టెస్ట్ రైడ్ డేట్ మళ్ళీ పొడిగించిన Ola.. ఇక టెస్ట్ రైడ్ ఎప్పుడంటే?

భారతీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన Ola Electric Scooter యొక్క టెస్ట్ రైడ్ ఎట్టకేలకు ప్రారంభమయ్యింది. చాలామంది Ola Electric Scooter స్కూటర్ ప్రేమికులు ఈ రోజు కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. కంపెనీ ఇది వరకు తెలిపింది విధంగా ఈ రోజు (నవంబర్ 10) నుంచి టెస్ట్ రైడ్ ప్రారభించాలి, కానీ ఇది కాస్త ఇప్పుడు 2021 నవంబర్ 12 కి చేరింది.

 ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్ ప్రారంభించిన Ola: డెలివరీలు ఎప్పుడంటే?

కొత్త Ola Electric Scooter డెలివరీలకు ముందే కస్టమర్లు ఈ స్కూటర్ ను రైడ్ చేసి దాని పర్ఫామెన్స్ గురించి తెలుసుకోవచ్చు. టెస్ట్ రైడ్ తర్వాత, ఆసక్తి గల కస్టమర్‌లు కొనుగోలు ప్రక్రియను కొనసాగించవచ్చు. ఈ టెస్ట్ రైడ్ తర్వాత డెలివరీలు 2021 డిసెంబర్ 01 నుంచి 31 మధ్యలో జరుగుతాయని కంపెనీ తెలిపింది.

 ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్ ప్రారంభించిన Ola: డెలివరీలు ఎప్పుడంటే?

కస్టమర్ కు టెస్ట్ రైడ్‌లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ నచ్చితేనే కొనుగోలు చేయవచ్చు, లేకుంటే మీ బుకింగ్ రద్దు చేసుకోవచ్చు. ఈ అవకాశం కంపెనీ కల్పిస్తుంది. కంపెనీ 2021 సెప్టెంబర్ 15 నుంచి విక్రయాలను ప్రారంభించింది. విక్రయాలు ప్రారంభమైన 2 రోజుల్లో కంపెనీ దాదాపు 5,500 స్కూటర్లు విక్రయించినట్లు తెలిపింది. వీటి ధర సుమారు రూ. 1,100 కోట్లు. ఇది నిజంగా అద్భుతమైన రికార్డ్.

 ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్ ప్రారంభించిన Ola: డెలివరీలు ఎప్పుడంటే?

ఇదిలా ఉండగా Ola కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ ఇటీవల ఒక ట్వీట్ చేసారు. ఇందులో Ola Electric Scooter పరిపరి విధాలుగా టెస్ట్ కి గురి కావడం చూడవచ్చు. ఈ వీడియో చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది, ఇందులో ఎటువంటి సందేహం లేదు.

 ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్ ప్రారంభించిన Ola: డెలివరీలు ఎప్పుడంటే?

Ola కంపెనీ S1 మరియు S1 ప్రో స్కూటర్‌లు రెండింటిని 2021 ఆగస్టు 15 న దేశీయ మార్కెట్లో విడుదల విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో Ola S1 ధర రూ. 99,999 (ఎక్స్-షోరూమ్) కాగా Ola S1 Pro ధర రూ. 1,29,999 (ఎక్స్-షోరూమ్) గా ఉంది.

 ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్ ప్రారంభించిన Ola: డెలివరీలు ఎప్పుడంటే?

Ola S1 అనేది చాలా ప్రాథమికమైన మోడల్. అయితే ఇది దాని పవర్ ఫిగర్‌లలో ఎక్కువ భాగం ఇందులో ఖరీదైన S1 Pro మోడల్ తో పంచుకుంటుంది. ఏదేమైనప్పటికీ, ఈ రెండు ఎలక్ట్రిక్ ఓలా స్కూటర్లు కూడా ఇంటీరియర్ పర్మనెంట్ మాగ్నెట్ టైప్ (IPM) మిడ్-డ్రైవ్ మోటారు ద్వారా పనిచేస్తాయి. ఈ మోటార్ 7.37 బిహెచ్‌పి శక్తిని మరియు 58 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

 ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్ ప్రారంభించిన Ola: డెలివరీలు ఎప్పుడంటే?

ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ లో 2.98 kWh బ్యాటరీ ప్యాక్ ని కలిగి ఉంటుంది, ఇది పూర్తి ఛార్జ్‌పై 121 కిలోమీటర్ల రేంజ్ ను ఆఫర్ చేస్తుంది. కాగా, ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ లో 3.97 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది పూర్తి చార్జ్ పై గరిష్టంగా 181 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుంది.

 ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్ ప్రారంభించిన Ola: డెలివరీలు ఎప్పుడంటే?

Ola ఎస్1 ప్రో లోని బ్యాటరీ ప్యాక్ ను సాధారణ వాల్ సాకెట్‌తో చార్జ్ చేయడానికి సుమారు ఆరు గంటల ముప్పై నిమిషాల సమయం పడుతుంది. కాగా, ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ లోని చిన్న బ్యాటరీ ప్యాక్ ను పూర్తిగా చార్జ్ చేయడానికి నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాల సమయం పడుతుంది. అయితే, వీటిని ఓలా హైపర్‌ చార్జర్‌ సాయంతో కనెక్ట్ చేసినప్పుడు S1 మరియు S1 Pro రెండు మోడళ్లను కేవలం 18 నిమిషాల్లో 75 కిలోమీటర్ల రేంజ్ కు సరిపడా చార్జ్ చేసుకోవచ్చు.

 ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్ ప్రారంభించిన Ola: డెలివరీలు ఎప్పుడంటే?

ఓలా ఎస్1 మరియు ఎస్1 ప్రో రెండూ మోడళ్లలో కూడా నార్మల్ మరియు స్పోర్ట్స్ అనే రెండు రకాల రైడింగ్ మోడ్‌లు ఉంటాయి. అయితే, ఖరీదైన ఎస్1 ప్రో మోడల్ మాత్రం అదనంగా హైపర్ అనే మూడవ రైడింగ్ మోడ్‌ లభిస్తుంది. ఈ మోడ్ లో స్కూటర్ గరిష్ట వేగంతో నడపవచ్చు. ఓలా ఎస్1 గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లు కాగా, ఎస్1 ప్రో గరిష్ట వేగం గంటకు 115 కిలోమీటర్లుగా ఉంటుంది.

 ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్ ప్రారంభించిన Ola: డెలివరీలు ఎప్పుడంటే?

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ 1859 మిమీ పొడవు, 712 మిమీ వెడల్పు మరియు 1160 మిమీ ఎత్తును కలిగి ఉంటాయి. రెండు స్కూటర్ల వీల్‌బేస్ పొడవు 1359 మిమీ మరియు 36 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ స్పేస్ ని కలిగి ఉంటాయి. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల సీట్ ఎత్తు 792 మిమీ మరియు గ్రౌండ్ క్లియరెన్స్ 165 మిమీగా ఉంటుంది. ఓలా ఎస్1 బరువు 121 కేజీలు కాగా, ఎస్1 ప్రో బరువు 125 కేజీల వరకు ఉంటుంది.

 ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్ ప్రారంభించిన Ola: డెలివరీలు ఎప్పుడంటే?

ఓలా ఎస్1 మరియు ఎస్1 ప్రో స్కూటర్స్ అద్భుతమైన ఫీచర్స్ కలిగి ఉంటాయి. ఇందులో జియో-ఫెన్సింగ్, ప్రాక్సిమిటీ లాక్/అన్‌లాక్, రిమోట్ బూట్ లాక్/అన్‌లాక్, వైఫై మరియు బ్లూటూత్ కనెక్టివిటీ, GPS, వెహికల్ ట్రాకింగ్ మరియు రివర్స్ మోడ్ వంటి అనేక ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. అయితే, ఎస్1 ప్రో లో హిల్ హోల్డ్, క్రూయిజ్ కంట్రోల్ మరియు వాయిస్ అసిస్టెంట్ వంటి ప్రత్యేకమైన ఫీచర్లు లభిస్తాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 10 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, November 10, 2021, 12:26 [IST]
English summary
Ola electric will starts today s1 s1 pro scooters test ride details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+