స్టోరేజ్, రియర్ గ్రాబ్ రైల్స్, ఫ్రంట్ స్టోరేజ్ పాకెట్స్, లగేజ్ హుక్ మరియు రబ్బర్-లైన్డ్ ఫ్రంట్ ఫుట్‌వెల్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క కొలతల విషయానికి వస్తే, ఇది 1860 మిమీ పొడవు, 700 మిమీ వెడల్పు, 1155 మిమీ ఎత్తు, 1345 మిమీ వీల్‌బేస్ మరియు 74 కిలోల బరువు ఉంటుంది.

రైడింగ్‌కి సిద్దమవ్వండి.. Ola ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోంది

కంపెనీ తన స్కూటర్ డెలివరీ టైమ్‌లైన్‌ను ఇప్పటికే చాలా సార్లు వాయిదా వేసింది. దీని కారణంగా చాలా మంది కస్టమర్‌లు తమ అసహనం వ్యక్తం చేశారు. కావున ఇప్పుడు కస్టమర్‌లకు కంపెనీపై నమ్మకం కొంత తగ్గింది. కానీ ప్రస్తుతం డెలివరీలు ప్రారంభమైన కారణంగా కస్టమర్‌లకు కొంత నమ్మకం కలిగింది.

రైడింగ్‌కి సిద్దమవ్వండి.. Ola ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోంది

కంపెనీ ఇంకా ఆర్డర్ లేదా వెయిటింగ్ పీరియడ్‌కు సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు, కానీ ప్రస్తుతం దేశీయ మార్కెట్లో కొనసాగుతున్న సెమికండక్టర్ చిప్ కొరత కారణంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల ఉత్పత్తి కొంత ఆలస్యం అవుతుంది. కావున బుకింగ్స్ కూడా చాలా ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది.

రైడింగ్‌కి సిద్దమవ్వండి.. Ola ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోంది

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు వేర్వేరు డ్రైవింగ్ మోడ్‌లను కలిగి ఉంటుంది. అవి నార్మల్, స్పోర్ట్ మరియు హైపర్ మోడ్స్. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అద్భుతమైన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండటం మాత్రమే కాకుండా, మంచి పనితీరుని కూడా అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 10 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది.

రైడింగ్‌కి సిద్దమవ్వండి.. Ola ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోంది

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ 3.9 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది. దీని ఎలక్ట్రిక్ మోటార్ 8.5 kW గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీని 750W సామర్థ్యం గల పోర్టబుల్ ఛార్జర్‌తో దాదాపు 6:30 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఇది కాకుండా, ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 18 నిమిషాల్లో 75% వరకు ఛార్జ్ చేయబడుతుంది.

ఓలా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అనేక కొత్త మరియు ఆధునిక ఫీచర్లను అందించింది. Ola S1 పూర్తి ఛార్జ్‌పై 121 కిమీల రేంజ్‌ను అందిస్తుంది, అయితే హై ఎండ్ వేరియంట్ S1 ప్రో 181 కిమీల పరిధిని కలిగి ఉంది. ఈ రెండు స్కూటర్ల టాప్ స్పీడ్ విషయానికి వస్తే, Ola S1 గరిష్టంగా 90 km/h వేగంతో, Ola S1 Pro గరిష్టంగా 115 km/h వేగంతో రైడ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, December 15, 2021, 13:11 [IST]
English summary
Ola electric scooter delivery starts today details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+