హమ్మయ్య.. కస్టమర్ చేతుల్లోకి చేరిన Ola Electric స్కూటర్

ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) భారతీయ మార్కెట్లో తన ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసినప్పటినుంచి కూడా ఎంతోమంది వాహన ప్రియుల మనసు దోచింది. ఈ కారణంగానే అతి తక్కువ కాలంలో అత్యధిక బుకింగ్స్ కూడా స్వీకరించింది. అయితే డెలివరీలను మాత్రం కొంత ఆలస్యం చేస్తూనే వచ్చింది. కానీ ఎట్టకేలకు ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీ ప్రారంభమయ్యింది. దీనికోసం కంపెనీ బెంగళూరులో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

హమ్మయ్య.. కస్టమర్ చేతుల్లోకి చేరిన Ola Electric స్కూటర్

2021 ఆగష్టు 15 న విదుడైన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీలు డిసెంబర్ 15 నుంచి ప్రారంభించబడ్డాయి. అయితే ఈ డెలివరీల కార్యక్రమాన్ని నిర్వహించడానికి పీక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి ఇందులో S1 మరియు S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ల మొదటి బ్యాచ్ డెలివరీలు జరిగాయి.

హమ్మయ్య.. కస్టమర్ చేతుల్లోకి చేరిన Ola Electric స్కూటర్

బెంగళూరు నగరంలోని ఓలా క్యాంపస్‌లో జరిగిన ప్రత్యేక డెలివరీ ఈవెంట్‌లో కంపెనీ తన మొదటి సెట్ వాహనాలను నేరుగా కస్టమర్ల చేతుల్లోకి అందించింది. ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ఇక్కడ మీరు చూడవచ్చు.

హమ్మయ్య.. కస్టమర్ చేతుల్లోకి చేరిన Ola Electric స్కూటర్

ఓలా కంపెనీ తన ఫ్యూచర్‌ఫ్యాక్టరీ కోసం 2021 జనవరి నెలలో భూమిని కొనుగోలు చేసిన విషయం అందరికి తెలిసిందే, అయితే దాదాపు 11 నెలల తరువాత కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలను అందించడం జరిగింది. ఈ స్కూటర్ డెలివరీలు ముందుగానే జరగాల్సి ఉంది, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల డెలివరీలు కొంత ఆలస్యమయ్యాయి. అయితే ఇప్పుడు డెలివరీలు మొదలయ్యాయి.

హమ్మయ్య.. కస్టమర్ చేతుల్లోకి చేరిన Ola Electric స్కూటర్

భారతీయ మార్కెట్లో సెమీకండక్టర్ చిప్ కొరత కారణంగా డెలివరీలు ఆలస్యమయ్యాయని కంపెనీ సీఈఓ భవిష్ అగార్వల్ స్పష్టం చేసారు. అయితే ప్రస్తుతం బుక్ చేసుకున్న కస్టమర్లకు వీలైనంత త్వరగా ఎలక్ట్రిక్ స్కూటర్లను అందించడానికి కంపెనీ పాటుపడుతోందిని కూడా అయన అన్నారు. కావున మిగిలిన కస్టమర్లకు డెలివరీలు త్వరలో పూర్తయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము.

హమ్మయ్య.. కస్టమర్ చేతుల్లోకి చేరిన Ola Electric స్కూటర్

Ola ఎలక్ట్రిక్ యొక్క S1 మరియు S1 ప్రో ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉన్నాయి. కావున ఎక్కువమంది కొనుగోలుదారులు దీనిని బుక్ చేసుకున్నారు. కంపెనీ ఇప్పటికే టెస్ట్ రైడ్ కూడా ప్రారంభించింది. ఈ టెస్ట్ రైడ్ కి దేశీయ మార్కెట్లో మంచి స్పందన వచ్చింది. త్వరలో మరిన్ని నగరాలలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క టెస్ట్ రైడ్లు నిర్వహించే అవకాశం కూడా ఉంది.

హమ్మయ్య.. కస్టమర్ చేతుల్లోకి చేరిన Ola Electric స్కూటర్

Ola ఎలక్ట్రిక్ యొక్క S1 మరియు S1 ప్రో స్కూటర్ల ధరల విషయానికి వస్తే, వరుసగా రూ. రూ. 99,999 మరియు రూ. 1,29,999 (ఎక్స్-షోరూమ్). ఈ రెండు స్కూటర్లు చూడటానికి చాలా సింపుల్ గా ఉన్నప్పటికీ ఆధునిక కాలంలో ఉపయోగపడే అన్ని ఫీచర్స్ ఇందులో అందుబాటులో ఉన్నాయి.

