Ola ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకున్నారా.. అయితే ఇది మీ కోసమే

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకున్న వారికి ఇప్పుడు ఒక శుభవార్త. మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మీ చెంతకు (డెలివరీ) చేరడానికి మరెంతో కాలం వేచి ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ గురించి ప్రస్తావించారు.

Ola ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకున్నారా.. అయితే ఇది మీ కోసమే

కంపెనీ సీఈఓ భవిష్ అగార్వల్ తెలిపినదాని ప్రకారం ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు 2021 డిసెంబర్ 15 నుంచి ప్రారంభమవుతాయి. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ లో అధికారికంగా పేర్కొన్నారు. కావున త్వరలో మీ స్కూటర్ డెలివరీ చేయబడుతుంది.

Ola ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకున్నారా.. అయితే ఇది మీ కోసమే

సాధారణంగా మునుపటి నివేదికల ప్రకారం, ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మొదటి బ్యాచ్ డెలివరీ 2021 అక్టోబర్ 25 మరియు నవంబర్ 25 మధ్య జరగాల్సి ఉంది, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడింది. ఈ కారణంగా కంపెనీ సమయానికి డెలివరీ చేయలేకపోతుందని, కాబట్టి డెలివరీకి మరికొన్ని రోజులు వేచి ఉండాల్సి ఉంటుందని బుక్ చేసుకున్న కస్టమర్లకు కంపెనీ తర్వాత ఇ-మెయిల్‌లో తెలిపింది.

Ola ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకున్నారా.. అయితే ఇది మీ కోసమే

ఓలా ఎలక్ట్రిక్ 2021 ఆగష్టు 15 న ఓలా ఎస్1 మరియు ఓలా ఎస్1 ప్రో అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. ఇందులో, Ola S1 యొక్క ఎక్స్-షోరూమ్ ధర రూ. 99,999 కాగా, Ola S1 ప్రో ధర రూ. 1,29,999 (ఎక్స్-షోరూమ్). కంపెనీ ఈ స్కూటర్ విడుదలకు ముందే కేవలం రూ. 499 లకు బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించింది.

Ola ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకున్నారా.. అయితే ఇది మీ కోసమే

కంపెనీ అతి తక్కువ కాలంలోనే అత్యధిక సంఖ్యలో బుకింగ్స్ స్వీకరించగలిగింది. అంతే కాకుండా కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్ ప్రారంభించిన కేవలం రెండు రోజుల్లోనే రూ.1,100 కోట్లను ఆర్జించగలిగింది. కంపెనీ ఇప్పటికే టెస్ట్ రైడ్ కూడా ప్రారంభించింది.

Ola ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకున్నారా.. అయితే ఇది మీ కోసమే

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ముందుగా బుక్ చేసుకున్న వినియోగదారులకు మాత్రమే టెస్ట్ రైడ్‌లను అందిస్తోంది. గత వారం ఓలా 20,000 మంది కస్టమర్లకు స్కూటర్ టెస్ట్ రైడ్‌లను అందించింది. అయితే ఈ నెలలో కంపెనీ ప్రతిరోజూ 10,000 మంది వినియోగదారులకు టెస్ట్ రైడ్‌లను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Ola ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకున్నారా.. అయితే ఇది మీ కోసమే

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ సింపుల్‌ డిజైన్ కలిగి ఉంటుంది. ఈ బైక్ ఫ్రంట్ ఆప్రాన్‌ మధ్యలో OLA బ్యాడ్జ్‌తో చూడవచ్చు. స్కూటర్ ముందు భాగంలో ఉన్న ఏకైక ఫీచర్ హెడ్‌ల్యాంప్స్ క్లస్టర్, ఇందులో ఎల్ఈడీ డిఆర్ఎల్ ల చుట్టూ ట్విన్-పాడ్ ఎల్ఈడీ సెటప్ ఉంటుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లో క్షితిజ సమాంతరంగా అమర్చిన ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌లు, ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్స్, రియర్ ఫుట్-రెస్ట్ మరియు కాంటూర్డ్ సీట్లు ఉన్నాయి.

Ola ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకున్నారా.. అయితే ఇది మీ కోసమే

అంతే కాకూండా ఇందులో అల్లాయ్ వీల్స్, 36-లీటర్ అండర్-సీట్ స్టోరేజ్, రియర్ గ్రాబ్ రైల్స్, ఫ్రంట్ స్టోరేజ్ పాకెట్స్, లగేజ్ హుక్ మరియు రబ్బర్-లైన్డ్ ఫ్రంట్ ఫుట్‌వెల్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క కొలతల విషయానికి వస్తే, ఇది 1860 మిమీ పొడవు, 700 మిమీ వెడల్పు, 1155 మిమీ ఎత్తు, 1345 మిమీ వీల్‌బేస్ మరియు 74 కిలోల బరువు ఉంటుంది.

Ola ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకున్నారా.. అయితే ఇది మీ కోసమే

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు వేర్వేరు డ్రైవింగ్ మోడ్‌లను కలిగి ఉంటుంది. అవి నార్మల్, స్పోర్ట్ మరియు హైపర్ మోడ్స్. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అద్భుతమైన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండటం మాత్రమే కాకుండా, మంచి పనితీరుని కూడా అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 10 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది.

Ola ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకున్నారా.. అయితే ఇది మీ కోసమే

ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు కస్టమర్ల సౌలభ్యం కోసం, ఫైనాన్స్ సదుపాయాలను అందించడానికి HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, కోటక్ మహీంద్రా ప్రైమ్ మరియు టాటా క్యాపిటల్‌ వంటి వాటితో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసే కస్టమర్లకు ఈ బ్యాంకులు ఫైనాన్స్ సదుపాయాన్ని కల్పిస్తాయి. కావున ఇది కొనుగోలుదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

Ola ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకున్నారా.. అయితే ఇది మీ కోసమే

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ 3.9 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది. దీని ఎలక్ట్రిక్ మోటార్ 8.5 kW గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీని 750W సామర్థ్యం గల పోర్టబుల్ ఛార్జర్‌తో దాదాపు 6:30 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఇది కాకుండా, ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 18 నిమిషాల్లో 75% వరకు ఛార్జ్ చేయబడుతుంది.

Ola ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకున్నారా.. అయితే ఇది మీ కోసమే

ఓలా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అనేక కొత్త మరియు ఆధునిక ఫీచర్లను అందించింది. Ola S1 పూర్తి ఛార్జ్‌పై 121 కిమీల రేంజ్‌ను అందిస్తుంది, అయితే హై ఎండ్ వేరియంట్ S1 ప్రో 181 కిమీల పరిధిని కలిగి ఉంది. ఈ రెండు స్కూటర్ల టాప్ స్పీడ్ విషయానికి వస్తే, Ola S1 గరిష్టంగా 90 km/h వేగంతో, Ola S1 Pro గరిష్టంగా 115 km/h వేగంతో రైడ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Monday, December 6, 2021, 11:32 [IST]
English summary
Ola s1 electric scooter delivery to begin on 15th december
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+