ఆ నగరాల్లో ప్రారంభమైన Ola Electric స్కూటర్ డెలివరీలు.. నెక్స్ట్ ఎక్కడ?

ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్లు దేశీయ మార్కెట్లో విదుడైనప్పటి నుంచి ఎంతోమంది ప్రజలు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం వేచి చూస్తున్నాము. అయితే ఇటీవల కాలంలోనే కంపెనీ తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల యొక్క డెలివరీలను ప్రారంభించింది. ఓలా కంపెనీ గత వారం తమ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలను బెంగళూరు మరియు చెన్నై వంటి నగరాల్లో ప్రారంభించింది. అయితే ఈ వారం వైజాగ్, పూణే, అహ్మదాబాద్ మరియు ముంబై వంటి అనేక నగరాల్లో డెలివరీలను ప్రారంభించింది.

ఆ నగరాల్లో ప్రారంభమైన Ola Electric స్కూటర్ డెలివరీలు.. నెక్స్ట్ ఎక్కడ?

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డెలివరీలు ప్రస్తుతానికి కొన్ని ప్రధాన నగరాలకు మాత్రమే పరిమితమైనప్పటికీ, త్వరలో దేశవ్యాప్తంగా 1,000 కంటే ఎక్కువ నగరాల్లో తన స్కూటర్లను డెలివరీ చేయనుంది. Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్ ప్రారంభమైన తర్వాత, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ దేశవ్యాప్తంగా 1,000 కంటే ఎక్కువ నగరాల నుండి బుకింగ్‌లను పొందిందని కంపెనీ తెలియజేసింది.

ఆ నగరాల్లో ప్రారంభమైన Ola Electric స్కూటర్ డెలివరీలు.. నెక్స్ట్ ఎక్కడ?

ఓలా కంపెనీ ఇప్పటివరకు దేశంలో ఒక్క డీలర్‌షిప్‌ను కూడా ప్రారంభించలేదు, కావున కస్టమర్లకు కంపెనీ నేరుగా డెలివరీ చేస్తోంది. ఈ కారణంగానే డెలివరీలు చాలా వేగంగా జరుగుతున్నాయి. త్వరలో ఈ డెలివరీలు మరింత వేగవంతం అయ్యే అవకాశం ఉంటుంది.

ఆ నగరాల్లో ప్రారంభమైన Ola Electric స్కూటర్ డెలివరీలు.. నెక్స్ట్ ఎక్కడ?

ఓలా తన ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలను ప్రారంభించడంలో చాలా ఆలస్యం చేసింది. కానీ ఇప్పుడు కంపెనీ బుక్ చేసుకున్న కస్టమర్లకు డెలివరీ చేస్తోంది. డెలివరీల జాప్యంపైన ఇంతకు ముందు కస్టమర్లు కొంత నిరాశను వ్యక్తం చేసినప్పటికీ ఇప్పుడు డెలివరీలను పొంది శాంతపడుతున్నారు.

ఆ నగరాల్లో ప్రారంభమైన Ola Electric స్కూటర్ డెలివరీలు.. నెక్స్ట్ ఎక్కడ?

ప్రస్తుతం కంపెనీ పూర్తి సామర్థ్యంతో ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉత్పత్తి చేస్తున్నట్లు, త్వరలోనే అన్ని నగరాలకు డెలివరీలను చేసేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. కానీ ప్రస్తుతం సెమీ కండక్టర్ కొరత కారణంగా కొత్త కస్టమర్లు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలను పొందటానికి 2 నుంచి 3 నెలల సమయం వేచి ఉండాల్సి వస్తోంది.

ఆ నగరాల్లో ప్రారంభమైన Ola Electric స్కూటర్ డెలివరీలు.. నెక్స్ట్ ఎక్కడ?

ఓలా ఎలక్ట్రిక్ యొక్క S1 స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 99,999 కాగా, S1 ప్రో ధర రూ. 1,29,999 (ఎక్స్-షోరూమ్). ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది.

