కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన Ola Electric.. ఇప్పుడే చూడండి

ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) దేశీయ మార్కెట్లో 2021 ఆగష్టు 15 న తన ఓలా ఎస్1 మరియు ఎస్1 ప్రో అనే ఎలక్ట్రిక్ స్కూటర్లను వరుసగా రూ. 99,999 మరియు రూ. 1,29,999 (ఎక్స్-షోరూమ్) వద్ద విడుదల చేసింది. ఈ స్కూటర్ దేశీయ మార్కెట్లో విడుదలైన అతి తక్కువ కాలంలోనే విపరీతమైన బుకింగ్స్ పొందగలిగింది. అయితే చాలా రోజుల నిరీక్షించిన తరువాత కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డెలివరీలను ప్రారంభించింది.

కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన Ola Electric.. ఇప్పుడే చూడండి

ఓలా కంపెనీ ఇప్పటికే బెంగళూరు మరియు చెన్నై వంటి ఇతర నగరాల్లో కూడా తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీలను ప్రారంభించింది. అయితే కంపెనీ తన కస్టమర్‌కు S1 స్కూటర్ కి బదులుగా S1 ప్రో స్కూటర్ అందించడానికి సిద్ధమైంది. అయితే, Ola S1 ప్రో యొక్క సాఫ్ట్‌వేర్, ఫీచర్లు మరియు శ్రేణితో సహా పూర్తి సామర్థ్యాన్ని పొందడానికి మీరు అదనంగా రూ. 30,000 చెల్లించవలసి వస్తుంది.

కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన Ola Electric.. ఇప్పుడే చూడండి

మీరు ఈ మెరుగైన వేరియంట్‌ను పొందిన తర్వాత కూడా మీరు అదే ఫీచర్లను పొందుతారు. Ola S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ పరీక్షించిన కస్టమర్‌లు చాలా సంతోషంగా ఉన్నారని కంపెనీ ఒక కస్టమర్‌కు లేఖ రాసారు. అత్యుత్తమ పనితీరు మరియు సాంకేతిక అనుభవాన్ని అందించడానికి మేము Ola S1 ప్రో అందిస్తున్నామని కంపెనీ తెలిపింది.

కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన Ola Electric.. ఇప్పుడే చూడండి

ప్రస్తుత పరిస్థితిలో, మీరు కొనుగోలు చేసిన Ola S1 కి బదులుగా, Ola S1 ప్రో ఇవ్వబడుతోంది. మీరు అదే ధరలో అత్యుత్తమ హార్డ్‌వేర్‌ను పొందబోతున్నారు. అంతే కాకుండా కంపెనీ, కస్టమర్ డెలివరీ తేదీ గురించి సమాచారం ఇస్తూ, మీ ఎలక్ట్రిక్ స్కూటర్ సిద్ధం చేయబడుతోందని, కావున ఇది 2022 జనవరి 10 న మీ చెంతకు చేరుతుంది అని కూడా తెలిపారు.

కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన Ola Electric.. ఇప్పుడే చూడండి

ప్రస్తుతం భారతీయ మార్కెట్లో కొన్ని నిర్దిష్ట నగరాల్లో మాత్రమే డెలివరీలు ప్రారంభమయ్యాయి. అయితే త్వరలో దేశవ్యాప్తంగా 1000 కంటే ఎక్కువ నగరాల్లో తన స్కూటర్లను డెలివరీ చేయబోతోంది. ఇందులో భాగంగానే కంపెనీ గత వారంలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ వైజాగ్, పూణే, అహ్మదాబాద్, ముంబై మరియు అనేక ఇతర నగరాల్లో ప్రారంభించబడింది.

కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన Ola Electric.. ఇప్పుడే చూడండి

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్ ప్రారంభమైన తర్వాత, దేశవ్యాప్తంగా 1000 కంటే ఎక్కువ నగరాల నుండి బుకింగ్‌లను పొందింది. కావున కంపెనీ ఈ స్కూటర్ డెలివరీలను నేరుగా కస్టమర్ ఇంటికి డెలివరీ చేస్తుంది. ఎందుకంటే కంపెనీ ఎలాంటి డీలర్‌షిప్‌ను ప్రారంభించలేదు. ఈ కారణంగా కంపెనీ మొదటి ప్రధాన నగరాల్లోని కస్టమర్లు వేగంగా డెలివరీ చేస్తోంది.

కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన Ola Electric.. ఇప్పుడే చూడండి

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీని ప్రారంభించడంలో చాలా వరకు ఆలస్యం జరిగినప్పటికీ, చాలా కాలం నిరీక్షణ తర్వాత, కంపెనీ ఎట్టకేలకు డెలివరీని ప్రారంభించింది. ఈ స్కూటర్ డెలివరీలను పొందిన కస్టమర్లు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు బుక్ చేసుకున్న కస్టమర్లు కూడా దాదాపుగా 2 నుంచి 3 నెలల సమయం లేచి ఉండాల్సి వస్తోంది.

కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన Ola Electric.. ఇప్పుడే చూడండి

డెలివరీలు ఇప్పుడు కూడా కొంత ఆలస్యం జరగడానికి ప్రధాన కారణం, సెమీ కండక్టర్ చిప్ కొరత. అయితే కంపెనీ డెలివరీలను త్వరగా జరపడానికి చాలా వరకు ఉత్పత్తిని వేగవంతం చేస్తోంది. కావున ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డెలివరీలు ఇకపై ఆలస్యం అయ్యే అవకాశం ఉండదు.

కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన Ola Electric.. ఇప్పుడే చూడండి

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ సింపుల్‌ డిజైన్ కలిగి ఉంటుంది. ఈ బైక్ ఫ్రంట్ ఆప్రాన్‌ మధ్యలో OLA బ్యాడ్జ్‌తో చూడవచ్చు. స్కూటర్ ముందు భాగంలో ఉన్న ఏకైక ఫీచర్ హెడ్‌ల్యాంప్స్ క్లస్టర్, ఇందులో ఎల్ఈడీ డిఆర్ఎల్ ల చుట్టూ ట్విన్-పాడ్ ఎల్ఈడీ సెటప్ ఉంటుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లో క్షితిజ సమాంతరంగా అమర్చిన ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌లు, ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్స్, రియర్ ఫుట్-రెస్ట్ మరియు కాంటూర్డ్ సీట్లు ఉన్నాయి.

కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన Ola Electric.. ఇప్పుడే చూడండి

అంతే కాకూండా ఇందులో అల్లాయ్ వీల్స్, 36-లీటర్ అండర్-సీట్ స్టోరేజ్, రియర్ గ్రాబ్ రైల్స్, ఫ్రంట్ స్టోరేజ్ పాకెట్స్, లగేజ్ హుక్ మరియు రబ్బర్-లైన్డ్ ఫ్రంట్ ఫుట్‌వెల్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క కొలతల విషయానికి వస్తే, ఇది 1860 మిమీ పొడవు, 700 మిమీ వెడల్పు, 1155 మిమీ ఎత్తు, 1345 మిమీ వీల్‌బేస్ మరియు 74 కిలోల బరువు ఉంటుంది.

కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన Ola Electric.. ఇప్పుడే చూడండి

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ 3.9 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది. దీని ఎలక్ట్రిక్ మోటార్ 8.5 kW గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీని 750W సామర్థ్యం గల పోర్టబుల్ ఛార్జర్‌తో దాదాపు 6:30 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఇది కాకుండా, ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 18 నిమిషాల్లో 75% వరకు ఛార్జ్ చేయబడుతుంది.

కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన Ola Electric.. ఇప్పుడే చూడండి

ఓలా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అనేక కొత్త మరియు ఆధునిక ఫీచర్లను అందించింది. Ola S1 పూర్తి ఛార్జ్‌పై 121 కిమీల రేంజ్‌ను అందిస్తుంది, అయితే హై ఎండ్ వేరియంట్ S1 ప్రో 181 కిమీల పరిధిని కలిగి ఉంది. ఈ రెండు స్కూటర్ల టాప్ స్పీడ్ విషయానికి వస్తే, Ola S1 గరిష్టంగా 90 km/h వేగంతో, Ola S1 Pro గరిష్టంగా 115 km/h వేగంతో రైడ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Friday, December 31, 2021, 13:24 [IST]
English summary
Ola electric to deliver s1 pro instead s1 variant for free details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+