మరో అరుదైన రికార్డ్ పొందిన Ola Electric.. అందేంటో తెలుసా?

దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) ఇటీవల ఎస్1 మరియు ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే కంపెనీ టెస్ట్ రైడ్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటికి 20,000 టెస్ట్ రైడ్‌లను పూర్తి చేసినట్లు తెలిసింది.

మరో అరుదైన రికార్డ్ పొందిన Ola Electric.. అందేంటో తెలుసా?

అయితే కంపెనీ ఇప్పుడు ఈ నెల నుంచి దేశవ్యాప్తంగా దాదాపు 1,000 నగరాల్లో రోజుకి 10,000 టెస్ట్ రైడ్‌లను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ కంపెనీ ఇప్పటివరకు డెలివరీలను గురించి ఒక స్పష్టమైన వివరణ అందించలేకపోతోంది. బహుశా త్వరలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీలను ప్రారంభించే అవకాశం ఉంటుంది, అని భావిస్తున్నారు.

మరో అరుదైన రికార్డ్ పొందిన Ola Electric.. అందేంటో తెలుసా?

టెస్ట్ రైడ్స్ గురించి ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ 'భవిష్ అగర్వాల్' మాట్లాడుతూ.. మేము ఇప్పటికే 20,000 టెస్ట్ రైడ్‌లను పూర్తి చేసాము, ఇది కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రారంచంలోనే ఇది ఒక అరుదైన రికార్డ్ అని అన్నారు. నిజంగా ఇది ప్రపంచంలోనే అతి పెద్ద టెస్ట్ రైడ్ అవుతుంది.

మరో అరుదైన రికార్డ్ పొందిన Ola Electric.. అందేంటో తెలుసా?

2021 ఆగష్టు 15 న విడుదలైన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పటికే డెలివరీ కాకపోవడంతో వినియోగదారులు చాలా నిరాశకు గురవుతున్నారు. అయితే దీనిపైన స్పందించిన భవిష్ అగర్వాల్ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీని డిసెంబర్ మధ్య లేదా చివరి వరకు వాయిదా వేసినట్లు తెలిపారు.

మరో అరుదైన రికార్డ్ పొందిన Ola Electric.. అందేంటో తెలుసా?

ఓలా ఎలక్ట్రిక్ బుక్ చేసుకున్న కస్టమర్లకు మొదటి బ్యాచ్ 2021 అక్టోబర్ 25 మరియు 2021 నవంబర్ 25 మధ్య డెలివరీ చేయాలని భావించారు, కానీ ఇప్పుడు అది డిసెంబర్ 15 మరియు డిసెంబర్ 30 మధ్య జరిగే అవకాశం ఉంటుంది. స్కూటర్ల డెలివరీలో జాప్యం ఏర్పడటానికి సెమీకండక్టర్ చిప్ కొరత కూడా ఒక కారణంగా ఉంది. అయితే త్వరలోనే కస్టమర్లు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని పొందుతారు.

మరో అరుదైన రికార్డ్ పొందిన Ola Electric.. అందేంటో తెలుసా?

ఓలా ఎలక్ట్రిక్ 2021 ఆగష్టు 15 న ఓలా ఎస్1 మరియు ఓలా ఎస్1 ప్రో అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. ఇందులో, Ola S1 యొక్క ఎక్స్-షోరూమ్ ధర రూ. 99,999 కాగా, Ola S1 ప్రో ధర రూ. 1,29,999 (ఎక్స్-షోరూమ్). కంపెనీ ఇటీవల భారతదేశంలోని నెదర్లాండ్స్ ఎంబసీకి మొత్తం 9 Ola S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌లను డెలివరీ చేయనున్నట్లు ఇటీవల కంపెనీ ప్రకటించింది. ఈ స్కూటర్లు 'డచ్ ఆరంజ్' అనే ప్రత్యేకమైన కలర్ లో ఉంటాయి. అయితే కంపెనీ ఈ కలర్ స్కూటర్లను కస్టమర్లు కోరుకుంటే వారికి కూడా అందించటానికి సిద్దమవుతున్నట్లు సమాచారం.

మరో అరుదైన రికార్డ్ పొందిన Ola Electric.. అందేంటో తెలుసా?