హమ్మయ్య.. కస్టమర్ చేతుల్లోకి చేరిన Ola Electric స్కూటర్

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ సింపుల్‌ డిజైన్ కలిగి ఉంటుంది. ఈ బైక్ ఫ్రంట్ ఆప్రాన్‌ మధ్యలో OLA బ్యాడ్జ్‌తో చూడవచ్చు. స్కూటర్ ముందు భాగంలో ఉన్న ఏకైక ఫీచర్ హెడ్‌ల్యాంప్స్ క్లస్టర్, ఇందులో ఎల్ఈడీ డిఆర్ఎల్ ల చుట్టూ ట్విన్-పాడ్ ఎల్ఈడీ సెటప్ ఉంటుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లో క్షితిజ సమాంతరంగా అమర్చిన ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌లు, ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్స్, రియర్ ఫుట్-రెస్ట్ మరియు కాంటూర్డ్ సీట్లు ఉన్నాయి.

హమ్మయ్య.. కస్టమర్ చేతుల్లోకి చేరిన Ola Electric స్కూటర్

అంతే కాకూండా ఇందులో అల్లాయ్ వీల్స్, 36-లీటర్ అండర్-సీట్ స్టోరేజ్, రియర్ గ్రాబ్ రైల్స్, ఫ్రంట్ స్టోరేజ్ పాకెట్స్, లగేజ్ హుక్ మరియు రబ్బర్-లైన్డ్ ఫ్రంట్ ఫుట్‌వెల్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క కొలతల విషయానికి వస్తే, ఇది 1860 మిమీ పొడవు, 700 మిమీ వెడల్పు, 1155 మిమీ ఎత్తు, 1345 మిమీ వీల్‌బేస్ మరియు 74 కిలోల బరువు ఉంటుంది.

హమ్మయ్య.. కస్టమర్ చేతుల్లోకి చేరిన Ola Electric స్కూటర్

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు వేర్వేరు డ్రైవింగ్ మోడ్‌లను కలిగి ఉంటుంది. అవి నార్మల్, స్పోర్ట్ మరియు హైపర్ మోడ్స్. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అద్భుతమైన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండటం మాత్రమే కాకుండా, మంచి పనితీరుని కూడా అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 10 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది.

హమ్మయ్య.. కస్టమర్ చేతుల్లోకి చేరిన Ola Electric స్కూటర్

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ 3.9 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది. దీని ఎలక్ట్రిక్ మోటార్ 8.5 kW గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీని 750W సామర్థ్యం గల పోర్టబుల్ ఛార్జర్‌తో దాదాపు 6:30 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఇది కాకుండా, ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 18 నిమిషాల్లో 75% వరకు ఛార్జ్ చేయబడుతుంది.

హమ్మయ్య.. కస్టమర్ చేతుల్లోకి చేరిన Ola Electric స్కూటర్

ఓలా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అనేక కొత్త మరియు ఆధునిక ఫీచర్లను అందించింది. Ola S1 పూర్తి ఛార్జ్‌పై 121 కిమీల రేంజ్‌ను అందిస్తుంది, అయితే హై ఎండ్ వేరియంట్ S1 ప్రో 181 కిమీల పరిధిని కలిగి ఉంది. ఈ రెండు స్కూటర్ల టాప్ స్పీడ్ విషయానికి వస్తే, Ola S1 గరిష్టంగా 90 km/h వేగంతో, Ola S1 Pro గరిష్టంగా 115 km/h వేగంతో రైడ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది.

హమ్మయ్య.. కస్టమర్ చేతుల్లోకి చేరిన Ola Electric స్కూటర్

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు బుక్ చేసుకున్న కస్టమర్లు చాలా రోజులనుంచి వీటి డెలివరీ కోసం వేచి చూస్తూనే ఉన్నాయి. కంపెనీ తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీలలో చాలా జాప్యం చేసింది, ఈ కారణంగా చాలామంచి దీనిపై కొంత అసహనం కూడా చూపారు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల యొక్క డెలివరీలు ప్రారంభమయ్యాయి, కావున కస్టమర్ల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

More from DriveSpark

Article Published On: Thursday, December 16, 2021, 10:46 [IST]
English summary
Ola electric special delivery event in bangalore details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+