Electric Scooter అమ్మకాలు షురూ చేసిన Ola.. ఫస్ట్ ఛాన్స్ వారికే

Ola Electric 2021 ఆగష్టు 15 న S1 మరియు S1 Pro అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను వరుసగా రూ. 99,999 మరియు రూ. 1.29 లక్షల ఎక్స్ షోరూమ్ ధర వద్ద విడుదల చేసిన విషయం తెలిసిందే. విడుదలకు ముందే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ కూడా కంపెనీ ప్రారంభించింది. కంపెనీ ఆ సమయంలోనే మంచి బుకింగ్స్ కూడా స్వీకరించగలిగింది. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ విక్రయాలు 2021 సెప్టెంబర్ 08 నుంచి ప్రారంభించనున్నట్లు కంపెనీ ఇదివరకు తెలిపింది, కానీ వెబ్‌సైట్‌లో ఏర్పడిన టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల అది కాస్త సెప్టెంబర్ 15 కి పొడిగించింది.

అయితే ఎట్టకేలకు ఈ రోజు నుంచి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలను కంపెనీ ప్రారంభించింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

Electric Scooter అమ్మకాలు షురూ చేసిన Ola.. ఫస్ట్ ఛాన్స్ వారికే

Ola Electric అమ్మకాలు ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి ప్రారంభించింది. కస్టమర్లు తమకు నచ్చిన మరియు ఇష్టమైన ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేస్తున్నారు.

Electric Scooter అమ్మకాలు షురూ చేసిన Ola.. ఫస్ట్ ఛాన్స్ వారికే

'ఫస్ట్-కమ్-ఫస్ట్-సర్వ్' స్కీమ్ ఆధారంగా కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. స్కూటర్ బుక్ చేసుకున్న వ్యక్తులు బుకింగ్ ఆర్డర్ ప్రకారం కొనుగోలు చేసారు. ముందుగా బుక్ చేసుకున్న వారికి ముందుగా స్కూటర్ కొనుగోలు చేసి మిగిలిన మొత్తాన్ని చెల్లించే అవకాశం లభిస్తుంది.

Electric Scooter అమ్మకాలు షురూ చేసిన Ola.. ఫస్ట్ ఛాన్స్ వారికే

దేశీయ మార్కెట్లో చాలామంది వాహనప్రియులు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకున్నట్లు కంపెనీ ఇదివరకు తెలిపింది. స్కూటర్ బుక్ చేసుకున్న వారిలో ముందుగా బుక్ చేసుకున్న వారికీ మొదట కొనుగోలు చేసే అవకాశాన్ని కంపెనీ కల్పిస్తుంది. ఇందులో భాగంగా ఈ స్కూటర్ కొనుగోలు చేసే కస్టమర్లు ముందస్తుగా మొత్తం డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.

Electric Scooter అమ్మకాలు షురూ చేసిన Ola.. ఫస్ట్ ఛాన్స్ వారికే

Ola Electric కొంతకాలం క్రితం ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుదారులకు అనుకూలంగా ఉండటానికి ఫైనాన్స్ సదుపాయాన్ని అందించడానికి కొన్ని ప్రముఖ బ్యాంకులతో మరియు ఫైనాన్స్ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇది వాహనాలను కొనుగోలు చేసే కస్టమర్లకు చాలా అనుకూలంగా ఉంటుంది.

Electric Scooter అమ్మకాలు షురూ చేసిన Ola.. ఫస్ట్ ఛాన్స్ వారికే

Ola Electric భాగస్వామ్యం కుదుర్చుకున్న బ్యాంకులు మరియు ఫైనాన్స్ సంస్థల్లో HDFC Bank, ICICI Bank, Kotak Mahindra Prime మరియు Tata Capital వంటి వాటితో పాటు Bank of Baroda, Axis Bank, HDFC First Bank, Indusind Bank, AU Small Finance Bank, Jan Small Finance Bank మరియు Yes Bank ఉన్నాయి.