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ సింపుల్‌ డిజైన్ కలిగి ఉంటుంది. ఈ బైక్ ఫ్రంట్ ఆప్రాన్‌ మధ్యలో OLA బ్యాడ్జ్‌తో చూడవచ్చు. స్కూటర్ ముందు భాగంలో ఉన్న ఏకైక ఫీచర్ హెడ్‌ల్యాంప్స్ క్లస్టర్, ఇందులో ఎల్ఈడీ డిఆర్ఎల్ ల చుట్టూ ట్విన్-పాడ్ ఎల్ఈడీ సెటప్ ఉంటుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లో క్షితిజ సమాంతరంగా అమర్చిన ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌లు, ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్స్, రియర్ ఫుట్-రెస్ట్ మరియు కాంటూర్డ్ సీట్లు ఉన్నాయి.

మరో అరుదైన రికార్డ్ పొందిన Ola Electric.. అందేంటో తెలుసా?

అంతే కాకూండా ఇందులో అల్లాయ్ వీల్స్, 36-లీటర్ అండర్-సీట్ స్టోరేజ్, రియర్ గ్రాబ్ రైల్స్, ఫ్రంట్ స్టోరేజ్ పాకెట్స్, లగేజ్ హుక్ మరియు రబ్బర్-లైన్డ్ ఫ్రంట్ ఫుట్‌వెల్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క కొలతల విషయానికి వస్తే, ఇది 1860 మిమీ పొడవు, 700 మిమీ వెడల్పు, 1155 మిమీ ఎత్తు, 1345 మిమీ వీల్‌బేస్ మరియు 74 కిలోల బరువు ఉంటుంది.

మరో అరుదైన రికార్డ్ పొందిన Ola Electric.. అందేంటో తెలుసా?

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు వేర్వేరు డ్రైవింగ్ మోడ్‌లను కలిగి ఉంటుంది. అవి నార్మల్, స్పోర్ట్ మరియు హైపర్ మోడ్స్. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అద్భుతమైన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండటం మాత్రమే కాకుండా, మంచి పనితీరుని కూడా అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 10 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది.

మరో అరుదైన రికార్డ్ పొందిన Ola Electric.. అందేంటో తెలుసా?

ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు కస్టమర్ల సౌలభ్యం కోసం, ఫైనాన్స్ సదుపాయాలను అందించడానికి HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, కోటక్ మహీంద్రా ప్రైమ్ మరియు టాటా క్యాపిటల్‌ వంటి వాటితో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసే కస్టమర్లకు ఈ బ్యాంకులు ఫైనాన్స్ సదుపాయాన్ని కల్పిస్తాయి. కావున ఇది కొనుగోలుదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

మరో అరుదైన రికార్డ్ పొందిన Ola Electric.. అందేంటో తెలుసా?

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ 3.9 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది. దీని ఎలక్ట్రిక్ మోటార్ 8.5 kW గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీని 750W సామర్థ్యం గల పోర్టబుల్ ఛార్జర్‌తో దాదాపు 6:30 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఇది కాకుండా, ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 18 నిమిషాల్లో 75% వరకు ఛార్జ్ చేయబడుతుంది.

మరో అరుదైన రికార్డ్ పొందిన Ola Electric.. అందేంటో తెలుసా?

ఓలా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అనేక కొత్త మరియు ఆధునిక ఫీచర్లను అందించింది. Ola S1 పూర్తి ఛార్జ్‌పై 121 కిమీల రేంజ్‌ను అందిస్తుంది, అయితే హై ఎండ్ వేరియంట్ S1 ప్రో 181 కిమీల పరిధిని కలిగి ఉంది. ఈ రెండు స్కూటర్ల టాప్ స్పీడ్ విషయానికి వస్తే, Ola S1 గరిష్టంగా 90 km/h వేగంతో, Ola S1 Pro గరిష్టంగా 115 km/h వేగంతో రైడ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది.

మరో అరుదైన రికార్డ్ పొందిన Ola Electric.. అందేంటో తెలుసా?

Ola దాని S1 మరియు S1 ప్రో స్కూటర్‌లను దాని ఫ్యూచర్‌ఫ్యాక్టరీలో తయారు చేస్తోంది, ఇది అధునాతన తయారీ మరియు పరిశ్రమ 4.0 ప్రక్రియలను ఉపయోగిస్తుంది. కంపెనీ తన సాధారణ ఉత్పత్తిలో ఎటువంటి అంతరాయం లేకుండా నిర్దిష్ట కస్టమర్ అవసరాలకు అనుగుణంగా స్కూటర్లను సులభంగా మరియు కొద్ది రోజుల్లోనే అనుకూలీకరించవచ్చు. Ola S1 శ్రేణి యొక్క అత్యుత్తమ పనితీరు కోసం అత్యుత్తమ సాంకేతికతను ఉపయోగించినట్లు కంపెనీ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Thursday, December 2, 2021, 17:36 [IST]
English summary
Ola electric scooters completes 20000 test ride details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+