ఆ నగరాల్లో ప్రారంభమైన Ola Electric స్కూటర్ డెలివరీలు.. నెక్స్ట్ ఎక్కడ?

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ సింపుల్‌ డిజైన్ కలిగి ఉంటుంది. ఈ బైక్ ఫ్రంట్ ఆప్రాన్‌ మధ్యలో OLA బ్యాడ్జ్‌తో చూడవచ్చు. స్కూటర్ ముందు భాగంలో ఉన్న ఏకైక ఫీచర్ హెడ్‌ల్యాంప్స్ క్లస్టర్, ఇందులో ఎల్ఈడీ డిఆర్ఎల్ ల చుట్టూ ట్విన్-పాడ్ ఎల్ఈడీ సెటప్ ఉంటుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లో క్షితిజ సమాంతరంగా అమర్చిన ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌లు, ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్స్, రియర్ ఫుట్-రెస్ట్ మరియు కాంటూర్డ్ సీట్లు ఉన్నాయి.

ఆ నగరాల్లో ప్రారంభమైన Ola Electric స్కూటర్ డెలివరీలు.. నెక్స్ట్ ఎక్కడ?

అంతే కాకూండా ఇందులో అల్లాయ్ వీల్స్, 36-లీటర్ అండర్-సీట్ స్టోరేజ్, రియర్ గ్రాబ్ రైల్స్, ఫ్రంట్ స్టోరేజ్ పాకెట్స్, లగేజ్ హుక్ మరియు రబ్బర్-లైన్డ్ ఫ్రంట్ ఫుట్‌వెల్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క కొలతల విషయానికి వస్తే, ఇది 1860 మిమీ పొడవు, 700 మిమీ వెడల్పు, 1155 మిమీ ఎత్తు, 1345 మిమీ వీల్‌బేస్ మరియు 74 కిలోల బరువు ఉంటుంది.

ఆ నగరాల్లో ప్రారంభమైన Ola Electric స్కూటర్ డెలివరీలు.. నెక్స్ట్ ఎక్కడ?

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు వేర్వేరు డ్రైవింగ్ మోడ్‌లను కలిగి ఉంటుంది. అవి నార్మల్, స్పోర్ట్ మరియు హైపర్ మోడ్స్. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అద్భుతమైన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండటం మాత్రమే కాకుండా, మంచి పనితీరుని కూడా అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 10 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది.

ఆ నగరాల్లో ప్రారంభమైన Ola Electric స్కూటర్ డెలివరీలు.. నెక్స్ట్ ఎక్కడ?

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ 3.9 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది. దీని ఎలక్ట్రిక్ మోటార్ 8.5 kW గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీని 750W సామర్థ్యం గల పోర్టబుల్ ఛార్జర్‌తో దాదాపు 6:30 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఇది కాకుండా, ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 18 నిమిషాల్లో 75% వరకు ఛార్జ్ చేయబడుతుంది.

ఆ నగరాల్లో ప్రారంభమైన Ola Electric స్కూటర్ డెలివరీలు.. నెక్స్ట్ ఎక్కడ?

ఓలా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అనేక కొత్త మరియు ఆధునిక ఫీచర్లను అందించింది. Ola S1 పూర్తి ఛార్జ్‌పై 121 కిమీల రేంజ్‌ను అందిస్తుంది, అయితే హై ఎండ్ వేరియంట్ S1 ప్రో 181 కిమీల పరిధిని కలిగి ఉంది. ఈ రెండు స్కూటర్ల టాప్ స్పీడ్ విషయానికి వస్తే, Ola S1 గరిష్టంగా 90 km/h వేగంతో, Ola S1 Pro గరిష్టంగా 115 km/h వేగంతో రైడ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది.

Most Read Articles

English summary
Ola s1 electric scooter delivery city details
Story first published: Friday, December 24, 2021, 12:10 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X