Ola Electric ఖాతాలో చేరిన మరో రికార్డ్; ఒకే రోజు రూ. 600 కోట్లకు పైగా అమ్మకాలు

Ola Electric కొత్త Electric Scooter దేశీయ మార్కెట్లో విడుదల చేయడానికి ముందు నుంచి వాహన వినియోగదారుల్లో ఎంతో ఆసక్తి నెలకొల్పింది. అయితే కంపెనీ విడుదలకు ముందే ఈ స్కూటర్ కోసం బుకింగ్స్ ప్రారంభించింది. బుకింగ్స్ ప్రారంభమైన కేవలం 24 గంటల్లో దాదాపు 1 లక్ష బుకింగ్స్ స్వీకరించి ఒక రికార్డ్ సృష్టించింది.

Ola Electric ఖాతాలో చేరిన మరో అరుదైన రికార్డ్; ఏంటో తెలుసా?

కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 2021 ఆగష్టు 15 న అధికారికంగా విడుదల చేసింది. అయితే 2021 సెప్టెంబర్ 15 నుంచి విక్రయాలను ప్రారంభించింది. విక్రయాలు ప్రారంభించిన మొదటి రోజే కంపెనీ అద్భుతమైన స్పందనను కైవసం చేసుకుంది. Ola Electric కంపెనీ యొక్క సీఈఓ భవిష్ అగర్వాల్ అందించిన సమాచారం ప్రకారం, ప్రతి సెకనుకు దాదాపు 4 స్కూటర్లు బుక్ చేయబడ్డాయి.

Ola Electric ఖాతాలో చేరిన మరో అరుదైన రికార్డ్; ఏంటో తెలుసా?

Ola Electric Scooter కొనుగోలు చేయడానికి 2021 సెప్టెంబర్ 16 అంటే ఈ రోజు చివరి రోజు. కంపెనీ ఈ రోజు అర్ధరాత్రి తర్వాత విక్రయాలు నిలిపివేయబడతాయని భవిష్ అగర్వాల్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. కావున స్టాక్ అయిపోవడానికి ముందుగానే మీకు ఇష్టమైన ఓలా స్కూటర్ బుక్ చేసుకోవాలి.

Ola Electric ఖాతాలో చేరిన మరో అరుదైన రికార్డ్; ఏంటో తెలుసా?

కంపెనీ విక్రయాలు ప్రారంభించిన కేవలం ఒక్క రోజులో రూ. 600 కోట్లకు పైగా విలువైన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ అమ్ముడైనట్లు కూడా కంపెనీ తెలిపింది. దీన్ని బట్టి చూస్తే Ola Electric మార్కెట్లో ఎంత ఆదరణ పొందుతుందో స్పష్టమవుతుంది.

Ola Electric ఖాతాలో చేరిన మరో అరుదైన రికార్డ్; ఏంటో తెలుసా?

కంపెనీ ఇంతకు ముందు అందించిన సమాచారం ప్రకారం, 2021 సెప్టెంబర్ 8 నుంచి విక్రయాలు ప్రారంభించనున్నట్లు తెలిపింది, కానీ కంపెనీ యొక్క వెబ్‌సైట్‌లో ఏర్పడిన కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల అమ్మకాలు వాయిదా పడి, సెప్టెంబర్ 15 కి పొడిగించబడింది. దీని ప్రకారం కంపెనీ సెప్టెంబర్ 15 న ఉదయం నుండి అమ్మకాలను ప్రారంభించింది.

Ola Electric ఖాతాలో చేరిన మరో అరుదైన రికార్డ్; ఏంటో తెలుసా?

Ola Electric తన Electric Scooter ని కొనువులు చేయడానికి అనుకూలంగా ఉండటానికి కస్టమర్లకు ఈఎమ్ఐ ఆప్సన్ కూడా అందించింది. దీనికోసం కంపెనీ HDFC Bank, ICICI Bank, Kotak Mahindra Prime మరియు Tata Capital వంటి వాటితో పాటు Bank of Baroda, Axis Bank, HDFC First Bank, Indusind Bank, AU Small Finance Bank, Jan Small Finance Bank మరియు Yes Bank వంటి వాటితో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

Ola Electric ఖాతాలో చేరిన మరో అరుదైన రికార్డ్; ఏంటో తెలుసా?

