Electric Scooter టెస్ట్ రైడ్ డేట్ వెల్లడించిన Ola.. ఎప్పుడో తెలుసా..!!

భారతీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన Ola Electric ఇటీవల తన ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బుకింగ్స్ మళ్ళీ ప్రారంభించింది. దీనికి సంబందించిన సమాచారం ఇటీవల విడుదలైంది. అయితే ఇప్పుడు కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క టెస్ట్ రైడ్ కి సంబందించిన సమాచారం విడుదల చేసింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

Electric Scooter టెస్ట్ రైడ్ డేట్ వెల్లడించిన Ola.. ఎప్పుడో తెలుసా..!!

నివేదికల ప్రకారం, Ola Electric Scooter యొక్క టెస్ట్ రైడ్ 2021 అక్టోబర్ 25 నుండి ప్రారంభించబోతున్నట్లు కంపెనీ అధికారికంగా తెలిపింది. అయితే ఈ టెస్ట్ రైడ్ ఏ నగరంలో ఎప్పుడు ప్రారంభమౌతుంది అనే విషయం త్వరలో తెలుస్తుంది. అయితే మొదట ఈ టెస్ట్ రైడ్‌లు ప్రధాన నగరాలలో నిర్వహించబడుతుంది.

Electric Scooter టెస్ట్ రైడ్ డేట్ వెల్లడించిన Ola.. ఎప్పుడో తెలుసా..!!

ప్రస్తుతం Ola Electric కంపెనీకి దేశంలో ఎక్కడా ఒక్క డీలర్‌షిప్‌ కూడా లేదు, కావున ఈ టెస్ట్ రైడ్ అనేది ఎలా నిర్వహించబడుతుందో కూడా తెలియాలి. ప్రస్తుతం ఒక్క డీలర్‌షిప్‌ కూడా లేకపోయినప్పటికీ దేశవ్యాప్తంగా 1,000 నగరాలకు పైగా విక్రయిస్తుంది. ప్రస్తుతం టెస్ట్ రైడ్ కొన్ని ప్రధాన నగరాల్లో మాత్రమే నిర్వహించబడే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము. తరువాత ఇతర నగరాల్లో టెస్ట్ రైడ్ నిర్వహించవచ్చు.

Electric Scooter టెస్ట్ రైడ్ డేట్ వెల్లడించిన Ola.. ఎప్పుడో తెలుసా..!!

Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు 2021 నవంబర్ 1 నుంచి తిరిగి కొనుగోలు చేయవచ్చు. దీని అమ్మకం ఇంతకు ముందు సెప్టెంబర్ 15 నుండి ప్రారంభమైంది కానీ పరిమిత కస్టమర్‌లు మాత్రమే పొందటానికి కంపెనీ అవకాశం కల్పించింది. అయితే ఇప్పుడు రెండవ దశలో, వచ్చే నెల ప్రారంభం నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ నుండి ఈ స్కూటర్ డెలివరీ 1,000 నగరాల్లో ప్రారంభం కానుంది. దీనికి సంబందించిన సమాచారం ఇప్పటికే వినియోగాదారులకు కంపెనీ పంపడం ప్రారంభించింది.

Electric Scooter టెస్ట్ రైడ్ డేట్ వెల్లడించిన Ola.. ఎప్పుడో తెలుసా..!!

ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ చేయడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తోంది. దీనికోసం ఉత్పత్తి కూడా చాలా వేగంగా జరుగుతోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉత్పత్తి కోసం కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహనాల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది.

Electric Scooter టెస్ట్ రైడ్ డేట్ వెల్లడించిన Ola.. ఎప్పుడో తెలుసా..!!

Ola Electric ప్రస్తుతం భారత మార్కెట్లో Ola S1 మరియు Ola S1 Pro అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. ఇందులో Ola S1 ఎక్స్-షోరూమ్ ధర రూ. 99,999 కాగా Ola S1 Pro ఎక్స్-షోరూమ్ ధర రూ. 1,29,999 గా ఉంది.

Ola Electric స్కూటర్ 3.9 కిలో వాట్ సామర్థ్యం కలిగిన లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది. దీని ఎలక్ట్రిక్ మోటార్ 8.5 kW గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఓలా స్కూటర్ యొక్క బ్యాటరీని 750W సామర్థ్యం గల పోర్టబుల్ ఛార్జర్‌తో సుమారు 6 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఇది కాకుండా, ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 18 నిమిషాల్లో 75% వరకు ఛార్జ్ చేయబడుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఓలా అనేక కొత్త మరియు ఆధునిక ఫీచర్లను చేర్చింది.

Electric Scooter టెస్ట్ రైడ్ డేట్ వెల్లడించిన Ola.. ఎప్పుడో తెలుసా..!!

ఓలా S1 ఒక పూర్తి ఛార్జ్‌పై 121 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది, అయితే హై-ఎండ్ వేరియంట్ S1 Pro మాత్రం 181 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల గరిష్ట వేగం గంటకు 90 కి.మీ. అంతే కాకూండా, ఈ స్కూటర్ కేవలం 3 సెకన్లలో గంటకు 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.

Electric Scooter టెస్ట్ రైడ్ డేట్ వెల్లడించిన Ola.. ఎప్పుడో తెలుసా..!!

Ola Electric స్కూటర్ మూడు వేర్వేరు డ్రైవింగ్ మోడ్‌లను కలిగి ఉంటుంది. అవి నార్మల్, స్పోర్ట్ మరియు హైపర్ మోడ్స్. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అద్భుతమైన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండటం మాత్రమే కాకుండా, మంచి పనితీరుని కూడా అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 10 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది.

Electric Scooter టెస్ట్ రైడ్ డేట్ వెల్లడించిన Ola.. ఎప్పుడో తెలుసా..!!

Ola Electric యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్స్ దేశీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే మంచి ప్రజాదరణ పొందాయి. అంతే కాకుండా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం విదేశీ కస్టమర్లు కూడా ఎదురు చూస్తున్నారు. కావున ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫ్రికా, యూరప్ మరియు అమెరికాలో విడుదల చేయాలని కంపెనీ సీఈవో భవిష్ అగర్వాల్ స్పష్టం చేసారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు 2022 నుండి విదేశీ మార్కెట్లో కూడా అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి.

Electric Scooter టెస్ట్ రైడ్ డేట్ వెల్లడించిన Ola.. ఎప్పుడో తెలుసా..!!

Ola Electric దేశీయ మార్కెట్లో విడుదలైనప్పటినుంచి ఎంతోమంది కస్టమర్లు దీని కోసం లేచి చూస్తున్నారు. అయితే ఇప్పుడు కంపెనీ ఎట్టకేలకు టెస్ట్ రైడ్స్ ప్రారంభించింది, కావున ఇక కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ చేయటానికి ఎంతో సమయం పట్టదు, కావున కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ త్వరలో డెలివరీ ప్రక్రియను ప్రారంభిస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, October 7, 2021, 14:19 [IST]
English summary
Ola s1 electric scooter test ride to start from 25th october details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+