దుమ్మురేపుతున్న Ola Electric Scooter వీడియో.. డోంట్ మిస్

దేశీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన Ola Electric Scooter యొక్క అమ్మకాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అయితే ఇప్పటికి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు మాత్రమే జరగాల్సి ఉంది. ఇదిలా ఉండగా Ola కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ ఒక ట్వీట్ చేసారు. ఇందులో Ola Electric Scooter పరిపరి విధాలుగా టెస్ట్ కి గురి కావడం ఇక్కడ చూడవచ్చు. ఈ వీడియో చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది, ఇందులో ఎటువంటి సందేహం లేదు.

దుమ్మురేపుతున్న Ola Electric Scooter వీడియో.. డోంట్ మిస్

కంపెనీ ఇప్పటికే అందించిన సమాచారం ప్రకారం, Ola Electric Scooter యొక్క టెస్ట్ రైడ్ త్వరలో ప్రారంభం కానుంది. టెస్ట్ రైడ్ ముగియగానే డెలివరీలు ప్రారంభమవుతాయని భవిష్ అగర్వాల్ తెలిపారు. కావున ఇక Ola Electric Scooter డెలివరీలు చాలా త్వరగానే జరుగుతాయని మనకు స్పష్టంగా తెలుస్తుంది.

దుమ్మురేపుతున్న Ola Electric Scooter వీడియో.. డోంట్ మిస్

ఇప్పుడు తాజాగా విడుదలైన ఈ వీడియోలో, Ola Electric Scooter ర్యాంప్‌పై నుండి దూకడం, వెంటనే బ్రేకులు వేయబడటం, ముందు ఉన్న చక్రాన్ని గాలిలోకి ఎత్తడం మరియు అదేవిధంగా వెనుక చక్రాన్ని గాలిలోకి లేపడం వంటివి ఇక్కడ జరుగుతాయి. అంతే కాకుండా Ola Electric Scooter ఒకే దగ్గర ఉండి సర్కిల్ వేయడం కూడా మీరు చూడవచ్చు. మొత్తానికి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అన్నివిధాలుగా పరీక్షించబడింది. ఎందుకంటే ఈ విధంగా టెస్ట్ చేయడం ద్వారా దాని క్వాలిటీ తెలుస్తుంది.

దుమ్మురేపుతున్న Ola Electric Scooter వీడియో.. డోంట్ మిస్

Ola కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలకు ముందే దానిని పూర్తిగా టెస్ట్ చేయాలనీ నిర్ణయించింది. ఈ కారణంగానే దీనిని చాలా కఠినంగా టెస్ట్ చేస్తోంది. కంపెనీ ఇప్పటికి అందించిన సమాచారం ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క టెస్ట్ రైడ్ 2021 నవంబర్ 10 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ టెస్ట్ రైడ్ ఈ తేదీలో జరుగుతుందా.. లేదా.. అనేది ఖచ్చితంగా తెలియదు. దీనికి సంబంధించి అప్డేటెడ్స్ ఇంకా రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త టీజర్‌ కస్టమర్ల ఉత్కంఠను మరింత పెంచేలా కంపెనీ ప్రయత్నిస్తోంది.

దుమ్మురేపుతున్న Ola Electric Scooter వీడియో.. డోంట్ మిస్

Ola ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు ఈ నెలాఖరులోగా ప్రారంభించే అవకాశం ఉంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క తదుపరి బ్యాచ్ యొక్క విక్రయాలు నవంబర్ 1 నుండి ప్రారంభించబడుతోంది, కానీ ఇప్పుడు అది రద్దు చేయబడింది. కావున ఇప్పుడు తదుపరి సేల్ డిసెంబర్‌లో ప్రారంభించబడుతుంది. కావున ఇకపై కొనుగోలు చేయాలనుకునే ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తుంది.

