Ola ఎలక్ట్రిక్ హైపర్ ఛార్జర్ వచ్చేసింది: కేవలం 18 నిముషాల ఛార్జ్ 75 కి.మీ పరిధి

అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన Ola కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క టెస్ట్ రైడ్ 2021 నవంబర్ 10 న ప్రారంభించనున్నట్లు తెలిపింది. అయితే కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క టెస్ట్ రైడ్ ప్రారంభించక ముందే Ola S1 ఎలెక్ట్రిక్ స్కూటర్ యొక్క మొదటి హైపర్‌ఛార్జర్‌ను విడుదల చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

Ola ఎలక్ట్రిక్ హైపర్ ఛార్జర్ వచ్చేసింది: కేవలం 18 ల ఛార్జ్ 75 కి.మీ పరిధి

Ola ఎలక్ట్రిక్ CEO భవిష్ అగర్వాల్ హైపర్‌చార్జర్ ద్వారా ఎల్లో కలర్ S1 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఛార్జ్ చేస్తున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఇందులో "మొదటి OlaElectric హైపర్‌ఛార్జర్ విడుదలైంది, ఉదయం ట్రిప్ తరువాత నా S1 స్కూటర్ చేస్తున్నాను, అని పేర్కొన్నారు.

Ola ఎలక్ట్రిక్ హైపర్ ఛార్జర్ వచ్చేసింది: కేవలం 18 ల ఛార్జ్ 75 కి.మీ పరిధి

కంపెనీ ఇప్పటికే తమ కస్టమర్ల కోసం అనుకూలంగా ఉండే 'హైపర్‌ఛార్జర్' సెటప్ అందిస్తామని ప్రకటించింది, ఇందులో భాగంగానే కంపెనీ ఇప్పుడు తన మొదటి 'హైపర్‌ఛార్జర్' స్టేషన్ ఏర్పాటు చేసింది. ఈ హైపర్‌ఛార్జర్‌లు దేశంలో మొత్తం 400 నగరాల్లో 1,00,000 ప్రదేశాలలో/టచ్‌పాయింట్‌లలో ఇన్‌స్టాల్ చేయబడతాయి.

Ola ఎలక్ట్రిక్ హైపర్ ఛార్జర్ వచ్చేసింది: కేవలం 18 ల ఛార్జ్ 75 కి.మీ పరిధి

Ola కంపెనీ ప్రారంభించే ఈ హైపర్‌ఛార్జర్స్ కేవలం 18 నిముషాల్లో ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీని 0 నుంచి 50 శాతం వరకు ఛార్జ్ చేస్తుంది. ఈ ఛార్జింగ్ తో దాదాపు 75 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఇది నిజంగా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది, మరియు సమయాన్ని ఆదా చేస్తుంది.

Ola ఎలక్ట్రిక్ హైపర్ ఛార్జర్ వచ్చేసింది: కేవలం 18 ల ఛార్జ్ 75 కి.మీ పరిధి

Ola కంపెనీ ఇప్పటికే తన వెబ్‌సైట్ లో నగరాల వారీగా ఛార్జింగ్ నెట్‌వర్క్ లొకేషన్ ప్లాన్‌లను జాబితా చేస్తుంది. అంతే కాకుండా ఇందులో టైర్-I మరియు టైర్-II కింద నగరాలలో దాని ఛార్జింగ్ నెట్‌వర్క్ ఏర్పాటు చేయబడతాయి. హైపర్‌ఛార్జర్ స్టేషన్‌లు ఒకేసారి బహుళ కస్టమర్‌లకు మద్దతు ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుంది.

Ola ఎలక్ట్రిక్ హైపర్ ఛార్జర్ వచ్చేసింది: కేవలం 18 ల ఛార్జ్ 75 కి.మీ పరిధి

ఓలా ఎలక్ట్రిక్ ఎస్ 1 మరియు ఎస్ 1 ప్రో స్కూటర్‌లు రెండూ 2021 ఆగస్టు 15 న దేశీయ మార్కెట్లో విడుదల చేయబడ్డాయి. ఇందులో Ola S1 ఎక్స్-షోరూమ్ ధర రూ. 99,999 కాగా Ola S1 Pro ఎక్స్-షోరూమ్ ధర రూ. 1,29,999 గా ఉంది. ఇవి ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో నిక్షిప్తమై ఉంటాయి. బుకింగ్స్ కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి, ఇక డెలివరీలు వచ్చే నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము.

Ola ఎలక్ట్రిక్ హైపర్ ఛార్జర్ వచ్చేసింది: కేవలం 18 ల ఛార్జ్ 75 కి.మీ పరిధి

Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 120 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఇది 10 కలర్ ఆప్షన్‌లతో లభిస్తుంది మరియు 3.97 కిలో వాట్ బ్యాటరీ ప్యాక్‌తో జతచేయబడిన 8.5 kW ఎలక్ట్రిక్ మోటార్‌ని ప్యాక్ చేస్తుంది. ఇక Ola S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకే ఛార్జ్‌పై 180 కిమీల కంటే ఎక్కువ ప్రయాణాన్ని అందిస్తుంది.

Ola ఎలక్ట్రిక్ హైపర్ ఛార్జర్ వచ్చేసింది: కేవలం 18 ల ఛార్జ్ 75 కి.మీ పరిధి

Ola Electric స్కూటర్ మూడు వేర్వేరు డ్రైవింగ్ మోడ్‌లను కలిగి ఉంటుంది. అవి నార్మల్, స్పోర్ట్ మరియు హైపర్ మోడ్స్. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అద్భుతమైన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండటం మాత్రమే కాకుండా, మంచి పనితీరుని కూడా అందిస్తుంది.

Ola ఎలక్ట్రిక్ హైపర్ ఛార్జర్ వచ్చేసింది: కేవలం 18 ల ఛార్జ్ 75 కి.మీ పరిధి

ఓలా ఫ్యూచర్‌ఫ్యాక్టరీ ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అత్యంత అధునాతన ద్విచక్ర వాహనాల తయారీ కేంద్రంగా ఇప్పటికే పేర్కొనబడింది. గత ఆరు నెలల్లో నిర్మించిన ఈ ఫ్యాక్టరీని పూర్తిగా 10,000 మంది మహిళా ఉద్యోగులు నిర్వహిస్తున్నారు. కంపెనీ ప్లాంట్ మొదటి దశ నిర్మాణం ప్రారంభమైన ఆరు నెలల్లోనే మొదటి ఈ-స్కూటర్ ఫ్యాక్టరీ నుండి బయటకు వచ్చింది. ఇది నిజంగా ప్రశంసించదగ్గ విషయం.

Ola ఎలక్ట్రిక్ హైపర్ ఛార్జర్ వచ్చేసింది: కేవలం 18 ల ఛార్జ్ 75 కి.మీ పరిధి

Ola Electric యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్స్ దేశీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే మంచి ప్రజాదరణ పొందాయి. అంతే కాకుండా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం విదేశీ కస్టమర్లు కూడా ఎదురు చూస్తున్నారు. కావున ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫ్రికా, యూరప్ మరియు అమెరికాలో విడుదల చేయాలని కంపెనీ సీఈవో భవిష్ అగర్వాల్ స్పష్టం చేసారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు 2022 నుండి విదేశీ మార్కెట్లో కూడా అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Monday, October 25, 2021, 12:00 [IST]
English summary
Ola introduced first electric hypercharger in india details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+