ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ డేట్ ఫిక్స్ చేసిన Ola.. ఎప్పుడో తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి

భారతీయ మార్కెట్లో అడుగుపెట్టిన రోజు నుంచి కూడా ఎంతోమంది వాహన ప్రియులు ఎప్పుడెప్పుడు రైడ్ చేద్దామా.. అని ఎదురు చూస్తున్న ఆధునిక ఎలక్ట్రిక్ స్కూటర్ ఓలా (Ola). ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 2021 ఆగష్టు 15 న అధికారికంగా విడుదలైంది. ఈ స్కూటర్ అతి తక్కువా కాలంలోనే ఊహకందని రీతిలో బుకింగ్స్ పొందింది. అయితే దెలియరీలు మాత్రం ఇంకా ఏ మాత్రం జరగడం లేదు. అయితే డెలివరీలకు సంబంధించిన సమాచారం కంపెనీ ఇటీవల అధికారికంగా తెలిపింది. దీని గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ డేట్ ఫిక్స్ చేసిన Ola.. ఎప్పుడో తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి

నివేదికల ప్రకారం ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు 2021 డిసెంబర్ 15 నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. బుకింగ్స్ చేసుకున్న కస్టమర్లకు ఇప్పటికే దీనికి సంబంధించిన సమాచారం అందింది. కావున డెలివరీలు ఇంక ఏ మాత్రం ఆలస్యమయ్యే అవకాశం లేదు.

ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ డేట్ ఫిక్స్ చేసిన Ola.. ఎప్పుడో తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి

బుక్ చేసుకున్న కస్టమర్లకు తమ ఎలక్ట్రిక్ స్కూటర్లను అందించడానికి కంపెనీ పూర్తి స్థాయిలో ప్రొడక్షన్ కూడా ప్రారంభించింది. మీరు ఇక్కడ కంపెనీ తయారు చేసిన లెక్కకు మించిన స్కూటర్లను చూడవచ్చు. కావున త్వరలో కస్టమర్ల చెంతకు చేరుతాయి. ఎప్పుడెప్పుడా అనుకుంటున్న కస్టమర్ల కల నెరవేరుతుంది.

ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ డేట్ ఫిక్స్ చేసిన Ola.. ఎప్పుడో తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి

బుక్ చేసుకున్న కస్టమర్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి పూర్తి సమాచారం ఎప్పటికప్పుడు పొందుతూ ఉండవచ్చు. దీనిని కంపెనీ యొక్క అధికారిక వెబ్సైట్ లో చూడవచ్చు. దీన్ని బట్టి చూస్తే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ నుంచి బయటకు వచ్చినట్లు తెలిసింది. బుక్ చేసుకున్న వినియోగదారులు డెలివరీలను 2021 డిసెంబర్ 15 నుండి 2021 డిసెంబర్ 31 వరకు పొందే అవకాశం ఉంటుంది.

ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ డేట్ ఫిక్స్ చేసిన Ola.. ఎప్పుడో తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి

ఓలా ఎలక్ట్రిక్ తన విక్రయాలను ప్రారంభించిన కేవలం 2 రోజుల్లో ఏకంగా రూ. 1,100 కోట్లకు పైగా విలువైన విక్రయాలను పూర్తి చేసింది. ఈ స్కూటర్ బుకింగ్ ధర కేవలం రూ. 499 మాత్రమే. ప్రస్తుతం భారతీయ మార్కెట్లో సెమీకండక్టర్ చిప్ కొరత కారణంగా, ఇప్పుడు ఉత్పత్తి కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది, కావున ఇప్పుడు బుక్ చేసుకునే వారికి డెలివరీలు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది.

ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ డేట్ ఫిక్స్ చేసిన Ola.. ఎప్పుడో తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి

ఓలా తన ఎలక్ట్రిక్ స్కూటర్ల టెస్ట్ రైడింగ్‌ను 2021 నవంబర్ 20 నుండి ప్రారంభించింది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ముందుగా బుక్ చేసుకున్న వినియోగదారులకు మాత్రమే టెస్ట్ రైడ్‌ అవకాశం కల్పిస్తుంది. కంపెనీ ఇటీవల 20,000 మంది కస్టమర్లకు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క టెస్ట్ రైడ్‌లను అందించింది. అయితే కంపెనీ ప్రణాళిక ప్రకారం ఇప్పుడు ఈ నెల నుండి 1,000 నగరాల్లో రోజుకు 10,000 టెస్ట్ రైడ్‌లను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాబోయే రోజుల్లో మరిన్ని టెస్ట్ రైడ్‌లు అందుబాటులోకి రానున్నాయి.

ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ డేట్ ఫిక్స్ చేసిన Ola.. ఎప్పుడో తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి

ఓలా ఎలక్ట్రిక్ యొక్క Ola S1 స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 99,999 కాగా, Ola S1 ప్రో ధర రూ. 1,29,999 (ఎక్స్-షోరూమ్). ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ సింపుల్‌ డిజైన్ కలిగి ఉంటుంది. ఈ బైక్ ఫ్రంట్ ఆప్రాన్‌ మధ్యలో OLA బ్యాడ్జ్‌తో చూడవచ్చు. స్కూటర్ ముందు భాగంలో ఉన్న ఏకైక ఫీచర్ హెడ్‌ల్యాంప్స్ క్లస్టర్, ఇందులో ఎల్ఈడీ డిఆర్ఎల్ ల చుట్టూ ట్విన్-పాడ్ ఎల్ఈడీ సెటప్ ఉంటుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లో క్షితిజ సమాంతరంగా అమర్చిన ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌లు, ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్స్, రియర్ ఫుట్-రెస్ట్ మరియు కాంటూర్డ్ సీట్లు ఉన్నాయి.

ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ డేట్ ఫిక్స్ చేసిన Ola.. ఎప్పుడో తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి

అంతే కాకూండా ఇందులో అల్లాయ్ వీల్స్, 36-లీటర్ అండర్-సీట్ స్టోరేజ్, రియర్ గ్రాబ్ రైల్స్, ఫ్రంట్ స్టోరేజ్ పాకెట్స్, లగేజ్ హుక్ మరియు రబ్బర్-లైన్డ్ ఫ్రంట్ ఫుట్‌వెల్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క కొలతల విషయానికి వస్తే, ఇది 1860 మిమీ పొడవు, 700 మిమీ వెడల్పు, 1155 మిమీ ఎత్తు, 1345 మిమీ వీల్‌బేస్ మరియు 74 కిలోల బరువు ఉంటుంది.

ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ డేట్ ఫిక్స్ చేసిన Ola.. ఎప్పుడో తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు వేర్వేరు డ్రైవింగ్ మోడ్‌లను కలిగి ఉంటుంది. అవి నార్మల్, స్పోర్ట్ మరియు హైపర్ మోడ్స్. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అద్భుతమైన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండటం మాత్రమే కాకుండా, మంచి పనితీరుని కూడా అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 10 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది.

ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ డేట్ ఫిక్స్ చేసిన Ola.. ఎప్పుడో తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి

ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు కస్టమర్ల సౌలభ్యం కోసం, ఫైనాన్స్ సదుపాయాలను అందించడానికి HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, కోటక్ మహీంద్రా ప్రైమ్ మరియు టాటా క్యాపిటల్‌ వంటి వాటితో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసే కస్టమర్లకు ఈ బ్యాంకులు ఫైనాన్స్ సదుపాయాన్ని కల్పిస్తాయి. కావున ఇది కొనుగోలుదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ డేట్ ఫిక్స్ చేసిన Ola.. ఎప్పుడో తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ 3.9 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది. దీని ఎలక్ట్రిక్ మోటార్ 8.5 kW గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీని 750W సామర్థ్యం గల పోర్టబుల్ ఛార్జర్‌తో దాదాపు 6:30 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఇది కాకుండా, ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 18 నిమిషాల్లో 75% వరకు ఛార్జ్ చేయబడుతుంది.

ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ డేట్ ఫిక్స్ చేసిన Ola.. ఎప్పుడో తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి

ఓలా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అనేక కొత్త మరియు ఆధునిక ఫీచర్లను అందించింది. Ola S1 పూర్తి ఛార్జ్‌పై 121 కిమీల రేంజ్‌ను అందిస్తుంది, అయితే హై ఎండ్ వేరియంట్ S1 ప్రో 181 కిమీల పరిధిని కలిగి ఉంది. ఈ రెండు స్కూటర్ల టాప్ స్పీడ్ విషయానికి వస్తే, Ola S1 గరిష్టంగా 90 km/h వేగంతో, Ola S1 Pro గరిష్టంగా 115 km/h వేగంతో రైడ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, December 14, 2021, 9:42 [IST]
English summary
Ola electric scooter delivery to start from 15th december details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+