బ్రేకింగ్ న్యూస్.. ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ తెలిపే వీడియో రిలీజ్ చేసిన ఓలా

ఓలా కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ని భారతీయ మార్కెట్లో రేపు అనగా ఆగష్టు 15 భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అధికారికంగా ఇడుదల చేయనున్నట్లు కంపెనీ సీఈఓ 'భవిష్ అగర్వాల్' తెలిపారు. అయితే ఈ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ దేశీయ మార్కెట్లో విడుదల చేయకముందే ఈ స్కూటర్ యొక్క ధరను వెల్లడించే వీడియో వెలువడింది.

బ్రేకింగ్ న్యూస్.. ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ తెలిపే వీడియో రిలీజ్ చేసిన ఓలా

ఓలా ఎలక్ట్రిక్ విడుదల చేసిన ఈ వీడియోలో సీఈఓ భవిష్ అగర్వాల్ మాట్లాడుతూ, ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ ఇప్పటికే లక్షకుపైగా దాటాయని చెప్పారు. అంతే కాకుండా ఓలా ఎస్ 1 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్ రేపు విడుదల కానుందని కూడా తెలిపారు.

బ్రేకింగ్ న్యూస్.. ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ తెలిపే వీడియో రిలీజ్ చేసిన ఓలా

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభంమయ్యాయి. కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు దీనిని కేవలం 499 రూపాయలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఈ స్కూటర్‌ విడుదలకు ముందే దేశవ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభిస్తోంది. కంపెనీ ఇప్పటికే 10,000 లొకేషన్ల నుండి బుకింగ్‌లు అందుకున్నాయి.

బ్రేకింగ్ న్యూస్.. ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ తెలిపే వీడియో రిలీజ్ చేసిన ఓలా

ఈ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకున్న కస్టమర్లకు కంపెనీ నేరుగా హోమ్ డెలివరీ చేయనుంది. కనిపించిన విడుదల చేసిన ఈ వీడియోలో, S1 ఎలక్ట్రిక్ స్కూటర్ ధరను వెల్లడించడానికి ఓలా ఒక సమాచారాన్ని అందిస్తోంది. ఓలా ఎస్ 1 స్కూటర్ ఇండియన్ మార్కెట్లో ఉన్న ఎటర్గో యాప్‌స్కూటర్ పై ఆధారపడి ఉంటుంది.

బ్రేకింగ్ న్యూస్.. ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ తెలిపే వీడియో రిలీజ్ చేసిన ఓలా

ఇప్పుడు మీరు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ధరను తెలుసుకోవడానికి ఈ వారికి లోని వీడియో చూడవచ్చు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రివర్స్ మోడ్ ఫీచర్ కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఈ స్కూటర్ 10 రంగులలో దేశీయ మార్కెట్లో విడుదల కానుంది. ఇది చూడటానికి చాలా సింపుల్ గా మరియు చాలా స్టైలిష్ గా ఉంటుంది.

బ్రేకింగ్ న్యూస్.. ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ తెలిపే వీడియో రిలీజ్ చేసిన ఓలా

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క కొలతల విషయానికి వస్తే, ఓలా ఎస్ 1 స్కూటర్ పొడవు 1860 మిమీ, 700 మిమీ వెడల్పు, 1155 మిమీ ఎత్తు, మరియు 1,345 మిమీ వీల్‌బేస్ కలిగి ఉంటుంది. ఓలా ఎస్1 సిరీస్ స్కూటర్ బరువు 74 కేజీల అరకు ఉంటుంది.

బ్రేకింగ్ న్యూస్.. ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ తెలిపే వీడియో రిలీజ్ చేసిన ఓలా

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ లేటెస్ట్ ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇందులో డ్యూయల్ పాడ్ ఎల్ఈడీ హెడ్‌లైట్, కలర్ ఎల్సిడి డిస్‌ప్లే, క్లౌడ్ కనెక్టివిటీ, నావిగేషన్ టెక్నాలజీ, రిమూవబుల్ లిథియం-అయాన్ బ్యాటరీ, టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్ మరియు అల్లాయ్ వీల్స్ ఉంటాయి.

బ్రేకింగ్ న్యూస్.. ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ తెలిపే వీడియో రిలీజ్ చేసిన ఓలా

ఇప్పటికే వెల్లడైన సమాచారం ఓలా స్కూటర్‌ను S1 మరియు S1 ప్రో అనే రెండు వేరియంట్లలో తీసుకువచ్చే అవకాశం ఉంది. రెండు వేరియంట్‌లను 'S' సిరీస్ స్కూటర్ కింద విక్రయించవచ్చు. ఇదివరకే చెప్పిన విధంగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ కంపెనీ నేరుగా హోమ్ డెలివరీ చేయనున్నట్లు ఇంతకుముందే ప్రకటించింది. కస్టమర్లు కూడా ఎక్కువ సంఖ్యంలో హోమ్ డెలివరీ విధంగా ఎంచుకుంటున్నారు. కావున ఈ స్కూటర్ బుక్ చేసుకున్న భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు అందించబడుతుంది.

బ్రేకింగ్ న్యూస్.. ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ తెలిపే వీడియో రిలీజ్ చేసిన ఓలా

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 3 కిలోవాట్ నుండి 6 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ ఇవ్వవచ్చు. ఫాస్ట్ ఛార్జర్‌తో, ఈ స్కూటర్‌ను కేవలం 18 నిమిషాలలో 50 శాతం వరకు ఛార్జ్ చేసుకోగలదు. అదే సమయంలో, నార్మల్ ఛార్జర్‌తో ఛార్జ్ చేయడానికి 2 నుంచి 2.5 గంటల సమయం పడుతుంది.

బ్రేకింగ్ న్యూస్.. ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ తెలిపే వీడియో రిలీజ్ చేసిన ఓలా

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తిగా ఛార్జ్ అయినా తరువాత 100 నుంచి 150 కి.మీ.ల పరిధిని అందిస్తుంది. ఈ స్కూటర్ యొక్క గరిష్ట వేగం గంటకు 90 కిమీ వరకు ఉంటుంది. ఈ స్పెసిఫికేషన్స్ కలిగి ఉండటం వల్ల, ఇది హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో చేర్చబడుతుంది.

బ్రేకింగ్ న్యూస్.. ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ తెలిపే వీడియో రిలీజ్ చేసిన ఓలా

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఏథర్ 450 ఎక్స్‌కి ప్రత్యక్ష ప్రత్యర్థిగా ఉంటుంది. అంతే కాకూండా బజాజ్ చేతక్ మరియు టీవీఎస్ ఐక్యూబ్ వంటి ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్‌లకు కూడా ప్రత్యర్థిగా ఉండనుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల కోసం ఎంతోమంది ఆసక్తిగా చూస్తున్నారని మనం ఇదివరకే చెప్పుకున్నాం. అయితే ఈ స్కూటర్ విడుదలైన తర్వాత కస్టమర్లను సంతోషపెట్టగలదా అనేది త్వరలో తెలుస్తుంది.

More from DriveSpark

Article Published On: Saturday, August 14, 2021, 13:10 [IST]
English summary
Ola electric scooter price revealed teaser details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+