Electric Scooter అమ్మకాలు షురూ చేసిన Ola.. ఫస్ట్ ఛాన్స్ వారికే

ఇప్పుడు కొనుగోలుదారులు 2,999 రూపాయల ఆకర్షణీయమైన ఈఎమ్ఐతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయవచ్చు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ అక్టోబర్ నెల నుండి ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది. అంతే కాకుండా కంపెనీ ఇదివరకు చెప్పిన డోర్ డెలివరీ విధానాన్ని అనుసరిస్తుంది. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా 1,000 నగరాలు మరియు పట్టణాలకు తన ఎలక్ట్రిక్ స్కూటర్లను డోర్ డెలివరీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. దీన్ని బట్టి చూస్తే డెలివరీలు చాలా వేగంగా జరిగే అవకాశం ఉంది.

Electric Scooter అమ్మకాలు షురూ చేసిన Ola.. ఫస్ట్ ఛాన్స్ వారికే

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ లేటెస్ట్ ఫీచర్స్ మరియు పరికరాలతో నింది ఉంటుంది. అంతే కాకుండా ఇది మంచి మైలేజ్ అందిస్తూ వాహనవినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా ఈ స్కూటర్ కేవలం 3 సెకన్లలో గంటకు 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. దీని గరిష్ట వేగం గంటకు 115 కిలోమీటర్లు.

Electric Scooter అమ్మకాలు షురూ చేసిన Ola.. ఫస్ట్ ఛాన్స్ వారికే

ఓలా కంపెనీ అందించిన సమాచారం Ola S1 స్కూటర్ టెస్ట్ రైడ్ అక్టోబర్ నుండి ప్రారంభం కానుంది, వినియోగదారులు స్కూటర్ టెస్ట్ రైడ్ చేసిన తరువాత కూడా నచ్చకపోతే వారి బుకింగ్‌ని రద్దు చేసే సదుపాయం అందుబాటులో ఉంటుంది. అయితే కంపెనీ ఇంకా దాని టెస్ట్ రైడ్ ఎలా నిర్వహించబడుతుందో అధికారికంగా వెల్లడించలేదు, త్వరలో వెల్లడవుతుంది.

Electric Scooter అమ్మకాలు షురూ చేసిన Ola.. ఫస్ట్ ఛాన్స్ వారికే

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు 8.5 కిలో వాట్ ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగిస్తాయి, ఇది 3.92 కిలో వాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో జతచేయబడుతుంది. ఇందులోని బ్యాటరీని బయటకు తీసే అవకాశం ఉండదు. Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఫాస్ట్ ఛార్జర్‌తో 60 నిమిషాల్లో 0 - 100 శాతం నుండి ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది.

Electric Scooter అమ్మకాలు షురూ చేసిన Ola.. ఫస్ట్ ఛాన్స్ వారికే

హోమ్ ఛార్జర్‌తో ఛార్జ్ చేయడానికి 6 గంటలు పడుతుంది. ఓలా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను సింపుల్ డిజైన్‌తో అందించింది మరియు దాని ముందు ఆప్రాన్‌లో ఓలా బ్యాడ్జింగ్ చూడవచ్చు. LED DRL లతో LED హెడ్‌ల్యాంప్ సెటప్ దాని హెడ్‌లైట్ క్లస్టర్‌లో ఇవ్వబడింది.

Electric Scooter అమ్మకాలు షురూ చేసిన Ola.. ఫస్ట్ ఛాన్స్ వారికే

Ola Electric Scooter మూడు డ్రైవింగ్ మోడ్‌లను కలిగి ఉంది. అవి నార్మల్, స్పోర్ట్ మరియు హైపర్ మోడ్స్. Ola Electric Scooter యొక్క కొలతల విషయానికి వస్తే, ఇది 1860 మిమీ పొడవు, 700 మిమీ వెడల్పు, 1155 మిమీ ఎత్తు, 1345 మిమీ వీల్‌బేస్ మరియు 74 కిలోల బరువు ఉంటుంది.

Electric Scooter అమ్మకాలు షురూ చేసిన Ola.. ఫస్ట్ ఛాన్స్ వారికే

అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ (Ola Electric Scooter) ఇప్పుడు దేశీయ మార్కెట్లో మాత్రమే కాకుండా విదేశీ మార్కెట్లో కూడా అడుగుపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ Ola Electric Scooter ఎగుమతి 2022 నుంచి ఎగుమతి చేయబడతాయని తెలిపారు. దీన్ని బట్టి చూస్తే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఖండాంతరాలు దాటడానికి సిద్ధంగా ఉంది.

More from DriveSpark

Article Published On: Wednesday, September 15, 2021, 11:38 [IST]
English summary
Ola electric scooter sales starts from today price specification details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+