కావున Ola Electric Scooter S1 స్కూటర్ కొనుగోలు కోసం EMI రూ. 2,999 నుండి ప్రారంభమవుతుంది, అదేవిధంగా S1 Pro EMI రూ. 3,199 వద్ద ప్రారంభమవుతుంది. కొనుగోలుదారులు 48 నెలల్లో లోన్ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. అయితే మీరు బ్యాంకులో పొందే లోన్ ని బట్టి EMI కూడా మారుతుంది. ఇవన్నీ కొనుగోలుదారులకు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి.

Ola Electric ఖాతాలో చేరిన మరో అరుదైన రికార్డ్; ఏంటో తెలుసా?

Ola Electric దేశీయ మార్కెట్లో S1 మరియు S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్లను వరుసగా రూ. 99,999 మరియు రూ. 1,29,999 కి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటాయి.

Ola Electric ఖాతాలో చేరిన మరో అరుదైన రికార్డ్; ఏంటో తెలుసా?

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఎల్ఈడీ టైల్ లైట్, పెద్ద సీటు, అల్లాయ్ వీల్స్, రియర్ గ్రాబ్ రైల్, 50 లీటర్ల అండర్ స్టోరేజ్, ఫ్రంట్ లగేజ్ స్పేస్, క్రూయిజ్ కంట్రోల్ మరియు హిల్ హోల్డ్ వంటి ఫీచర్లు ఇవ్వబడ్డాయి.

Ola Electric ఖాతాలో చేరిన మరో అరుదైన రికార్డ్; ఏంటో తెలుసా?

Ola Electric Scooters ఎలక్ట్రిక్ స్కూటర్లు 8.5 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్‌ను కలిగి ఉండి, 3.92 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో జతచేయబడి ఉంటుంది. ఇందులోని బ్యాటరీని బయటకు తీసే అవకాశం ఉండదు. Ola S 1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఫాస్ట్ ఛార్జర్‌తో 60 నిమిషాల్లో 0 నుంచి 100 శాతం వరకు ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది. హోమ్ ఛార్జర్‌తో ఛార్జ్ చేయడానికి 6 గంటలు పడుతుంది.

Ola Electric ఖాతాలో చేరిన మరో అరుదైన రికార్డ్; ఏంటో తెలుసా?

Ola S1 స్కూటర్ ఒక ఫుల్ ఛార్జితో 121 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది, అయితే హై-ఎండ్ వేరియంట్ S1 Pro Scooter 181 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఈ రెండు స్కూటర్ల యొక్క గరిష్ట వేగం విషయానికి వస్తే, Ola S1 స్కూటర్ గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లు. ఈ స్కూటర్ కేవలం 3 సెకన్లలో గంటకు 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.

Ola Electric ఖాతాలో చేరిన మరో అరుదైన రికార్డ్; ఏంటో తెలుసా?

ఈ స్కూటర్ మూడు వేర్వేరు డ్రైవింగ్ మోడ్‌లను కలిగి ఉంది. ఇందులో నార్మల్, స్పోర్ట్ మరియు హైపర్ మోడ్స్ ఉన్నాయి. వీటితో పాటు ఈ స్కూటర్ 10 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

Ola Electric ఖాతాలో చేరిన మరో అరుదైన రికార్డ్; ఏంటో తెలుసా?

Ola Electric Scooter యొక్క కొలతల విషయానికి వస్తే, ఇది 1860 మిమీ పొడవు, 700 మిమీ వెడల్పు, 1155 మిమీ ఎత్తు, 1345 మిమీ వీల్‌బేస్ మరియు 74 కిలోల బరువు ఉంటుంది. Ola కంపెనీ ఇప్పటికే హైపర్‌ ఛార్జర్ నెట్‌వర్క్‌ను ప్రకటించింది. మొదటి సంవత్సరంలో 400 నగరాల్లో 1 లక్ష ఛార్జింగ్ స్పాట్‌లను సృష్టించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. 100 నగరాల్లో 5000 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం ద్వారా దీనిని ప్రారంభిస్తారు.

More from DriveSpark

Article Published On: Thursday, September 16, 2021, 16:32 [IST]
English summary
Ola electric scooter selling 4 units per second sales around rs 600 crore
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+