విడుదలకు ముందే 1,000 నగరాలకుపైగా బుకింగ్స్ స్వీకరించిన ఓలా; వివరాలు
భారత మార్కెట్లో ఓలా కంపెనీ యొక్క కొత్త ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని వాహన ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే వీరి కోసం ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల తేదీని ఇదివరకే వెల్లడించారు.
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆగస్టు 15 న అధికారికంగా విడుదల విడుదలవుతుందని కంపెనీ సీఈఓ అధికారికంగా తెలియజేసారు. ఈ స్కూటర్ విడుదల రోజున ధరను కూడా వెల్లడవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ స్కూటర్ కోసం బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

ఓలా కంపెనీ యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ 2021 జూలై 15 నుండి అందుబాటులో ఉన్నాయి. దీనిని కొనుగోలుచేయాలనుకునే కస్టమర్లు కేవలం 499 రూపాయలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. బుకింగ్స్ ప్రారంభమైన 24 గంటల్లోనే 1 లక్షకుపైగాబుకింగ్స్ వచ్చినట్లు కంపెనీ తెలిపింది.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ని విడుదల చేయడం పట్ల కంపెనీ సిఇఒ భవిష్ అగర్వాల్ చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా యితడు ప్రతిరోజూ ఈ స్కూటర్ గురించి కొన్ని కొత్త సమాచారాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు మరోసారి ట్వీట్ చేయడం ద్వారా స్కూటర్ గురించి కొత్త సమాచారం అందుబాటులోకి వచ్చింది.

ఇటీవలి కంపెనీ సీఈఓ చేసిన ట్వీట్‌లో, స్కూటర్ 1,000 కి పైగా నగరాల నుండి బుకింగ్‌లను అందుకుందని ఆయన చెప్పారు. అన్ని బుకింగ్ ప్రదేశాలలో మొదటి రోజు నుండి ఓలా స్కూటర్ల డెలివరీ ప్రారంభమవుతుందని కూడా ఆయన వ్యక్తం చేశారు. ఆగస్టు 15 న మరిన్ని వివరాలను తెలియజేస్తామని వారు ఇందులో తెలిపారు.

కొత్త ఓలా స్కూటర్ బుకింగ్ జులై 15 నుంచి అందుబాటులో ఉన్న విషయం తెలిసందే అయితే, బుకింగ్ రద్దు చేసుకున్నట్లతే మీ బుకింగ్ అమౌంట్ మొత్తం కూడా రీఫండ్ అవుతుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ధర ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే దీని ధర ఒక లక్ష రూపాయల లోపు ఉంటుందని భవిస్తున్నారు. కానీ కంపెనీ ఈ స్కూటర్ దేశీయ మార్కెట్లో విడుదల చేసిన రోజు ఈ స్కూటర్ ధరను అధికారికంగా ప్రకటించనుంది.

ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహన వినియోగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రాయితీలను కూడా కల్పిస్తున్నారు, కావున ఈ స్కూటర్ ధర అనుకున్న ధర కంటే కూడా తక్కువ ధరకు లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

కంపెనీ ఇప్పటికే అందించిన సమాచారం ప్రకారం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తం 10 రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం, కంపెనీ ఈ స్కూటర్‌ను డీలర్‌షిప్‌లో విక్రయించడంతోపాటు హోమ్ డెలివరీని కూడా అందిస్తుంది. ఇటీవల, కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ తన అనుచరులను ట్విట్టర్‌లో ఒక ప్రశ్న అడిగారు, అతను స్కూటర్ డీలర్‌షిప్ నుండి కొనుగోలు చేయాలనుకుంటున్నారా లేదా హోమ్ డెలివరీని ఎంచుకుంటారా అని. ఇందులో, చాలా మంది ప్రజలు హోమ్ డెలివరీని ఎంచుకున్నారు.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 3 కిలోవాట్ నుండి 6 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ ఇవ్వవచ్చు. ఫాస్ట్ ఛార్జర్‌తో, ఈ స్కూటర్‌ను కేవలం 18 నిమిషాలలో 50 శాతం వరకు ఛార్జ్ చేసుకోగలదు. అదే సమయంలో, నార్మల్ ఛార్జర్‌తో ఛార్జ్ చేయడానికి 2 నుంచి 2.5 గంటల సమయం పడుతుంది.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తిగా ఛార్జ్ అయినా తరువాత 100 నుంచి 150 కి.మీ.ల పరిధిని అందిస్తుంది. ఈ స్కూటర్ యొక్క గరిష్ట వేగం గంటకు 90 కిమీ వరకు ఉంటుంది. ఈ స్పెసిఫికేషన్స్ కలిగి ఉండటం వల్ల, ఇది హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో చేర్చబడుతుంది.

ఓలా యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్ అనేక అప్డేటెడ్ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ స్కూటర్ డ్యూయల్ పాడ్ ఎల్ఈడీ హెడ్‌లైట్, కలర్ ఎల్సిడి డిస్‌ప్లే, క్లౌడ్ కనెక్టివిటీ, నావిగేషన్ టెక్నాలజీ, రిమూవబుల్ లిథియం-అయాన్ బ్యాటరీ, టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్ మరియు అల్లాయ్ వీల్స్ వంటి వాటిని కలిగి ఉంటుంది.

ఇప్పటికే వెల్లడైన సమాచారం ఓలా స్కూటర్‌ను S1 మరియు S1 ప్రో అనే రెండు వేరియంట్లలో తీసుకువచ్చే అవకాశం ఉంది. రెండు వేరియంట్‌లను 'S' సిరీస్ స్కూటర్ కింద విక్రయించవచ్చు. అయితే, ఈ మోడళ్ల పేర్లను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఏథర్ 450 ఎక్స్‌కి ప్రత్యక్ష ప్రత్యర్థిగా ఉంటుంది. అంతే కాకూండా బజాజ్ చేతక్ మరియు టీవీఎస్ ఐక్యూబ్ వంటి ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్‌లకు కూడా ప్రత్యర్థిగా ఉండనుంది.

ఓలా కంపెనీ ప్రపంచంలోనే అతి పెద్ద ద్విచక్ర వాహనాల తయారీ కర్మాగారాన్ని తమిళనాడులో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడ స్కూటర్ల ఉత్పత్తి త్వరలో ప్రారంభమవుతుంది. ప్రారంభ దశలో, ఓలా ఫ్యాక్టరీలో ఏటా 20 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేయనుంది. అదే సమయంలో, కార్యకలాపాలు పూర్తిగా ప్రారంభమైన తర్వాత, ప్లాంట్ ప్రతి సంవత్సరం 1 కోటి వాహనాలను తయారు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ప్లాంట్ ఎలక్ట్రిక్ వాహనాల కోసం రోజుకు 25,000 బ్యాటరీలను కూడా తయారు చేయడానికి శ్రీకారం చుట్టింది.


Click it and Unblock the Notifications








