Ola S1 Pro రివ్యూ వీడియో.. మీ డౌట్స్ అన్ని ఇక్కడ క్లియర్

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ (Ola Electric Scooter) దేశీయ మార్కెట్లో 2021 ఆగష్టు 15 న అధికారికంగా విడుదలైంది. అయితే విడుదలైన అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ స్కూటర్ మార్కెట్లో విడుదల కాకముందునుంచే ప్రజల నుంచి విపరీతమైన ఆదరణ పొందింది. ఈ కారణంగానే బుకింగ్స్ కూడా భారీ స్థాయిలో పొందగలిగింది. ఇప్పుడు ఎక్కువ మంది ప్రజలు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ కోసం ఎదురు చూస్తున్నారు.

Ola Electric Scooter బుక్ చేసుకున్న కస్టమర్లు ఈ స్కూటర్ గురించి పూర్తి సమాచారం తెలియదు. కావున ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్ల సందేహాలను తీర్చడానికి మేము ఇటీవల Ola Electric యొక్క S1 Pro Scooter ను బెంగుళూరు నగరం శివార్లలో రైడ్ చేసాము. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మరింత సమాచారం కోసం ఈ కింది వీడియో చూడండి.

Ola S1 Pro Scooter లేటెస్ట్ డిజైన్ మరియు ఆధునిక ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో డిజిటల్ కీ, ఇన్-బిల్ట్ నావిగేషన్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, వాయిస్ కంట్రోల్, మల్టిపుల్ రైడర్ ప్రొఫైల్‌లు మరియు స్కూటర్ ట్రాకింగ్ వంటి ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.

Ola S1 Pro స్కూటర్ 3.97 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ పొందుతుంది. ఇది 5.5 kW ఎలక్ట్రిక్ మోటార్ తో జత చేయబడి ఉంటుంది. ఇది గరిష్టంగా 58 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. Ola స్కూటర్ హోమ్ ఛార్జర్ ద్వారా 6 గంటల 30 నిమిషాలలో బ్యాటరీని 0-100% ఛార్జ్ చేస్తుంది. హైపర్‌చార్జర్‌లు బ్యాటరీని కేవలం 18 నిమిషాల్లోనే 75 కిలోమీటర్ల పరిధిని అందించగల చార్జింగ్‌ను చేసుకోగలదు.

Ola S1 Pro రివ్యూ వీడియో

S1 Pro స్కూటర్ కేవలం 3 సెకన్లలో 0-40 km/h నుండి వేగవంతం అవుతుంది. అయితే 60km/h కేవలం 5 సెకన్లలోనే చేరుకుంటుంది. మొత్తానికి ఇది అద్భుతమైన పనితీరుని అందిస్తుంది. ఓలా స్కూటర్ 3 రైడింగ్ మోడ్‌లను పొందుతుంది. అవి స్టాండర్డ్, స్పోర్ట్స్ మరియు హైపర్ మోడ్స్. అంతే కాకుండా ఇది 10 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Monday, November 15, 2021, 14:06 [IST]
English summary
Ola s1 pro electric scooter review video
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+