దుమ్మురేపుతున్న Ola Electric Scooter వీడియో.. డోంట్ మిస్

Ola కంపెనీ ఎస్ 1 మరియు ఎస్ 1 ప్రో స్కూటర్‌లు రెండింటిని 2021 ఆగస్టు 15 న దేశీయ మార్కెట్లో విడుదల విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో Ola S1 ధర రూ. 99,999 (ఎక్స్-షోరూమ్) కాగా Ola S1 Pro ధర రూ. 1,29,999 (ఎక్స్-షోరూమ్) గా ఉంది.

దుమ్మురేపుతున్న Ola Electric Scooter వీడియో.. డోంట్ మిస్

Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 120 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఇది 10 కలర్ ఆప్షన్‌లతో లభిస్తుంది మరియు 3.97 కిలో వాట్ బ్యాటరీ ప్యాక్‌తో జతచేయబడిన 8.5 kW ఎలక్ట్రిక్ మోటార్‌ని ప్యాక్ చేస్తుంది. ఇక Ola S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకే ఛార్జ్‌పై 180 కిమీల కంటే ఎక్కువ పరిధిని అందిస్తుంది.

దుమ్మురేపుతున్న Ola Electric Scooter వీడియో.. డోంట్ మిస్

Ola కంపెనీ ప్రారంభించే ఈ హైపర్‌ఛార్జర్స్ కేవలం 18 నిముషాల్లో ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీని 0 నుంచి 50 శాతం వరకు ఛార్జ్ చేస్తుంది. ఈ ఛార్జింగ్ తో దాదాపు 75 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఇది నిజంగా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది, మరియు సమయాన్ని ఆదా చేస్తుంది.

దుమ్మురేపుతున్న Ola Electric Scooter వీడియో.. డోంట్ మిస్

Ola Electric స్కూటర్ మూడు వేర్వేరు డ్రైవింగ్ మోడ్‌లను కలిగి ఉంటుంది. అవి నార్మల్, స్పోర్ట్ మరియు హైపర్ మోడ్స్. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అద్భుతమైన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండటం మాత్రమే కాకుండా, మంచి పనితీరుని కూడా అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 10 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది.

దుమ్మురేపుతున్న Ola Electric Scooter వీడియో.. డోంట్ మిస్

ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, కోటక్ మహీంద్రా ప్రైమ్ మరియు టాటా క్యాపిటల్‌ వంటి వాటితో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసే కస్టమర్లకు ఈ బ్యాంకులు ఫైనాన్స్ సదుపాయాన్ని కల్పిస్తాయి. అంతే కాకుండా బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్, HDFC ఫస్ట్ బ్యాంక్, Indusind Bank,, AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, జన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మరియు Yes బ్యాంక్ వంటివి కూడా ఈ భాగస్వామ్యంలో ఉన్నాయి.

Ola Electric Scooter యొక్క కొలతల విషయానికి వస్తే, ఇది 1860 మిమీ పొడవు, 700 మిమీ వెడల్పు, 1155 మిమీ ఎత్తు, 1345 మిమీ వీల్‌బేస్ మరియు 74 కిలోల బరువు ఉంటుంది. Ola Electric Scooter భారత మార్కెట్లో Ather 450 X, Bajaj Chetak, TVS iQube వంటి స్కూటర్లకు ప్రత్యర్థిగా ఉంటుంది.

దుమ్మురేపుతున్న Ola Electric Scooter వీడియో.. డోంట్ మిస్

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఎల్ఈడీ టైల్ లైట్, పెద్ద సీటు, అల్లాయ్ వీల్స్, రియర్ గ్రాబ్ రైల్, 50 లీటర్ల అండర్ స్టోరేజ్, ఫ్రంట్ లగేజ్ స్పేస్, క్రూయిజ్ కంట్రోల్ మరియు హిల్ హోల్డ్ వంటి ఫీచర్లు ఇవ్వబడ్డాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు వివిధ రాష్ట్రాల్లో వివిధరకాలుగా ఉంటుంది. అంతే కాకుండా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సబ్సిడీలను బట్టి వాటి ధరలు ఇంకా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Monday, November 8, 2021, 13:47 [IST]
English summary
Ola electric scooter test video delivery details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+