Ola ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్ షురూ.. ఇక డెలివరీలు కూడా వచ్చేస్తున్నాయ్

భారతీయ మార్కెట్లో Ola ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకున్న వాహన ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న Ola ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క టెస్ట్ రైడ్ ఎట్టకేలకు ప్రారంభించబడింది. కంపెనీ ఇదివరకు చెప్పిన విధంగా ప్రస్తుతం ప్రధాన నగరాల్లో ఒకటైన కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులో మాత్రమే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క టెస్ట్ ప్రారంభమైంది. అయితే త్వరలో దేషములో అన్ని ప్రధాన నగరాలలోనూ ఈ Ola ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్ ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది.

Ola ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్ షురూ.. ఇక డెలివరీలు కూడా వచ్చేస్తున్నాయ్

Ola ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డెలివరీ ఈ నెల చివరిలో ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అంతే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ పొందటానికి కస్టమర్లు ఇప్పుడు ఎక్కువరోజులు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. త్వరలోనే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రోడ్డుపైన కనిపిస్తుంది.

Ola ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్ షురూ.. ఇక డెలివరీలు కూడా వచ్చేస్తున్నాయ్

Ola ఎలక్ట్రిక్ కంపెనీ CEO భవిష్ అగర్వాల్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క టెస్ట్ రైడ్ చిత్రాలతో పాటు మొదటి రోజు జరిగిన కార్యకలాపాలను చూపించే వీడియోను కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి కంపెనీ ఉద్యోగులు కస్టమర్లకు వివరిస్తూ, ఆ తర్వాత కస్టమర్లు స్వయంగా దాన్ని వాస్తవ ప్రపంచంలో పరీక్షిస్తున్నట్లు మీరు ఈ వీడియోలో చూడవచ్చు.

Ola ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్ షురూ.. ఇక డెలివరీలు కూడా వచ్చేస్తున్నాయ్

ఓలా ఎలక్ట్రిక్ ఈ మధ్య కాలంలోనే ఒక అద్భుతమైన వీడియో కూడా రిలీజ్ చేసింది. ఈ వీడియోలో ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క స్టంట్స్, ర్యాంప్ నుండి దూకడం, వేగంగా బ్రేకులు వేయడం, ముందు చక్రాన్ని పైకి లేపి పరీక్షించడం వంటి విన్యాసాలు ఈ వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో మీరు గమనించినట్లయితే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అన్ని విధాలా రైడింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది అని నిర్దారించబడుతుంది.

Ola ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్ షురూ.. ఇక డెలివరీలు కూడా వచ్చేస్తున్నాయ్

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క తదుపరి బ్యాచ్ విక్రయాలు 2021 నవంబర్ 1 నుండి ప్రారంభం కావాలి, కానీ ఇప్పుడు అది రద్దు చేయబడింది. అయితే తదుపరి విక్రయాలు 2021 డిసెంబర్‌ నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కావున ఇకపై ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకునే వారికి ఈ స్కూటర్ డెలివరీ మరింత ఆలస్యం అవుతుంది అని స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఇప్పుడు బుక్ చేసుకునే వారికీ డెలివరీలు వచ్చే సంవత్సరం జరుగుతాయి.

Ola ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్ షురూ.. ఇక డెలివరీలు కూడా వచ్చేస్తున్నాయ్

Ola కంపెనీ S1 మరియు S1 ప్రో స్కూటర్‌లు రెండింటిని 2021 ఆగస్టు 15 న దేశీయ మార్కెట్లో విడుదల విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో Ola S1 ధర రూ. 99,999 (ఎక్స్-షోరూమ్) కాగా Ola S1 Pro ధర రూ. 1,29,999 (ఎక్స్-షోరూమ్) గా ఉంది.

Ola ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్ షురూ.. ఇక డెలివరీలు కూడా వచ్చేస్తున్నాయ్

Ola Electric స్కూటర్ మూడు వేర్వేరు డ్రైవింగ్ మోడ్‌లను కలిగి ఉంటుంది. అవి నార్మల్, స్పోర్ట్ మరియు హైపర్ మోడ్స్. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అద్భుతమైన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండటం మాత్రమే కాకుండా, మంచి పనితీరుని కూడా అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 10 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది.

Ola ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్ షురూ.. ఇక డెలివరీలు కూడా వచ్చేస్తున్నాయ్

Ola Electric స్కూటర్ 3.9 కిలో వాట్ సామర్థ్యం కలిగిన లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది. దీని ఎలక్ట్రిక్ మోటార్ 8.5 kW గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఓలా స్కూటర్ యొక్క బ్యాటరీని 750W సామర్థ్యం గల పోర్టబుల్ ఛార్జర్‌తో సుమారు 6 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఇది కాకుండా, ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 18 నిమిషాల్లో 75% వరకు ఛార్జ్ చేయబడుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఓలా అనేక కొత్త మరియు ఆధునిక ఫీచర్లను చేర్చింది.

Ola ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్ షురూ.. ఇక డెలివరీలు కూడా వచ్చేస్తున్నాయ్

ఓలా S1 ఒక పూర్తి ఛార్జ్‌పై 121 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది, అయితే హై-ఎండ్ వేరియంట్ S1 Pro మాత్రం 181 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల గరిష్ట వేగం గంటకు 90 కి.మీ. అంతే కాకూండా, ఈ స్కూటర్ కేవలం 3 సెకన్లలో గంటకు 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.

Ola ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్ షురూ.. ఇక డెలివరీలు కూడా వచ్చేస్తున్నాయ్

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేయడానికి కస్టమర్లకు EMI ఎంపిక కూడా అందుబాటులో ఉంటుంది. మీరు EMI లేదా లోన్ తీసుకొని కొనుగోలు చేయాలనుకుంటే, మీరు బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, కోటక్ మహీంద్రా ప్రైమ్, టాటా క్యాపిటల్ మరియు యెస్ బ్యాంక్ నుండి ఏదైనా ఒక బ్యాంకును ఎంచుకోవచ్చు. ఇవన్నీ కూడా ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.

Ola ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్ షురూ.. ఇక డెలివరీలు కూడా వచ్చేస్తున్నాయ్

ఓలా ఫ్యూచర్‌ఫ్యాక్టరీ ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అత్యంత అధునాతన ద్విచక్ర వాహనాల తయారీ కేంద్రంగా ఇప్పటికే పేర్కొనబడింది. గత ఆరు నెలల్లో నిర్మించిన ఈ ఫ్యాక్టరీని పూర్తిగా 10,000 మంది మహిళా ఉద్యోగులు నిర్వహిస్తున్నారు. కంపెనీ ప్లాంట్ మొదటి దశ నిర్మాణం ప్రారంభమైన ఆరు నెలల్లోనే మొదటి ఈ-స్కూటర్ ఫ్యాక్టరీ నుండి బయటకు వచ్చింది. ఇది నిజంగా ప్రశంసించదగ్గ విషయం.

Ola ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్ షురూ.. ఇక డెలివరీలు కూడా వచ్చేస్తున్నాయ్

Ola Electric యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్స్ దేశీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే మంచి ప్రజాదరణ పొందాయి. అంతే కాకుండా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం విదేశీ కస్టమర్లు కూడా ఎదురు చూస్తున్నారు. కావున ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫ్రికా, యూరప్ మరియు అమెరికాలో విడుదల చేయాలని కంపెనీ సీఈవో భవిష్ అగర్వాల్ స్పష్టం చేసారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు 2022 నుండి విదేశీ మార్కెట్లో కూడా అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Friday, November 12, 2021, 9:46 [IST]
English summary
Ola s1 electric scooter test ride begins details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+