గుడ్ న్యూస్; ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల తేదీ ఖరారు

భారత మార్కెట్లో విడుదలకు ముందే అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్ 'ఓలా'. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని వాహనప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే వీరి కోసం ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల తేదీని వెల్లడించారు.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల తేదీ ఖరారు

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆగస్టు 15 న అధికారికంగా విడుదల విడుదలవుతుందని కంపెనీ సీఈఓ అధికారికంగా తెలియజేసారు. ఈ స్కూటర్ విడుదల రోజున ధరను కూడా వెల్లడవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ స్కూటర్ కోసం బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల తేదీ ఖరారు

ఓలా కంపెనీ యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ 2021 జూలై 15 నుండి అందుబాటులో ఉన్నాయి. దీనిని కొనుగోలుచేయాలనుకునే కస్టమర్లు కేవలం 499 రూపాయలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. బుకింగ్స్ ప్రారంభమైన 24 గంటల్లోనే 1 లక్షకుపైగాబుకింగ్స్ వచ్చినట్లు కంపెనీ తెలిపింది.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల తేదీ ఖరారు

ఇప్పటికే కంపెనీ ఆడించిన సమాచారం ప్రకారం, ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ ఎస్1 మరియు ఎస్1 ప్రో అనే రెండు వేరియంట్లలో తీసుకువచ్చే అవకాశం ఉంది. రెండు వేరియంట్‌లను 'S' సిరీస్ కింద విక్రయించే అవకాశం ఉంది.

మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్స్ స్కూటర్ కి విపరీతమైన స్పందన లభిస్తోంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి పూర్తి సమాచారం త్వరలో తెలుస్తుంది. ఇందులో స్పెసిఫికేషన్‌లు మొదలైనవి కూడా అదే రోజున తెలుస్తాయి. ఓలా స్కూటర్ బుకింగ్ రద్దు చేసుకునే కస్టమర్లకు వారి బుకింగ్ అమౌంట్ ని కూడా తిరిగి పొందవచ్చు.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల తేదీ ఖరారు

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ దాదాపు 1 లక్ష రూపాయల లోపు ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.అంతే కాకూండా ఇప్పుడు దేశంలో అమలులో ఉన్న ఫేమ్-2 సబ్సిడీ మరియు రాష్ట్ర ప్రభుత్వాల డిస్కౌంట్స్ తరువాత మరింత తక్కువ ధరకు లభించే అవకాశం ఉంటుంది.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల తేదీ ఖరారు

ఓలా కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తం 10 రంగుల్లో అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఇప్పటికే వెల్లడించింది. ప్రస్తుతం, కంపెనీ ఈ స్కూటర్‌ను డీలర్‌షిప్‌లో విక్రయించడంతోపాటు హోమ్ డెలివరీ కూడా చేయడానికి సుముఖత చూపిస్తుంది. ఎక్కువమంది ప్రజలు హోమ్ డెలివరీ సదుపాయాన్ని ఎంపిక చేసుకోవడం వల్ల కంపెనీ ఈ విధానం కూడా ఆచరిస్తుంది.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల తేదీ ఖరారు

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 3 కిలోవాట్ నుండి 6 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ ఇవ్వవచ్చు. ఫాస్ట్ ఛార్జర్‌తో, ఈ స్కూటర్‌ను కేవలం 18 నిమిషాలలో 50 శాతం వరకు ఛార్జ్ చేసుకోగలదు. అదే సమయంలో, నార్మల్ ఛార్జర్‌తో ఛార్జ్ చేయడానికి 2 నుంచి 2.5 గంటల సమయం పడుతుంది.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల తేదీ ఖరారు

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తిగా ఛార్జ్ అయినా తరువాత 100 నుంచి 150 కి.మీ.ల పరిధిని అందిస్తుంది. ఈ స్కూటర్ యొక్క గరిష్ట వేగం గంటకు 90 కిమీ వరకు ఉంటుంది. ఈ స్పెసిఫికేషన్స్ కలిగి ఉండటం వల్ల, ఇది హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో చేర్చబడుతుంది.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల తేదీ ఖరారు

ఓలా యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్ అనేక అప్డేటెడ్ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ స్కూటర్ డ్యూయల్ పాడ్ ఎల్ఈడీ హెడ్‌లైట్, కలర్ ఎల్సిడి డిస్‌ప్లే, క్లౌడ్ కనెక్టివిటీ, నావిగేషన్ టెక్నాలజీ, రిమూవబుల్ లిథియం-అయాన్ బ్యాటరీ, టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్ మరియు అల్లాయ్ వీల్స్ వంటి వాటిని కలిగి ఉంటుంది.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఏథర్ 450 ఎక్స్‌కి ప్రత్యక్ష ప్రత్యర్థిగా ఉంటుంది. అంతే కాకూండా బజాజ్ చేతక్ మరియు టీవీఎస్ ఐక్యూబ్ వంటి ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్‌లకు కూడా ప్రత్యర్థిగా ఉండనుంది.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల తేదీ ఖరారు

ఓలా కంపెనీ ప్రపంచంలోనే అతి పెద్ద ద్విచక్ర వాహనాల తయారీ కర్మాగారాన్ని తమిళనాడులో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడ స్కూటర్ల ఉత్పత్తి త్వరలో ప్రారంభమవుతుంది. ప్రారంభ దశలో, ఓలా ఫ్యాక్టరీలో ఏటా 20 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేయనుంది. అదే సమయంలో, కార్యకలాపాలు పూర్తిగా ప్రారంభమైన తర్వాత, ప్లాంట్ ప్రతి సంవత్సరం 1 కోటి వాహనాలను తయారు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ప్లాంట్ ఎలక్ట్రిక్ వాహనాల కోసం రోజుకు 25,000 బ్యాటరీలను కూడా తయారు చేయడానికి శ్రీకారం చుట్టింది.

More from DriveSpark

Article Published On: Tuesday, August 3, 2021, 13:55 [IST]
English summary
Ola Electric Scooter To Be Launched On August 15. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+