మీకు తెలుసా.. ఓలా నుంచి రానున్న ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే
ఎలక్ట్రిక్ వాహనాలకు భారత మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ కారణంగానే చాలా కంపెనీలు తమ బ్రాండ్స్ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ మరియు కార్లను విడుదల చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ క్యాబ్ కంపెనీ ఓలా కూడా దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేయడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తోందన్న సంగతి తెలిసిందే. కంపెనీ విడుదల చేయనున్న ఎలక్ట్రిక్స్ స్కూటర్ కి సంబంధించిన టీజర్ వీడియో కూడా ఇటీవల అధికారికంగా వెలువడింది.

ఇటీవల కంపెనీ అందించిన లేటెస్ట్ సమాచారం ప్రకారం, ఓలా ఎలక్ట్రిక్ భారతదేశంలో సిరీస్ ఎస్, ఎస్ 1 మరియు ఎస్ 1 ప్రో పేర్లను నమోదు చేస్తుంది. ఇప్పుడు లీకైన కొన్ని డాక్యుమెంట్స్ ప్రకారం ఓలా తన ఎలక్ట్రిక్ స్కూటర్‌కు 'సిరీస్ ఎస్' అని పేరు పెట్టవచ్చు. ఇంకా, ఈ స్కూటర్‌ను ఎస్ 1 మరియు ఎస్ 1 ప్రో అనే రెండు వేరియంట్లలో కూడా అందించే అవకాశం ఉంది. ఈ అన్ని మోడల్స్ లైట్ వెయిట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ విభాగంలో చేర్చబడ్డాయి.

ఎలక్ట్రిక్ స్కూటర్ల ఉత్పత్తి త్వరలో ప్రారంభం కానుంది. దీనికి కోసం కంపెనీ తమిళనాడులో ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహనాల కర్మాగారాన్ని నిర్మిస్తోంది. ఓలా తన ఎలక్ట్రిక్ స్కూటర్ ధరను ఈ నెల చివరిలో లేదా వచ్చే నెల ప్రారంభంలో అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి ఛార్జీతో 100 నుంచి 150 కిలోమీటర్ల పరిధిని ఇవ్వగలదు. అంతే కాకుండా దీని టాప్ స్పీడ్ గంటకు 90 కిమీ వరకు ఉంటుంది. ఇటువంటి మంచి స్పెసిఫికేషన్స్ వల్ల ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ దేశంలోని కొన్ని హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో చేరి మంచి పోటీని ఇవ్వగలదు.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ హార్జ్ చేయడానికి స్టాండర్డ్ వాల్ సాకెట్‌పై అమర్చగల హోమ్ ఛార్జర్ అందించబడుతుంది. స్కూటర్ పూర్తిగా ఛార్జ్ చేయడానికి 2 గంటల నుంచి 2.5 గంటలు సమయం పడుతుంది. ఓలా స్కూటర్ భారత మార్కెట్లో విడుదలైన తర్వాత ఏథర్ 450 ఎక్స్‌కి ప్రత్యక్ష ప్రత్యర్థిగా ఉండనుంది. అంతే కాకుండా ఇది బజాజ్ చేతక్ మరియు టివిఎస్ ఐక్యూబ్ వంటి ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్లకు కూడా ప్రత్యర్థిగా ఉంటుంది.

ఓలా యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అనేక లేటెస్ట్ ఫీచర్స్ ఉంటాయి. ఈ స్కూటర్‌లో ఎల్‌ఈడీ లైట్లు, డిజిటల్ డిస్ప్లే, క్లౌడ్ కనెక్టివిటీ, రిమూవబుల్ లిథియం-అయాన్ బ్యాటరీ, టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్, అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం ప్రారంభ దశలో ఏటా 20 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను ప్లాంట్‌లో తయారు చేయడానికి కావలసిన సన్నాహాలను సిద్ధం చేస్తోంది. ఆదిమాత్రమే కాకుండా కంపెనీ యొక్క కార్యకలాపాలు పూర్తిగా ప్రారంభమైన తర్వాత, ఈ ప్లాంటుకు ప్రతి సంవత్సరం ఏకంగా కోటి వాహనాలను తయారు చేసే సామర్థ్యం ఉంటుంది.

ఈ మొత్తంలో ఎలక్ట్రిక్ వాహనాలను తయారుచేయడానికి ఈ ప్లాంట్ రోజుకు 25 వేల బ్యాటరీలను తయారు చేయనున్నారు. మేడ్-ఇన్-ఇండియా స్కూటర్లు భారత మార్కెట్లో మాత్రమే కాకుండా యూరప్, ఇంగ్లాండ్, లాటిన్ అమెరికా, ఆసియా పసిఫిక్, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ వంటి దేశాలకు ఎగుమతి చేయబడతాయి. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








