ఎలక్ట్రిక్ స్కూటర్ టీజర్ విడుదల చేసిన ఓలా; వీడియో అదిరి పోలా..

భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు రోజు రోజుకి డిమాండ్ బాగా పెరుగుతున్న నేపథ్యంలో వాహన తయారీ దారులు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేసి విక్రయిస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా దేశంలో పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా కూడా వాహన వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించడానికి సుముఖత చూపుతున్నారు. ఈ కారణంగానే ఇప్పటికే మార్కెట్లో చాలా వరకు ఎలక్ట్రిక్ వాహనాలు అడుగుపెట్టాయి.

ఇదిలా ఉండగా ఇప్పుడు ప్రముఖ క్యాబ్ కంపెనీ ఓలా తన బ్రాండ్ నుంచి ఎలక్ట్రిక్ వాహాన్ని విడుదల చేయడానికి శ్రీకారం చుట్టింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఎలక్ట్రిక్ స్కూటర్ టీజర్ విడుదల చేసిన ఓలా; వీడియో అదిరి పోలా..

ఓలా కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ తయారీలో నిమగ్నమైన సంగతి ఇంతకు ముందు కథనాల్లో తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఈ కంపెనీ త్వరలో ఈ స్కూటర్ ని భారతీయ విపణిలోకి విడుదల చేయనుంది. దీనిని ద్రువీకరించడానికి ఒక వీధిలో కూడా విడుదల చేసింది. ఈ వీడియోలో కంపెనీ విడుదల చేయబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ గమనించవచ్చు.

ఎలక్ట్రిక్ స్కూటర్ టీజర్ విడుదల చేసిన ఓలా; వీడియో అదిరి పోలా..

ఎలక్ట్రిక్ స్కూటర్ల ఉత్పత్తి త్వరలో ప్రారంభం కానున్న తమిళనాడులో నిర్మిస్తున్న ఓలా కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన సంస్థగా నిలువనుంచి. స్కూటర్ ఎప్పుడు లాంచ్ అవుతుందో ఓలా అధికారికంగా వెల్లడించనప్పటికీ, కంపెనీ సీఈఓ 'భవష్ అగర్వాల్' ఈ స్కూటర్ లాంచ్‌కు సిద్ధంగా ఉన్నట్లు చూపించే వీడియోను విడుదల చేశారు.

ఎలక్ట్రిక్ స్కూటర్ టీజర్ విడుదల చేసిన ఓలా; వీడియో అదిరి పోలా..

ఓలా సిఇఒ తన ట్విట్టర్ అకౌంట్ లో ఈ స్కూటర్ కి సంబంధించిన వీడియోను విడుదల చేసాడు. ఈ వీడియోలో అతను ఈ స్కూటర్‌ను నడుపుతున్నట్లు తెలుస్తుంది. కంపెనీకి సంబంధించిన సమాచారం ప్రకారం, ఓలా తన ఎలక్ట్రిక్ స్కూటర్ ధరను ఈ నెల చివరిలో లేదా వచ్చే నెల ప్రారంభంలో వెల్లడించే అవకాశం ఉంది.

ఎలక్ట్రిక్ స్కూటర్ టీజర్ విడుదల చేసిన ఓలా; వీడియో అదిరి పోలా..

త్వరలో భారత మార్కెట్లో విడుదల కానున్న ఈ కొత్త ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్, ఏథర్ 450 ఎక్స్‌కి ప్రత్యర్థిగా ఉంటుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి ఛార్జీతో దాదాపు 100 నుంచి 150 కిలోమీటర్ల పరిధిని ఇవ్వగలదు. అదే సమయంలో, దాని వేగం గంటకు 90 కిమీ వరకు ఉంటుంది.

ఎలక్ట్రిక్ స్కూటర్ టీజర్ విడుదల చేసిన ఓలా; వీడియో అదిరి పోలా..

ఓలా స్కూటర్ ఛార్జ్ చేయడానికి సాధారణ వాల్ సాకెట్‌పై అమర్చగల హోమ్ ఛార్జర్ అందించబడుతుంది. స్కూటర్ పూర్తిగా ఛార్జ్ చేయడానికి 2 నుంచి 2.5 గంటలు సమయం పడుతుంది. ఇది చూడటానికి చాలా సింపుల్ గా ఉన్నప్పటికీ మంచి పనితీరుని అందిస్తుంది.

ఎలక్ట్రిక్ స్కూటర్ టీజర్ విడుదల చేసిన ఓలా; వీడియో అదిరి పోలా..

ఓలా యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అనేక లేటెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి, ఇందులో ఎల్‌ఈడీ లైట్లు, డిజిటల్ డిస్ప్లే, క్లౌడ్ కనెక్టివిటీ, రిమూవబుల్ లిథియం-అయాన్ బ్యాటరీ, టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్, అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు అందించబడతాయి.

ఎలక్ట్రిక్ స్కూటర్ టీజర్ విడుదల చేసిన ఓలా; వీడియో అదిరి పోలా..

ఓలా ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కర్మాగారాన్ని తమిళనాడులో ఏర్పాటు చేసింది. ఈ ప్లాంటును నిర్మించడానికి దాదాపు 2,400 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టబడింది. ఈ ప్లాంట్‌లో ప్రతి 2 సెకన్లకు 1 ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రొడక్షన్ లైన్ నుండి వస్తుందని కంపెనీ ఇంతకు ముందు తెలిపింది.

ఎలక్ట్రిక్ స్కూటర్ టీజర్ విడుదల చేసిన ఓలా; వీడియో అదిరి పోలా..

ఈ ప్లాంట్ ప్రారంభంలో 2 వేలకు పైగా ప్రజలకు ఉపాధి కల్పిస్తుంది మరియు పూర్తిగా పనిచేసేటప్పుడు ఇక్కడ దాదాపు 10,000 మందికి ఉపాధి లభిస్తుంది. ప్రారంభ దశలో ఏటా 20 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను ప్లాంట్‌లో తయారు చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. అదే సమయంలో, కార్యకలాపాలు పూర్తిగా ప్రారంభమైన తర్వాత, ఈ ప్లాంటుకు ప్రతి సంవత్సరం 1 కోటి వాహనాలను తయారు చేసే సామర్థ్యం ఉంటుంది.

ఈ కొత్త ఓలా ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఈ ప్లాంట్ రోజుకు 25 వేల బ్యాటరీలను తయారు చేస్తుంది. మేడ్-ఇన్-ఇండియా స్కూటర్లు భారతదేశంలో విక్రయించబడకుండా యూరప్, యుకె, లాటిన్ అమెరికా, ఆసియా పసిఫిక్, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ వంటి దేశాలకు ఎగుమతి చేయబడతాయి.

ఎలక్ట్రిక్ స్కూటర్ టీజర్ విడుదల చేసిన ఓలా; వీడియో అదిరి పోలా..

ఓలా కంపెనీ తమ ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను కూడా నిర్మిస్తోంది. 'హైపర్‌ఛార్జ్ నెట్‌వర్క్' అభివృద్ధిని కంపెనీ ఇటీవల వెల్లడించింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ నెట్‌వర్క్. ఈ నెట్‌వర్క్ ఓలా రాబోయే ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ సౌకర్యాన్ని అందిస్తుంది. ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇలాంటి అనేక సదుపాయాలు కలిగి ఉన్న ఓలా త్వరలో భారత మార్కెట్లో మంచి గుర్తింపు పొందే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Ola Electric Scooter First Official Video Revealed. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X